ఈ నెలలో (సెప్టెంబర్) విడుదలకానున్న టాప్ 5 బైకులు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్..
దేశీయ వాహన మార్కెట్లో ఎప్పటికప్పుడు ప్రతి నెలలోనూ తప్పకుండా అనేక కొత్త బైక్ మోడల్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే గత నెలలో (2022 ఆగష్టు) బజాజ్ సిటీ 125ఎక్స్, డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2, హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్ మరియు ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ వంటివి విడుదలయ్యాయి.
Recommended Video
ఈ నెలలో (2022 సెప్టెంబర్) కూడా కొన్ని బైకులు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో విడుదలకానున్న టాప్ 5 బైకులు ఏవి?, వాటి వివరాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

బజాజ్ పల్సర్ ఎన్150 (Bajaj Pulsar N150):
దేశీయ మార్కెట్లో బజాజ్ కంపెనీ యొక్క బైకులకు ఉన్న ఆదరణ అంతా.. ఇంతా.. కాదు. ఈ కారణంగా కంపెనీ తన లైనప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ త్వరలో 'పల్సర్ ఎన్ 150' (Pulsar N150) లాంచ్ చేయనుంది.

బజాజ్ కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త Pulsar N150 బైక్ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది. అదే సమయంలో ఇది రెండు వేరియంట్స్ లో అందుబాటులోకి రానున్నట్లు కూడా సమాచారం. ఈ బైక్ లో 150 సిసి ఇంజిన్ ఉండే అవకాశం ఉంటుంది. కాగా దీనికి సంబంధించిన ధరలు మరియు ఇతర వివరాలు కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

హీరో ఎక్స్‌పల్స్ 200టి 4వి (Hero XPulse 200T 4V):
హీరో ఎక్స్‌పల్స్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అడ్వెంచర్ బైక్, కావున ఈ బైక్ ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలతో ఈ నెలలో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేయనున్న ఆ అప్డేటెడ్ అడ్వెంచర్ బైక్ పేరు 'హీరో ఎక్స్‌పల్స్ 200టి 4వి'.

హీరో ఎక్స్‌పల్స్ 200టి 4వి బైక్ ఇప్పుడు మరింత అద్భుతమైన పనితీరుని అందించే విధంగా రూపొందించబడింది. అంతే కాకూండా ఈ బైకులో రెట్రో లుకింగ్ ఫ్లైస్క్రీన్ పొందుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవవుతాయి.

అల్ట్రావయోలెట్ ఎఫ్77 (Ultraviolette F77):
దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త 'అల్ట్రావయోలెట్ ఎఫ్77' అనేది దేశంలో మొట్టమొదటి పర్ఫామెన్స్ బేస్డ్ ఎలక్ట్రిక్ బైకులతో ఒకటి కానుంది. ఇది బెంగుళూరుకి చెందిన ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ కంపెనీ. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ బైక్ చాలా సార్లు టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 147 కిలోమీటర్లుగా ఉంటుంది. అదే సమయంలో ఇది కేవలం 7.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇందులో ఎయిర్-కూల్డ్, బ్రష్ లెస్ డిఎమ్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించడం వల్ల ఇది ఇది 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 200 కిమీ పరిధిని అందించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఈ నెలలో విడుదల కానుంది. అయితే ఏ రోజు విడుదలవుతుంది, ధరలు ఎలా ఉంటాయి అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూ హీరో 125 సిసి స్కూటర్ (New Hero 125cc Scooter):
ఈ నెలలో హీరో మోటోకార్ప్ కంపెనీ కూడా దేశీయ మార్కెట్లో తన కొత్త స్కూటర్ విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. కంపెనీ విడుదల చేసే కొత్త స్కూటర్ 'న్యూ హీరో 125 సిసి' స్కూటర్ కానుంది. ఇది రూ. 85,000 నుంచి రూ. 90,000 ఎక్స్-షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది.

త్వరలో విడుదల కానున్న కొత్త 125 సిసి హీరో స్కూటర్ అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా.. టీవీఎస్ కంపెనీ యొక్క NTorq 125 స్కూటర్ కి ప్రధాన ప్రత్యర్థిగా నిలవాల్సి ఉంటుంది. కాగా ఈ స్కూటర్ భారతీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుంది, దాని స్పెసిఫికేషన్స్ ఏమిటి అనేవి తెలియరావాలి.

కొత్త కవాసకి బైక్ (New Kawasaki):
జపాన్ కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి ఈ నెల 25 న కొత్త బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఆ రోజున ఏ బైక్ లాంచ్ చేస్తుంది, దానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికాలేదు. కాగా ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయించబడుతున్న బుల్లెట్ 350 వంటి ఇతర 350 సిసి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండటానికి సరైన బైక్ విడుదలకానున్నట్లు భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే విడుదలవుతాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలో ఇప్పటికే వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది, త్వరలో 'విజయ దశమి' కూడా రాబోతోంది. ఈ పండుగ సీజన్ లో తప్పకుండా ఎక్కువమంది కస్టమర్లు కొత్త బైకులు కొనాలని ఆసక్తి చూపుతారు. ఆలాంటి వారు త్వరలో విడుదలకానున్న ఈ బైకులు కొనుగోలు చేయవచ్చు. ఈ బైకుల గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








