భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే 100సీసీ, 125సీసీ కమ్యూటర్ బైక్‌ల తర్వాత 150సీసీ, 160సీసీ కమ్యూటర్ బైక్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇవి 125సీసీ బైక్‌ల కంటే మెరుగైన పవర్ మరియు పికప్‌ను కలిగి ఉంటాయి. అలాగే, ఇవి అందించే మైలేజీలో కూడా పెద్దగా తేడాలు ఉండదు. ఒకవేళ మీరు కూడా మీ కోసం ఒక బైక్ 150-160సీసీ బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 150-160సీసీ బైక్‌లు ఏవి మరియు వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

1. హోండా యునికార్న్ (Honda Unicorn)

ఈ జాబితాలో ముందుగా వినిపించేది మరియు కనిపించేది హోండా యునికార్న్ పేరు. జపనీస్ టూవీలర్ బ్రాండ్ నుండి లభిస్తున్న బెస్ట్ 160సీసీ కమ్యూటర్ బైక్ ఇది. అటు పెర్ఫార్మెన్స్ లోనూ ఇటు మైలేజ్ లోనూ ది బెస్ట్ గా ఉంటుంది హోండా యునికార్న్. భారత మార్కెట్లో హోండా యునికార్న్ ధరలు రూ. 1.02 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతాయి. ఇందులో 162.7 సిసి ఫ్యూయల్ ఇంజెక్టెడ్ బిఎస్6 ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 12.91 బిహెచ్‌పి శక్తిని మరియు 14 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

ఈ బైక్‌లో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హాలోజన్ హెడ్‌లైట్, హాలోజన్ టెయిల్ లైట్, క్లియర్ టర్న్ ఇండికేటర్స్ మరియు 14 లీటర్ల ఇంధన ట్యాంక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, హోండా యునికార్న్ డ్రమ్ మరియు సింగిల్ డిస్క్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో సింగిల్ ఛానల్ ఏబిఎస్ డిస్క్ బ్రేక్ వేరియంట్‌ కూడా లభిస్తోంది. ఈ బైక్ లో ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఉంటాయి. హోండా యునికార్న్ 1 లీటర్ పెట్రోలుతో సుమారు 50-52 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

2. బజాజ్ పల్సర్ 150 (Bajaj Pulsar 150)

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ విక్రయిస్తున్న పాపులర్ 150సీసీ బైక్ పల్సర్. ఇది చాలా కాలంగా భారత మార్కెట్‌లో అమ్మకానికి ఉంది మరియు యువతలో అత్యంత ప్రసిద్ధి చెందిన మోటార్‌సైకిల్ గా ఉంది. ధర విషయానికి వస్తే, బజాజ్ పల్సర్ 150 ధరలు రూ.1.03 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతాయి. ఈ బైక్‌ లో 13.8 బిహెచ్‌పి పవర్ మరియు 13.25 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేసే 149.9 సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంటుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

బజాజ్ పల్సర్ 150 సింగిల్ మరియు డ్యూయల్ డిస్క్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఏబిఎస్ ఫీచర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులోని ఇంజన్ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ లో ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్‌, 15-లీటర్ ఇంధన ట్యాంక్‌ మరియు డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది సిటీ రైడ్‌లో 1 లీటర్ ఇంధనంతో 48-50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

3. టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి (TVS Apache RTR 160 4V)

దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయిస్తున్న పవర్‌ఫుల్ 160సీసీ బైక్ TVS Apache RTR 160 4V. ఇది ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత స్పోర్టీగా కనిపించే మోటార్‌సైకిల్. ఈ బైక్‌లో ఎల్‌ఈడి హెడ్‌లైట్, ఎల్‌ఈడి టెయిల్‌ల్యాంప్ మరియు ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా, ఇందులో బ్లూటూత్ ఫీచర్‌ కూడా లభిస్తుంది. ఈ బైక్ డ్రమ్ బ్రేక్, సింగిల్ డిస్క్ మరియు రియర్ డిస్క్ బ్రేక్ వంటి ఆప్షన్‌లలో లభిస్తుంది. మార్కెట్లో టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి ధర రూ.1.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

ఈ బైక్ లో 159.7సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, BS6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 17.38 బిహెచ్‌పి పవర్ ను మరియు 14.73 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ ఉండి, ఇది మెరుగైన థ్రోటల్ రెస్ఫాన్స్ ను అందిస్తుంది. ఫలితంగా, ఇది రైడింగ్ లో ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. ట్రాఫిక్‌లో ఈ బైక్‌ను సులభంగా నడపడానికి వీలుగా టీవీఎస్ ఇందులో కొత్త గ్లైడ్-త్రూ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. దీని కారణంగా ఇది ట్రాఫిక్‌లో వేగవంతం కాకుండా గంటకు 6-7 కిమీ వేగంతో నడుస్తుంది ఫలితంగా ఇంధనం ఆదా అవుతుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

4. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ (Hero Xtreme 160R)

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ అందిస్తున్న బెస్ట్ 160సీసీ కమ్యూటర్ బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, ఇది కూడా అపాచే మాదిరిగానే స్పోర్టీగా కనిపించే కమ్యూటర్ బైక్. ఈ బైక్‌లోని లైటింగ్ మొత్తం ఎల్‌ఈడి రూపంలో ఉంటుంది. ఇందులోని 160సీసీ ఫ్యూయల్ ఇంజెక్ట్, ఎయిర్-కూల్డ్, BS6 ఇంజన్ గరిష్టంగా 15.2 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 4.7 సెకన్లలో 0-60 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ దృఢమైన డైమండ్ ఛాసిస్‌పై నిర్మించబడింది. ఈ బైక్ యొక్క మెరుగైన నిర్వహణ కోసం, ముందు వైపున 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున 7-దశల్లో సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. భారత మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 1.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. హీరో మోటోకార్ప్ తమ Xtreme 160R యొక్క Xtec వేరియంట్ కూడా విక్రయిస్తోంది. ఇది పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లతో లభిస్తుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

5. యమహా ఎఫ్‌జెడ్ ఎస్ (Yamaha FZ S)

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా అందిస్తున్న ఎఫ్‌జెడ్ఎస్ ఓ మంచి స్పోర్టీ బైక్. ఈ బైక్ రైడింగ్ పొజిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. యమహా ఎఫ్‌జెడ్ ఎస్ బైక్ లో ఎల్‌ఈడి హెడ్‌లైట్, ఫుల్ డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు లభిస్తాయి. దేశీయ మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్ ఎస్ నేక్డ్ స్పోర్టీ బైక్ ధర రూ. 1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 150-160సీసీ స్కూటర్ ఏది..?

ఈ బైక్ డ్యూయల్ టోన్ కలర్స్, అద్భుతమైన బాడీ గ్రాఫిక్స్, అల్లాయ్ వీల్స్ మరియు టూ-టోన్ కలర్ సీట్లు వంటి డిజైన్ ఎలిమెంట్స్ తో చాలా స్టైలిష్ అప్పీల్‌ను కలిగి ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఎఫ్‌జెడ్ ఎస్ బైక్ 150సీసీ బ్లూకోర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 12.4 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 13.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Top 5 150 160cc bikes in india unicorn pulsar apache and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X