ఈ సంవత్సరం (2022) దేశీయ మార్కెట్లో విడుదలైన టాప్ 5 స్కూటర్లు - వాటి వివరాలు

దేశీయ వాహన మార్కెట్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం (2022) భారతీయ మార్కెట్లో విడుదలైన టాప్ 5 స్కూటర్లను గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS NTorq 125 XT):

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ భారత విపణిలో విక్రయిస్తున్న తమ స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ లో 125 XT అనే కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,02,823 (ఎక్స్-షోరూమ్). 125 XT వేరియంట్ తో కలిపి ఎన్‌టార్క్ మొత్తం 5 వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

ఈ సంవత్సరం (2022) దేశీయ మార్కెట్లో విడుదలైన టాప్ 5 స్కూటర్లు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి లో 3-వాల్వ్, 125cc ఇంజన్‌ ఉంటుంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.2 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఎక్స్‌టి వేరియంట్ ప్రత్యేకంగా కనిపించడానికి ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కూడా చేశారు. కావున ఈ స్కూటర్ ఇప్పుడు కొత్త నియాన్ గ్రీన్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. అయితే ఇందులో ఎటువంటి యాంత్రిక, మెకానికల్ ఫీచర్ల పరంగా మార్పులు లేవు.

కీవే వియస్టా 300 (Keeway Vieste 300):

ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదలైన టాప్ 5 స్కూటర్లలో హంగేరియ టూవీలర్ బ్రాండ్ కీవే (Keeway) యొక్క వియస్టా 300 ఒకటి. ఈ స్కూటర్ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది చూడటానికి మాక్సీ స్టైల్ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్‌లతో కూడిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడి టెయిల్‌లైట్లు, యాంగ్యులర్ ఫ్రంట్ ఆప్రాన్, స్ప్లిట్ సీట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఈ స్కూటర్ లో 278.2 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్ కూల్డ్, 4-వాల్వ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 22 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు బెల్ట్ డ్రైవ్ ద్వారా ఇంజన్ నుండి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది.

కీవే సిక్స్టీస్ 300ఐ (Keeway Sixties 300i):

కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్ ధర కూడా రూ. 2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది రిట్రో స్టైలింగ్ స్కూటర్. ఇందులో చతురస్రాకారపు హెడ్‌ల్యాంప్ యూనిట్‌ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్ప్లిట్ సీట్లు మరియు 'సిక్స్టీస్' బ్యాడ్జింగ్‌పై రెట్రో స్టైల్ గ్రిల్‌ కూడా ఉంటుంది. డిజైన్ పరంగా ఒక పాత స్కూటర్ మాదిరిగా ఉన్నప్పటికీ పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

హీరో ప్లెజర్ ప్లస్ 110 ఎక్స్‌టెక్ (Hero pleasure 110 XTECH):

2022 లో విడుదలైన స్కూటర్లలో హీరో మోటోకార్ప్ యొక్క 'ప్లెజర్ ప్లస్ 110 ఎక్స్‌టెక్' ఒకటి. కంపెనీ యొక్క ఈ కొత్త స్కూటర్ కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఈ స్కూటర్ ప్రకాశవంతమైన జూబిలెంట్ ఎల్లో కలర్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ లో హీరో ప్లెజర్ ప్లస్ 110 ఎక్స్‌టెక్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ (Suzuki Burgman Street EX):

దేశీయ మార్కెట్లో 'సుజుకి మోటార్‌సైకిల్' తన 'బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్' ను ఈ సంవత్సరం విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ. 1,12,300 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త స్కూటర్ మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్ మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్స్. ఇందులో ఆధునిక ఫీచర్స్ మరియు మంచి డిజైన్ మీరు గమనించవచ్చు.

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ 125 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌తో పనిచేస్తుంది. అయితే ఇది తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా 0.1 హెచ్‌పి తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కానీ టార్క్ (10Nm) మాత్రం అదే విధంగా ఉంటుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు ఆటో స్టాప్/స్టార్ట్ సిస్టమ్ మరియు సైలెంట్ స్టార్టర్ సిస్టమ్‌తో పాటుగా అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 23, 2022, 10:15 [IST]
English summary
Top five scooter launched in 2022 tvs ntorq 125 xt suzuk burgman street ex more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+