2023 BMW S 1000 RR గురించి తెలుసుకోవలసిన విషయాలు, ఇవే: చూసారా..!!

ఇటీవల 'బిఎండబ్ల్యు మోటొరాడ్' దేశీయ మార్కెట్లో ఖరీదైన 'S 1000 RR' బైక్ లాంచ్ చేసింది. అయితే ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్లు దీని డిజైన్, ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ మొదలైన విషయాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటారు. అలాంటి వారు ఈ కథనంలో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ధర మరియు వేరియంట్స్:

2023 BMW S 1000 RR బైక్ కొనాలనుకునే దాని ధరలను తెలుసుకోవాలనుకుంటారు. కావున ఈ బైక్ ధర రూ. 20.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది మొత్తం మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్టాండర్డ్, మిడ్-స్పెక్ ప్రో వేరియంట్ మరియు టాప్ వేరియంట్ ప్రో ఎమ్ స్పోర్ట్. వీటి ధరలు వరుసగా రూ.20.25 లక్షలు, రూ.22.15 లక్షలు మరియు రూ.24.55 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

2023 BMW S 1000 RR గురించి తెలుసుకోవలసిన విషయాలు

కలర్ ఆప్సన్స్:

ప్రస్తుత కాలంలో బైక్ కొనుగోలు చేసేవారు దాని కలర్ ఆప్సన్ కూడా చూస్తున్నారు. కావున కొత్త BMW S 1000 RR ఇప్పుడు ఆధునిక కలర్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది మొత్తం మూడు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రేసింగ్ రెడ్, బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్ మరియు లైట్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కావున కొనుగోలుదారులు ఈ కలర్స్ లో తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

డిజైన్ & ఫీచర్స్:

2023 BMW S 1000 RR బైక్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ ట్రాక్-ఫోకస్డ్ BMW M 1000 RR మోటార్‌సైకిల్ నుండి తీసుకోబడిన కొత్త వింగ్‌లెట్‌లతో పాటు షార్ప్ గా కనిపించే ఫ్రంట్ సెక్షన్‌ను పొందుతుంది. ఇది కొత్త స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్‌తో అప్డేట్ చేయబడిన ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌, అంతే కాకుండా ఇందులో స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్‌తో అప్డేట్ చేయబడిన ABS సెటప్‌ కూడా పొందుతుంది.

ఇంజిన్ & పర్ఫామెన్స్:

కొత్త BMW S 1000 RR 999సిసి, ఇన్‌లైన్-ఫోర్-సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 13,750 ఆర్‌పిఎమ్ వద్ద 206.5 బిహెచ్‌పి మరియు 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా దీని గరిష్ట వేగం 300 కిమీ/గం వరకు ఉంటుంది.

మెకానికల్ ఫీచర్స్:

BMW S 1000 RR బైక్ అల్యూమినియం వీల్స్ కలిగి ఉండి, ముందువైపు 120/70 R17 సెక్షన్ టైర్లు, వెనుక వైపు 190/55 R17 సెక్షన టైర్లను పొందుతుంది. ఈ కొత్త బైకులో హిల్ స్టార్ట్ కంట్రోల్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇది రెయిన్, రోడ్, డైనమిక్ మరియు రేస్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

చాసిస్:

దేశీయ మార్కెట్లో విడుదలైన BMW S 1000 RR మోటార్‌సైకిల్‌ యొక్క స్టీరింగ్ రేక్ యాంగిల్ 23.1 డిగ్రీలకు బదులుగా 23.6 డిగ్రీలకు సడలించబడింది. ఈ బైక్ యొక్క వీల్‌బేస్‌ 1,457mm వద్ద ఉంది. ఈ కొత్త కొత్త అప్డేట్స్ పొందటం వల్ల మరింత అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ బైక్ యొక్క విండ్ డిఫ్లెక్షన్‌ ని మెరుగుపరచడానికి విండ్‌స్క్రీన్ కొంత పొడిగించబడింది. ఇది రైడింగ్ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతీయ విఫణిలో 2023 బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ డుకాటి పానిగేల్ V4 మరియు కవాసకి ZX-10R వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. కావున అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంది కావున తప్పకుండా దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Tuesday, December 13, 2022, 6:30 [IST]
English summary
Top things about new bmw s 1000 rr bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+