టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ 'టోర్క్ మోటార్స్' (Tork Motors) దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం ప్రారంభంలో తన 'క్రటోస్' (Kratos) మరియు 'క్రటోస్ ఆర్' (Kratos R) అనే ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కంపెనీ తమ ఎలక్ట్రిక్ బైక్ క్రటోస్ ఆర్ యొక్క డెలివరీలను ప్రారభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

పూణేకు చెందిన టోర్క్ మోటార్స్ ప్రారంభంలో, ఈ బైకుల డెలివరీలను కేవలం పూణేలోని డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే డెలివరీ చేసింది. అయితే కరోనా మహమ్మారి ప్రభావం మరియు సెమికండక్టర్ల కొరత కారణంగా తరువాత డెలివరీలు ఆలస్యమయ్యాయి. అయితే మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ డెలివరీ చేయడం ప్రారంభించింది. ఇకపై డెలివరీలో ఎలాంటి జాప్యం ఉండే అవకాశం లేదని కంపెనీ తెలిపింది. కావున బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ పొందుతారు.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

కంపెనీ దేశీయ విఫణిలో విడుదల చేసిన క్రటోస్ (Kratos) మరియు క్రటోస్ ఆర్ (Kratos R) ధరలు వరుసగా రూ. 1,22,500 మరియు రూ. 1,37,500 (సబ్సిడీ తరువాత ధరలు). ఈ రెండు ఎలక్ట్రియక్ బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున ఆధునిక కాలంలో ఈ బైకులు ఎంతగానో అనుకూలంగా ఉంటాయి.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

క్రటోస్ మరియు క్రటోస్ ఆర్ బైకులు రెడ్, వైట్, బ్లూ మరియు బ్లాక్‌ కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం కంపెనీ వైట్ కలర్‌ బైకులను మాత్రమే డెలివరీ చేస్తోంది. త్వరలోనే మిగిలిన కలర్ బైకులను కూడా డెలివరీ చేసే అవకాశం ఉంది.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ Tork Kratos మరియు Kratos-R కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ www.torkmotors.com సందర్శించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా త్వరలో ఇతర నగరాల్లో కూడా డెలివరీలను ప్రారంభమవుతాయి.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

టోర్క్ ఎలక్ట్రిక్ బైకుల డెలివరీ సందర్భంగా, కంపెనీ వ్యవస్థాపకుడు 'కపిల్ షెల్కే' మాట్లాడుతూ.. ఇకమీద ప్రతి నెలా కనీసం 200 బైక్‌లను డెలివరీ చేయాలని యోచిస్తున్నట్లు మరియు దానికి తగినట్లు సన్నాహాలు కూడా జరుపుతున్నట్లు తెలిపారు. దీనికోసం కంపెనీ తన చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది. కావున ఈ ప్లాంట్‌లో నెలకు 3,500 నుండి 4,000 బైక్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

క్రటోస్ (Kratos) ఎలక్ట్రిక్ బైక్ 7.5kW ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 10 బిహెచ్‌పి పవర్ మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో 0గంటకు నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

ఇక టోర్క్ క్రటోస్-ఆర్ బైక్ 9kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 12 బిహెచ్‌పి పవర్ మరియు 38 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ తో కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

టోర్క్ మోటార్స్ యొక్క ఈ రెండు బైక్‌లు 3 రైడింగ్ మోడ్‌లను పొందుతాయి. అవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ మోడ్స్. దీనితో పాటు కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ బైక్స్ రివర్స్ మోడ్ కూడా పొందుతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

టోర్క్ క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేశారా.. అయితే ఇది మీకోసమే..!!

ఇక ఇందులోని సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్‌ ద్వారా నిర్వహిచబడుతుంది. క్రటోస్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో సిబిఎస్ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

Most Read Articles

English summary
Tork kratos electric bike delivery starts in pune
Story first published: Monday, July 11, 2022, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X