లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎన్నెన్ని కొత్త బైకులు & కార్లు విడుదలవుతున్నా.. ఎక్కువమంది లాంగ్ రైడ్ చేయడానికి లేదా లాంగ్ డ్రైవ్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన వాహనాలను మాత్రమే ఎంచుకుంటారు. దీనికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ కథనంలో రూ. 2.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే మరియు లాంగ్ రైడ్ చేయడానికి ఉత్తమమైన టాప్ 10 బైకులను గురించి తెలుసుకుందాం.. రండి.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 [Royal Enfield Meteor 350]:

ప్రస్తుతం ఎక్కువమంది ఇష్టపడే బైక్ బ్రాండ్స్ లో ఒకటి 'రాయల్ ఎన్‌ఫీల్డ్'. ఈ కంపెనీ యొక్క బైకులకు దేశీయ మార్కెట్లో గిరాకీ చాలా ఎక్కువగానే ఉంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 స్థానంలో పుట్టుకొచ్చిన మీటియార్ 350 బైక్ లాంగ్ రైడ్ చేయడానికి అనుకూలంగా బైకులలో ఒకటి.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 లాంగ్ రైడ్ చేయడానికి అనుకూలంగా తయారుచేయబడింది. ఈ బైక్ లో 349సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.1 బిహెచ్‌పి పవర్ మరియు 4,100 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది, కావున లాంగ్ రైడ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని ధర రూ. 2.01 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

బజాజ్ డామినార్ 400 [Bajaj Dominar 400]:

లాంగ్ రైడ్ చేయడానికి అనుకూలంగా ఉన్న మరో బైక్ బజాజ్ కంపెనీ యొక్క డామినార్ 400. ఇది 373 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 8,800 ఆర్‌పిఎమ్ వద్ద 39.4 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

బజాజ్ డామినార్ 400 బైక్ ధర భారతీయ మార్కెట్లో రూ. 2.23 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ప్రారంభమవుతుంది. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి ఉత్తమైన ఎంపిక అవుతుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ [Royal Enfield Himalayan]:

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ యొక్క మరో బైక్ హిమాలయన్. కుర్రకారుకి ఇష్టమైన బైకులతో ఒకటి ఈ హిమాలయన్. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. మంచి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ 411సీసీ, ఎయిర్-కూల్డ్ SOHC ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధరలు రూ. 2.14 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

యెజ్డీ అడ్వెంచర్[Yezdi Adventure]:

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో చరిత్ర సృష్టించిన యెజ్డీ అడ్వెంచర్ బైక్ ఇటీవల కాలంలో కొత్త హంగులతో మళ్ళీ దేశీయ విఫణిలోకి అడుగుపెట్టింది. ఈ యెజ్డీ అడ్వెంచర్ బైక్ ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ బైక్ ప్రారంభ ధరలు రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

యెజ్డీ అడ్వెంచర్ 334 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 30 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ 29.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద 15.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కూడా ఉంటుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

మహీంద్రా మోజో [Mahindra Mojo]:

మహీంద్రా కంపెనీ కేవలం కార్లను మాత్రమే కాకుండా బైకులను కూడా విక్రయించింది అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ మహీంద్రా కంపెనీ మోజో అనే బైకుని విక్రయించింది. ఈ బైక్ కూడా లాంగ్ రైడ్ చేయడానికి ఉత్తమమైన బైకులలో ఒకటి కావడం విశేషం. ఇందులో ఏకంగా 21 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

మహీంద్రా మోజోలో 295 సిసి లిక్విడ్-కూల్డ్, ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 25.35 బిహెచ్‌పి పవర్ మరియు 25.96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా మోజో ధరలు దేశీయ మార్కెట్లో రూ. 2.08 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

బజాజ్ డామినార్ 250 [Bajaj Dominar 250]:

బజాజ్ కంపెనీ మరొక బైక్ ఈ డామినార్ 250. ఇప్పటికే మనం డామినార్ 400 గురించి చెప్పుకున్నాం. అయితే డామినార్ 250 కూడా లాంగ్ రైడ్ చేయడానికి అనుకూలమైన బైక్. ఈ బైక్ ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది డామినార్ 400 కంటే తక్కువ ధర వద్ద లభిస్తుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

బజాజ్ డామినార్ 250 బైకులో 248.7 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజన్ ఉంటుంది. 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 26.6 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 23.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

హోండా సిబి350ఆర్ఎస్ / హైనెస్ సిబి350 [Honda CB350RS / H'ness CB350]:

లాంగ్ రైడ్ కి ఉపయోగపడే బైకులలో హోండా కంపెనీ యొక్క బైకులు కూడా ఉన్నాయి. అవి హోండా సిబి350ఆర్ఎస్ / హైనెస్ సిబి350. ఇవి 348 సిసి, సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 30 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 15 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. వీటి ధరలు రూ. 2.0 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

కెటిఎమ్ 250 డ్యూక్ [KTM 250 Duke]:

ఎక్కువమంది బైక్ రైడర్లు ఇష్టపడే బైకులలో ఒకటి కెటిఎమ్ బ్రాండ్ యొక్క 250 డ్యూక్. దీని ధర రూ. 2.37 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారభమవుతుంది. లాంగ్ రైడ్ కి చక్కనైన బైకు ఈ కెటిఎమ్ 250 డ్యూక్. ఇది 248.7 సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజన్ పొందుతుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

కెటిఎమ్ 250 డ్యూక్ లోని ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 29.6 బిహెచ్‌పి పవర్ మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 24 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ సులువుగా మూడు అంకెల వేగాన్ని కూడా చేరుకోగలదు. ఈ కారంగానే ఎక్కువమంది ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

యమహా ఎఫ్‌జెడ్ 25 [Yamaha FZ 25]:

యమహా కంపెనీ యొక్క ఎఫ్‌జెడ్ 25 కూడా లాంగ్ రైడ్ కి ఉపయోగపడే బైకుల జాబితాలో ఒకటి. ఈ బైక్ ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది మంచి డిజైన్ ఆధునిక ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఈ బైకులో 249 సిసి ఎయిర్-కూల్డ్ SOHC ఇంజన్ ఉంటుంది. ఇది 20.51 బిహెచ్‌పి పవర్ మరియు 20.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్ల వరకు ఉంటుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి [Hero Xpulse 200 4V]:

ఇక మన జాబితాలో చివరి బైక్ హీరో మోటోకార్ప్ యొక్క 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి'. ఈ బైకు ప్రారభ ధర రూ. 1.37 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

లాంగ్ రైడ్ చేయడానికి బెస్ట్ టాప్ 10 బైకులు: ధర రూ. 2.5 లక్షల కంటే తక్కువే..!!

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి బైక్ 199.6 సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, 4-స్ట్రోక్, 4-స్ట్రోక్, 4-వాల్వ్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.9 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. కావున ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 29, 2022, 10:22 [IST]
English summary
Top ten best motorcycles for long ride under rs 2 5 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+