భారతీయ మార్కెట్లో ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్‌తో లభించే టాప్ 10 స్కూటర్లు - వివరాలు
భారతీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త బైకులు మరియు స్కూటర్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే అద్భుతమైన డిజైన్ అధునాతన ఫీచర్స్ కలిగిన వాహనాలను కొనుగోలుచేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారు. అయితే స్కూటర్ల విషయానికి వస్తే డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా అండర్ సీట్ స్టోరేజ్ ఎక్కువగా ఉండే వాటిని కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది.
దేశీయ మార్కెట్లో ఉత్తమ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన టాప్ 10 స్కూటర్లు ఏవి? వాటి అండర్ సీట్ స్టోరేజ్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో:
దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లయిన ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండూ కూడా మంచి అండర్ సీట్ స్టోరేజ్ పొందుతాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క అండర్ సీట్ స్టోరేజ్ 36 లీటర్ల వరకు ఉంటుంది. కావున ఈ స్థలంలో రెండు హెల్మెట్లను కూడా సులభంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ధరలు దేశీయ మార్కెట్లో వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,39,999. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైనా సబ్సిడీ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి.

ఓలా ఎస్1 ఎయిర్:
ఓలా ఎస్1 ఎయిర్ అనేది ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ యొక్క అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర ప్రారంభంలో రూ. 79,999 ఉండేది, అయితే ప్రస్తుతం దీని ధర రూ. 84,999 కి పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు దాని మునుపటి మోడల్స్ ని పోలి ఉంటుంది. అయితే ఇందులో కొన్ని తక్కువ ఫీచర్స్ ఉన్నాయి.

ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కేవలం 2 లీటర్లు తక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

టీవీఎస్ జుపిటర్ 125:
టీవీఎస్ మోటార్స్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో జుపీటర్ ఒకటి. ఈ స్కూటర్ యొక్క అండర్ సీట్ 32 లీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇది ఓలా ఎస్1 ఎయిర్ కంటే కూడా 2 లీటర్లు తక్కువగా ఉంటుంది. అయితే ఇందులో కూడా రెండు హెల్మెట్స్ సులభంగా ఉంచుకోవడానికి అనుమతిస్తుంది. ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ కొత్త కొత్త 125 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 8.1 బిహెచ్‌పి పవర్ మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కావున పర్ఫామెన్స్ లో కూడా ఈ స్కూటర్ చాలా అద్భుతంగా ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ST:
టీవీఎస్ మోటార్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఐక్యూబ్ ST వేరియంట్ 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఇది మంచి బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండటమే కాకూండా మంచి రేంజ్ కూడా అందిస్తుంది.

యమహా ఏరోక్స్ 155:
అత్యంత ప్రజాదరణ పొందిన యమహా కంపెనీ యొక్క ఏరోక్స్ 155 స్కూటర్ 24.5 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇందులో ఒక పెద్ద హెల్మెట్ మరియు ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ వంటి వాటిని ఉంచుకోవచ్చు. ఇది ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్పోర్టీయస్ మ్యాక్సీ స్కూటర్. ఫెర్ఫామెన్స్ పరంగా కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125:
టీవీఎస్ కంపెనీ యొక్క ఎన్‌టార్క్ 125 స్కూటర్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ 22 లీటర్ల వరకు ఉంటుంది. ఇందులో కూడా ఏరోక్స్ 155 మాదిరిగానే ఒక పెద్ద హెల్మెట్ ఉంచవచ్చు. ఈ స్కూటర్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమైన పనితీరుని అందించే స్కూటర్. కావున ఎక్కువ అమ్మకాలు పొందటంలో ఇది ముందు వరుసలో ఉంది.

హీరో మాస్ట్రో ఎడ్జ్:
అత్యుత్తమ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన స్కూటర్ల జాబితాలో 'హీరో మాస్ట్రో ఎడ్జ్' కూడా ఉంది. ఈ హీరో మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ 22 లీటర్లు. అయితే ఈ స్కూటర్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతోంది, అయితే ఈ స్కూటర్ యొక్క అమ్మకాల గణాంకాలు స్పష్టంగా వెల్లడికాలేదు.

ఏథర్ 450:
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఏథర్ ఎనర్జీ యొక్క ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి పర్ఫామెన్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగి మార్కెట్లో ఎక్కువమంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల కంపెనీ ఒకే రోజు 250 యూనిట్ల 450 ఎక్స్ స్కూటర్లను డెలివరీ చేసింది.

సుజుకి యాక్సెస్ 125:
సుజుకి మోటార్సైకిల్ కంపెనీ యొక్క యాక్సెస్ 125 స్కూటర్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే, ఇది 21.8 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. ఇది కూడా ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కావాలనుకునే కస్టమర్లకు ఉత్తమమైన ఎంపిక అవుతుంది. ఇది మన జాబితాలో ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన ఒక స్కూటర్.

సుజుకి బర్గ్‌మాన్ 125:
ఇక మన జాబితాలో ఉత్తమమైన అండర్ సీట్ స్టోరేజ్ కలిగిన చివరి బైక్ సుజుకి మోటార్సైకిల్ యొక్క బర్గ్‌మాన్ 125. ఈ బర్గ్‌మాన్ 125 స్కూటర్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ 21.5 లీటర్లు. ఇది దాని యాక్సెస్ 125 స్కూటర్‌పై ఆధారపడి ఉంటుంది, కానీ ఈ స్కూటర్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ యాక్సెస్ 125 స్కూటర్ కంటే కొంత తక్కువ.


Click it and Unblock the Notifications








