బజాజ్ యొక్క కొత్త 'పల్సర్ పి150' గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు.. ఇవే

దేశీయ మార్కెట్లో బైక్ ప్రేమికుల కోసం విడుదలైన కొత్త 'బజాజ్ పల్సర్ పి150' (Pulsar P150) అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి చాలా స్టైలిష్‌గా ఉంది.

కొత్త బజాజ్ పల్సర్ పి150 బైక్ కొనాలనుకునే కస్టమర్లు ఈ బైక్ గురించి మొత్తమ్ సమాచారం తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు. కావున, అలాంటి వారి కోసం ఈ కథనంలో 'పల్సర్ పి150'లో తెలుసుకోవలసిన విషయాలను తెలుసుకుందాం.

కొత్త బజాజ్ పల్సర్ పి150 గురించి తెలుగుకోవలసిన 5 విషయాలు

వేరియంట్స్ మరియు ధరలు:

బజాజ్ పల్సర్ పి150 రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి సింగిల్ సీట్ కలిగిన 'సింగిల్ డిస్క్' వేరియంట్. దీని ధర రూ. 1,16,755 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). కాగా రెండవ వేరియంట్ స్ప్లిట్ సీట్ కలిగిన 'ట్విన్ డిస్క్' వేరియంట్. ఈ వేరియంట్ ధర రూ. 1,19,757 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ రెండు బైకులు వేటికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

డిజైన్:

కొత్త బజాజ్ పల్సర్ పి150 బైక్ దాని పల్సర్ N250 మరియు N160 నుంచి ప్రేరణ పొందింది. కావున ఇది చూడగానే వాటిని గుర్తుకు తెస్తుంది. అయితే ఇందులో బై ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్‌ మరియు చిన్న విండ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఇంజన్ కౌల్స్ మరియు ఎల్ఈడీ టైల్‌లైట్స్ ఉండటం వల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఫీచర్స్:

బజాజ్ పల్సర్ పి150 లో చెప్పుకోదగిన మరో విషయం ఏమిటంటే కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది ఇటీవలి కొత్త పల్సర్‌లలో కనిపించే కొత్త సెమీ డిజిటల్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను పొందుతోంది. ఇందులో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ మరియు USB ఛార్జింగ్ పోర్ట్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు డిస్టెన్స్ టు ఎంప్టీ రీడౌట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

పల్సర్ పి150 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 149 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.5 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది, ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు.

కలర్ ఆప్సన్స్ & ప్రత్యర్థులు:

ఈ లేటెస్ట్ బైక్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ మరియు ఎబోనీ బ్లాక్ వైట్ కలర్స్. అదే సమయంలో ఈ బైక్ దేశీయ మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 2వి మరియు హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'బజాజ్ పల్సర్ పి150' దాని విభాగంలో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవలసి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, November 24, 2022, 8:00 [IST]
English summary
Top five highlights about new bajaj pulsar p150
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+