Just In
- 19 min ago
ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!
- 1 hr ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 1 hr ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 3 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
Don't Miss
- Technology
Reliance నుంచి Jio 5G Phone ..! ధర & స్పెసిఫికేషన్లు వివరాలు
- Lifestyle
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- Movies
Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?
- Sports
India Playing XI vs ZIM 1st ODI: రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! ఇసాన్ కిషన్ డౌట్!
- News
ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్
- Finance
SBI: ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు.. ఆ కస్టమర్లకు నెలకు మూడుసార్లు.. 10 రకాల సేవలు ఉచితంగా..
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
భారతీయ మార్కెట్లో తక్కువ ధరకే లభించే టాప్ 5 అడ్వెంచర్ బైకులు.. ఇవే: చూసారా..!!
భారతీయ మార్కెట్లో సాధారణ బైకులు వినియోగించే వారి సంఖ్య కంటే అడ్వెంచర్ బైకులు వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే దీని అర్థం అడ్వెంచర్ బైకులు వినియోగించేవారు తక్కువగా ఉన్నారని కాదు. దేశీయ మార్కెట్లో అడ్వెంచర్ బైకులు చాలా ఖరీదైనవి, ఈ కారణంగానే ఎక్కువ సంఖ్యలో అడ్వెంచర్ బైకులు వినియోగించడానికి కొంత సంకోచిస్తున్నారు. అయితే అడ్వెంచర్ బైకులు వినియోగించాలి అనుకునే వారి కోసం అతి తక్కువ ధరకే లభించే టాప్ 5 బైకులను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. రండి.

దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు వచ్చిన తరువాత అడ్వెంచర్ విభాగం జోరుగా ముందుకు సాగింది. ఈ విభాగంలో చాలా బైకులు పుట్టుకొచ్చాయి. ఇందులో ప్రధానంగా హీరో ఎక్స్‌పల్స్ 200 4వి, హోండా సిబి200ఎక్స్, సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్, యెజ్దీ అడ్వెంచర్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ చెప్పుకోదగ్గవి.

1) హీరో ఎక్స్‌పల్స్ 200 4వి (Hero XPulse 200 4V):
భారతీయ మార్కెట్లో అతి తక్కువ ధరకే లభించే టాప్ 5 అడ్వెంచర్ బైకులలో 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి' (Hero XPulse 200 4V) ఒకటి. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1,32,350. ఈ బైక్ లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఇంహులో ఎల్ఈడీ హెడ్‌లైట్లు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, రెండు ట్రిప్ మీటర్లు మరియు ఒక సింగిల్ ఛానల్ ఏబీఎస్ తో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి బైక్ 199.6 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.8 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

2) హోండా సిబి200ఎక్స్ (Honda CB200X):
మనం చెప్పుకుంటున్న టాప్ 5 అడ్వెంచర్ బైకుల జాబితాలో రెండవది హోండా సిబి200ఎక్స్ (Honda CB200X). దీని హర భారతీయ మార్కెట్లో రూ. 1,42,499 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఇందులోని విండ్‌స్క్రీన్ సాధారణంగా అడ్వెంచర్ బైక్‌లలో కనిపించే దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది.

హోండా సిబి200ఎక్స్ (Honda CB200X) బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఉన్న 184.4 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

3) సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX):
భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX) బైక్ ధర రూ. 2,11,600. సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ 250 బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ పొందుతుంది. ఈ హెడ్‌ల్యాంప్ కావలసినదానికంటే కూడా ఎక్కువ వెలుతురుని అందిస్తుంది. ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేక్‌లు, USB ఛార్జింగ్ మరియు ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

ఈ బైక్‌లో 249 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 9,300 ఆర్‌పిఎమ్ వద్ద 26.1 బిహెచ్‌పి పవర్ మరియు 7,300 ఆర్‌పిఎమ్ వద్ద 22.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 అనేది అడ్వెంచర్ రైడింగ్ కి మాత్రమే కాకూండా రోజువారీ ప్రయాణాలకు కూడా ఉపయోగపడే మల్టీపర్పస్ బైక్.

4) యెజ్దీ అడ్వెంచర్ (Yezdi Adventure):
ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన యెజ్దీ అడ్వెంచర్ (Yezdi Adventure) ధర రూ.2,09,900 నుంచి రూ.2,18,900 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. యెజ్దీ అడ్వెంచర్ మొత్తం మూడు కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్లిక్ సిల్వర్, మంబో బ్లాక్ మరియు రేంజర్ కామో కలర్స్. ఈ బైక్ ధరలు కలర్ ఆప్సన్ ఆధారంగా నిర్ణయించబడతాయి.

యెజ్డీ అడ్వెంచర్ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 334 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 30 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ 29.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.

5) రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan):
మనం చెప్పుకుంటున్న టాప్ 5 అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan) అత్యంత ప్రజాదరణపొందిన బైక్. దీని ధర రూ. 2,14,519 నుంచి రూ. 2,22,159 వరకు ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఎక్కువమంచి వినియోగదారులు ఇష్టపడే అడ్వెంచర్ ఇదే అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ బైక్ ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

హిమాలయన్ డ్యూయల్-పర్పస్ టైర్లలో 21-ఇంచెస్ ఫ్రంట్ మరియు 17-ఇంచెస్ రియర్ వీల్స్ కలిగి ఉంటాయి. ఇది డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 411 సిసి, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ మార్కెట్లో అడ్వెంచర్ బైకులకు మంచి ఆదరణ ఉంది. అయితే చాలామంది తక్కువ ధర వద్ద లభించే అడ్వెంచర్ బైకుల కొనుగోలు కోసం వేచి చూస్తుంటారు. అలంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం అందించడం జరిగింది. ఇందులో మీకు నచ్చిన బైక్ మరియు ఇతర అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.