మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన Hero Splendor.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్..

భారత టూవీలర్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ (Hero Spelndor) కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశపు అత్యంత సరసమైన మరియు అత్యధిక మైలేజీనిచ్చే మోటార్‌సైకిళ్లలో ఒకటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో స్ప్లెండర్ దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడయ్యే టూవీలర్లలో అగ్రస్థానంలో ఉంటుంటుంది. గడచిన డిసెంబర్ నెలలో కూడా హీరో స్ప్లెండర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. డిసెంబర్ 2021 నెలలో, హీరో మోటోకార్ప్ మొత్తం 2,26,759 యూనిట్ల స్ప్లెండర్ బైక్‌లను భారత మార్కెట్లో విక్రయించింది. డిసెంబర్ 2020 నెలలో విక్రయించిన 1,94,930 యూనిట్లతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 16.3 శాతం పెరిగాయి.

మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన Hero Splendor.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్..

గత కొన్ని సంవత్సరాలుగా హీరో స్ప్లెండర్ అమ్మకాల రేసులో మొదటి స్థానంలో ఉంటోంది. అలాగే, గత నెలలో కూడా అత్యధికంగా 1,94,930 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రెండవ స్థానాన్ని హోండా అందిస్తున్న పాపులర్ స్కూటర్ హోండా యాక్టివా (Honda Activa) దక్కించుకుంది. గత డిసెంబర్‌లో మొత్తం 1,04,417 హోండా యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి. అయితే, ఇవి డిసెంబర్ 2020 నెలలో విక్రయించిన 1,34,077 యాక్టివా స్కూటర్ల కన్నా 22.1 శాతం తగ్గాయి.

మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన Hero Splendor.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్..

ఈ విభాగంలోని హోండా యాక్టివా తర్వాత హీరో మోటోకార్ప్ అందిస్తున్న బడ్జెట్ మోటార్‌సైకిల్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Delux) మూడవ స్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 83,080 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లు అమ్ముడయ్యాయి. అయితే, ఇవి డిసెంబర్ 2020 నెలలో విక్రయించిన 1,41,168 హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లతో పోల్చుకుంటే 41.1 శాతం తగ్గాయి. ఆ తర్వాతి స్థానంలో హోండా అందిస్తున్న మరొక పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సిబి షైన్ (Honda CB Shine) నిలిచింది. నాల్గవ స్థానంలో ఉన్న హోండా సిబి షైన్ గత నెలలో మొత్తం 68,061 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన Hero Splendor.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్..

ఈ డిసెంబర్ 2020 నెలలో విక్రయించిన 56,003 యూనిట్ల హోండా సిబి షైన్ బైక్‌లతో పోల్చుకుంటే, గత నెలలో అమ్మకాలు గరిష్టంగా 21.5 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. ఇక ఈ జాబితా ఐదవ స్థానంలో ఉన్నది బజాజ్ పల్సర్ (Bajaj Pulsar) బైక్‌లు. డిసెంబర్ 2021లో మొత్తం 64,966 బజాజ్ పల్సర్ బైక్‌లు విక్రయించబడ్డాయి. కానీ డిసెంబర్ 2020 సమయంలో బజాజ్ పల్సర్ బైక్‌ల అమ్మకాల సంఖ్య దాదాపు 75 వేలు దాటింది.

మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన Hero Splendor.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్..

గత నెలలో 44,800 యూనిట్ల విక్రయాలతో బజాజ్ ఆటో అందిస్తున్న కమ్యూటర్ మోటార్‌సైకిల్ ప్లాటినా (Bajaj Platina) ఆరవ స్థానంలో నిలిచింది. అయితే, ఈ బజాజ్ బైక్ అమ్మకాలు మాత్రం వార్షికంగా 45.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. డిసెంబర్ 2020లో కేవలం 30,740 ప్లాటినా మోటార్‌సైకిళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని తర్వాత టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న పాపులర్ స్కూటర్ మోడల్ అయిన జూపిటర్ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది.

మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన Hero Splendor.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్..

గత నెలలో మొత్తం 38,142 జూపిటర్ (TVS Jupiter) స్కూటర్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 2020 కూడా దాదాపు అదే సంఖ్యలో టీవీఎస్ జూపిటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ టాప్-10 2-వీలర్స్ సేల్స్ జాబితాలో హోండా యాక్టివా కు పోటీగా ఉన్న టీవీఎస్ జూపిటర్ అమ్మకాల పరంగా మాత్రం 7వ స్థానంలో ఉంది. అయితే, సుజుకి యాక్సెస్ గత కొన్ని సంవత్సరాలుగా హోండా యాక్టివా తర్వాత అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ మోడల్‌గా రెండవ స్థానంలో ఉండేది. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని టీవీఎస్ జూపిటర్ దక్కించుకుంది.

మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన Hero Splendor.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) మోటార్‌సైకిల్ ఈ టాప్-10 జాబితాలో 8వ స్థానంలో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో మొత్తం 38,142 క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. అయితే, డిసెంబర్ 2020 నెలలో విక్రయించిన అమ్మకాలతో పోలిస్తే క్లాసిక్ గత నెలలో 350 బైక్‌ల విక్రయాల దాదాపు 11.6 శాతం తగ్గాయి. ఎందుకంటే గతేడాది ఇదే సమయంలో కంపెనీ దాదాపు 40 వేలకు పైగా క్లాసిక్ మోటార్‌సైకిల్లను విక్రయించింది.

మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన Hero Splendor.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్..

ఈ జాబితాలో తదుపరి స్థానలో మన ఊరి బండి టీవీఎస్ ఎక్స్ఎల్100 (TVS XL100) 9వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే టీవీఎస్ ఎక్స్ఎల్100 బైక్‌లు గత డిసెంబర్‌లో మొత్తం 33,395 యూనిట్లుగా ఉన్నాయి. కానీ డిసెంబర్ 2020లో మాత్రం ఈ మోడల్ అమ్మకాలు గత నెల కంటే రెండింతలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక ఈ జాబితాలో చివరి స్థానం (10వ స్థానంలో) ఉన్నది హీరో గ్లామర్ మోడల్ గత నెలలో హీరో గ్లామర్ అమ్మకాలు 64.2 వృద్ధిని నమోదు చేశాయి.

Most Read Articles

English summary
Top 10 best selling two wheelers in december 2021 hero splendor tops list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X