భారతీయ మార్కెట్లో రూ. 5 లక్షల లోపు లభించే బెస్ట్ ప్రీమియం బైక్స్, ఇవే
భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో తక్కువ ధర కలిగిన బైకుల నుంచి అత్యధిక ధర కలిగిన బైకుల వరకు ఉన్నాయి. అయితే దేశీయ మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకూండా ప్రీమియం మోటార్‌సైకిల్స్ కి కూడా అధిక ఆదరణ ఉంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో ఈ బైకులు మంచి అమ్మకాలను పొందుతున్నాయి.

భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణపొందుతున్న బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కెటిఎమ్ RC390, కవాసకి నింజా 400, హోండా సిబి300ఆర్, యమహా వైజెడ్ఎఫ్-ఆర్15ఎమ్, యమహా ఆర్15ఎమ్ మరియు టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 ఉన్నాయి. వీటి ధరలు రూ. 5 లక్షలకంటే తక్కువ.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 (Royal Enfield Interceptor 650):
కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో సైతం తన ఉనికిని చాటుకుంటున్న బైక్ బ్రాండ్స్ లో ఒకటి చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కంపెనీ. కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లో చాలా మోడల్స్ విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. కంపెనీ 650సిసి ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా బైకులను విడుదల చేస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఈ విభాగంలో ఇంటర్‌సెప్టర్ 650 బైక్ విడుదల చేసింది. ఈ బైక్ కూడా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో చాలావరకు సహాయపడుతోంది. దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 (Royal Enfield Interceptor 650) ధర రూ. 2.85 లక్షల (ఎక్స్-షోరూమ్). ధర తక్కువగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల ఎక్కువ అమ్మకాలను పొందుతోంది.

కెటిఎమ్ ఆర్‌సి390 (KTM RC390):
బైక్ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడే బైకులలో కెటిఎమ్ బ్రాండ్ ఒకటి. ఇందులో ఎక్కువ ఆదరణ పొందిన బైక్ కెటిఎమ్ ఆర్‌సి390. ఇది కెటిఎమ్ డ్యూక్ 200 తర్వాత కంపెనీ తన రెండవ ఉత్పత్తిగా విడుదలైంది. కెటిఎమ్ ఇండియా విక్రయించే కెటిఎమ్ RC390 భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్ మోటార్‌సైకిళ్లలో ఒకటి.

కెటిఎమ్ ఆర్‌సి390 (KTM RC390) బైక్ ధర మార్కెట్లో రూ. 2.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను 373.27సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో విక్రయిస్తోంది. ఈ ఇంజన్ 43 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది త్వరలోనే అప్డేట్ మోడల్ గా మార్కెట్లో అడుగుపెట్టనుంది.

కవాసకి నింజా 400 (Kawasaki Ninja 400):
భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన బైకులలో కవాసకి బ్రాండ్ కూడా ఒకటి. కవాసకి నింజా 300 ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో ఉంది. కంపెనీ దీనితో పాటు కవాసకి నింజా 400 ని కూడా విక్రయిస్తోంది. ఈ మోటార్‌సైకిల్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కవాసకి నింజా 300 పైన ఉంటుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది.

కవాసకి నింజా 400 (Kawasaki Ninja 400) ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 373.27 సిసి ప్యారలల్-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48 బిహెచ్‌పి పవర్ మరియు 38 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది. ఈ కవాసకి నింజా 400 బైక్ KTM RC390 కి ప్రత్యర్థిగా ఉంటుంది.

హోండా సిబి300ఆర్ (Honda CB300R):
ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్' (Honda Motorcycle) మార్కెట్లో తన హోండా సిబి300ఆర్ (Honda CB300R) విడుదల చేసింది. ఈ బైక్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుకి అందిస్తుంది. కావున రైడర్ లకి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

హోండా సిబి300ఆర్ (Honda CB300R) బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది, కావున మార్కెట్లో మంచి స్థాయిలో విక్రయించబడుతోంది. ఈ మోటార్‌సైకిల్ భారతదేశంలోని అత్యుత్తమ ప్రీమియం మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉంటుంది.

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15ఎమ్ (Yamaha YZF-R15M):
భారతీయ మార్కెట్లో ఎక్కవమంది యువకులు ఇష్టపడే బైక్ బ్రాండ్స్ లో ఒకటి యమహా. ఇందులో యమహా వైజెడ్ఎఫ్-ఆర్15ఎమ్ (Yamaha YZF-R15M) సరసమైన మరియు ఎక్కువ అమ్మకాలు పొందిన బైక్. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 Yamaha YZF-R15 సిరీస్ మోటార్‌సైకిళ్లలో లేటెస్ట్ 155 సిసి, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 పిస్ శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 (TVS Apache RR310):
మనం చెప్పుకుంటున్న ఈ బైక్ జాబితాలో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 (TVS Apache RR310) కూడా ఒకటి. ఈ బైక్ ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ అద్భుతమైన పనితీరుని అందించడానికి అవసరమయ్యే ఇంజిన్ ఇందులో అమర్చబడి ఉంటుంది. ఇది మంచి డిజైన్ కలిగి బైక్ రైడర్స్ కి మంచి రైడింగ్ అనుభూతిని తప్పకుండా కలిగిస్తుంది. కావున మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న బైకులలో ఇది కూడా ఒకటి.


Click it and Unblock the Notifications








