ఎలక్ట్రిక్ బైక్స్ కా బాద్‌షా.. టార్క్ క్రాటోస్ (Tork Kratos) ప్రొడక్షన్ ప్రారంభం..! ముందుగా 500 యూనిట్లు!!
పూణేకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ టార్క్ మోటార్స్ (Tork Motors), ఈ ఏడాది జనవరి నెలలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'టార్క్ క్రాటోస్' (Tork Kratos) అధికారికంగా విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ మోడల్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది మరియు త్వరలోనే ఇది కస్టమర్లకు డెలివరీ చేయబడుతుంది. కంపెనీ ప్రస్తుతం ప్రతి నెలా 500 యూనిట్ల ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.

టార్క్ క్రాటోస్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను కంపెనీ రెండు వేరియంట్ లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధరలు రూ. 1.07 లక్షల (ఎక్స్-షోరూమ్, పూణే) నుండి ప్రారంభమవుతాయి. కాగా, ఇందులో మరింత శక్తివంతమైన టోర్క్ క్రాటోస్ ఆర్ వేరియంట్ ధర రూ. 1.22 లక్షల (ఎక్స్-షోరూమ్, పూణే) నుండి ప్రారంభం అవుతాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు ఈ నెలాఖరులోపు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంత వేగంగా వృద్ధి చెందాయో, ఎలక్ట్రిక్ బైక్‌లు కూడా అంతే వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రత్యేకించి యువతరం ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపుకు మారేందుకు సిద్ధమవుతుండటంతో, వారిని ఆకట్టుకునేందుకు తయారీదారులు కూడా పెట్రోల్ వాహనాలకు ఏమాత్రం తీసిపోని అధునాతన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేస్తున్నారు. టార్క్ క్రాటోస్ కూడా అలాంటి ఓ అద్భుతమైన మరియు అధునాతన టెక్నాలజీతో రూపొదించబడిన ఎలక్ట్రిక్ బైక్.

టార్క్ క్రాటోస్ నిజంగా ఓ 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్ మోటార్‌సైకిల్ అని కంపెనీ పేర్కొంది. తమ ఆరు సంవత్సరాలుగా విస్తృతమైన పరిశోధన మరియు అభివృద్ధికి తుది రూపమే ఈ మోడల్ అని టార్క్ మోటార్స్ తెలిపింది. టార్క్ మోటార్స్ తమ క్రాటోస్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ను మొదటిసారిగా 2016 సంవత్సరంలో ఆవిష్కరించింది. మొదటి ఫేజ్‌లో భాగంగా, టార్క్ మోటార్స్ తమ క్రాటోస్ మరియు క్రాటోస్ ఆర్ మోటార్‌సైకిళ్లను పూణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ మరియు అహ్మదాబాద్ వంటి 6 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫికేషన్లను ఓసారి గమనిస్తే, టోర్క్ క్రాటోస్ స్టాండర్డ్ (Tork Kratos Standard) వేరియంట్ 28 Nm టార్క్‌ను జనరేట్ చేసే 7.5kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది మరియు పెద్ద 4kWh బ్యాటరీ ప్యాక్ సాయంతో వస్తుంది. కాగా, టోర్క్ క్రాటోస్ ఆర్ (Tork Kratos R) వేరియంట్‌లో 38 Nm టార్క్‌ను జనరేట్ చేసే మరింత శక్తివంతమైన 9kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ వేరియంట్ మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తున్నప్పటికీ, క్రాటోస్ ఆర్ అదే 4kWh బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది.

కంపెనీ పేర్కొన్న సమచారం ప్రకారం, టార్క్ క్రాటోస్ ఆర్ కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకోగలదు మరియు గరిష్టంగా గంటకు 120 కిమీ వేగంతో పరుగులు తీయగలదు. కాగా, స్టాండర్డ్ టార్క్ క్రాటోస్ ఈ వేగాన్ని (0-40 కిమీ) అందుకోవడానికి 5 సెకన్ల సమయం పడుతుంది మరియు ఇది గరిష్టంగా గంటకు 100 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇక చివరిగా రేంజ్ విషయానికి వస్తే, Kratos మరియు Kratos R రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు కూడా వాస్తవ-ప్రపంచ పరిస్థితుల్లో పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 120 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది.

చార్జింగ్ సమయం విషయానికి వస్తే, డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం 1 గంట కంటే తక్కువ సమయంలోనే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. టార్క్ క్రాటోస్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్ప్లిట్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై తయారైంది మరియు ఇది సాధారణ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది. టార్క్ మోటార్స్ ప్రకారం, Kratos ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ దేశంలోనే మొదటి వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అధునాతన యాక్సియల్ ఫ్లక్స్ టోపోలాజీతో పాటుగా కంపెనీ యొక్క స్వంత 'Tork LIION' బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

టార్క్ క్రాటోస్ దాని సిగ్నేచర్ TIROS (టోర్క్ ఇంట్యూటివ్ రెస్పాన్స్ ఆపరేటింగ్ సిస్టమ్) ఇంటెలిజెన్స్ సిస్టమ్‌తో పనిచేస్తుంది, ఇది పట్టణ ప్రయాణికులకు అసమానమైన రైడింగ్ అనుభూతిని అందించడంలో సహాయపడుతుంది. ఈ మోటార్‌సైకిల్‌లో డేటా మరియు సర్వీస్ సపోర్ట్ కోసం 4G టెలిమెట్రీ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, క్రాష్ అలర్ట్ ఫంక్షన్ మరియు స్ప్లిట్ సీట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టార్క్ క్రాటోస్ (Tork Kratos) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, దాని పేరు సూచించినట్లుగానే, ఇందులో క్రాటోస్ (Kratos ) అంటే బలం మరియు శక్తి యొక్క వ్యక్తిత్వం. కాబట్టి, బలంగా ఉండటమే కాకుండా శక్తివంతమైనదిగా కూడా ఉంటుంది. కంపెనీ దీనికి క్రాటోస్‌గా అనే పేరును పెట్టడమే కాకుండా, దీనిని అంతర్గతంగా మరియు బాహ్యంగా అనేక కఠినమైన పరీక్షలకు కూడా గురిచేసింది. ఇది రీడిజైన్ చేయబడిన ఫ్రేమ్ మరియు స్టైలింగ్‌తో గతంలోని T6X కంటే మరింత అధునాతంగా ఓ పూర్తి సరికొత్త మోటార్‌సైకిల్‌గా అభివృద్ధి చేయబడిందని టార్క్ మోటార్స్ వివరించింది.


Click it and Unblock the Notifications