2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

2022 చివరి నెల, చివరి వారంలో ఉన్నాము, చాలా మంది రాబోయే కొత్త సంవత్సరం కోసం వేచి చూస్తున్నారు. అయితే మనం ఈ కథనంలో 2022 వ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదలైన బైకులు ఏవి, వాటి వివరాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.. రండి.

2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350:

ఎక్కువ మంది యువకులు ఇష్టపడే బైకులలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రధానంగా చెప్పుకోదగ్గవి. అయితే ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలైన 'హంటర్ 350' తక్కువ కాలంలోనే విపరీతమైన ఆదరణ పొందింది. ఈ బైకు మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి రెట్రో హంటర్ ఫ్యాక్టరీ సిరీస్, మెట్రో హంటర్ డాబర్ సిరీస్ మరియు మెట్రో హంటర్ రెబల్ సిరీస్. వీటి ధరలు వరుసగా రూ.1.49 లక్షలు, రూ.1.63 లక్షలు మరియు రూ.1.68 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్).

2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క పరిధి (రేంజ్) 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ 114కిమీ/గంట.

2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

బజాజ్ పల్సర్ ఎన్160:

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 2022 లో తన 'పల్సర్ ఎన్160' విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 'సింగిల్ ఛానల్ ఏబీఎస్' కాగా, మరొకటి 'డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్'. వీటి ధరలు వరుసగా రూ.1,22,854 మరియు రూ. 1,27,853 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది.

2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

కొత్త పల్సర్ ఎన్160 బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 164.82 సిసి 2-వాల్వ్, ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 15.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 14.65 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. బజాజ్ యొక్క ఈ కొత్త బైక్ దాని ఎన్ఎస్160 కంటే కూడా 1.2 బిహెచ్‌పి పవర్ తక్కువ ఉత్పత్తి చేస్తుంది.

2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

జావా 42 బాబర్:

భారతీయ మార్కెట్లో ఈ సంవత్సరం విడుదలైన బైకులతో జావా కంపెనీ యొక్క 42 బాబర్ ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త బైక్ మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్ మరియు జాస్పర్ రెడ్ అనే మూడు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అయితే కలర్ ఆప్సన్స్ ని బట్టి ధరలు వేరువేరుగా ఉంటాయి. ఇందులోని 334cc ఇంజిన్ 30.64 హెచ్‌పి మరియు 32.64 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

2022 యమహా ఎఫ్‌జెడ్‌-25:

ఎక్కువమంది యువకులు ఇష్టపడే బైకులను తయారు చేసే యమహా కంపెనీ 2022 ప్రారంభంలో తన ఎఫ్‌జెడ్‌-25 విడుదల చేసింది. ఈ బైక్ యాంత్రికంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో అప్డేటెడ్ కాస్మోటిక్ డిజైన్స్ చూడవచ్చు. దీని ధర రూ. 1.52 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

టీవీఎస్ రోనిన్:

టీవీఎస్ కంపెనీ యొక్క రోనిన్ బైక్ కూడా 2022 అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1,49,000 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1,68,750. టీవీఎస్ రోనిన్ మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ప్రతి వేరియంట్ కూడా రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. ఈ బైక్ అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన పరికరాలను కలిగి ఉంటుంది.

2022 లో విడుదలైన టాప్-5 పాపులర్ బైకులు: వాటి వివరాలు

టీవీఎస్ రోనిన్ 225 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి పవర్ మరియు 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 20 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ వరకు ఉంటుంది. రోనిన్ సైలెంట్ స్టార్ట్‌లను అనుమతించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 27, 2022, 14:53 [IST]
English summary
Top five most popular bikes launched india in 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+