కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్ [వీడియో]

పూణెకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ 'టోర్క్ మోటార్స్' (Tork Motors) దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం ప్రారంభంలో 'క్రటోస్' (Kratos) మరియు 'క్రటోస్ ఆర్' (Kratos R) అనే రెండు ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేసింది. ఇప్పటికే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుల యొక్క డెలివరీలను పూణేలో ప్రారంభించింది. అయితే ఇప్పుడు హోమ్ డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్.. వీడియో

టోర్క్ మోటార్స్ ప్రారంభించిన ఈ హోమ్ డెలివరీ విధానం సాధారణ హోమ్ డెలివరీకంటే కూడా చాల భిన్నంగా ఉంది. దీనికి సంబందించిన వీడియో కంపెనీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో చూసే వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్.. వీడియో

ఈ వీడియోలో కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక బాక్స్ లో డెలివరీ చేసింది. అది కూడా ఆ బాక్స్ బయట నుంచి ఇది స్పష్టంగా కనిపించడానికి ఫైబర్‌గ్లాస్ అమర్చింది. అంతే కాకూండా దాని మీద బైక్ కి సంబందించిన చాలా వివరాలు ప్రింట్ చేయబడ్డాయి. ఈ బాక్స్ మీద గమనించినట్లైతే 1:1 అని ఉండటం గమనించవచ్చు.

కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్.. వీడియో

టోర్క్ మోటార్స్ హోమ్ డెలివరీ చేయటానికి ప్రత్యేకంగా ఈ విధానం అవలంభిస్తుంది. ఈ విధానం కంపెనీ యొక్క పాపులారిటీని కూడా పెంచుతుంది. ఎందుకంటే రోడ్డుపై దీనిని చాలామంది చాలా ఆసక్తిగా చూడటం కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో ఈ వీడియోలో టోర్క్ మోటార్స్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ 'కపిల్ షెల్కే' కూడా కనిపిస్తారు. ఈ ఎలక్ట్రిక్ బైకును స్వయంగా డెలివరీ చేయడం చూడవచ్చు.

కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్.. వీడియో

టోర్క్ మోటార్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన క్రటోస్ (Kratos) ధర రూ. 1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా క్రటోస్ ఆర్ (Kratos R) ధర రూ. 2.07 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు ఎలక్ట్రిక్ బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున ఆధునిక కాలంలో ఈ బైకులు వాహన వినియోగదారులకు ఎంతగానో అనుకూలంగా ఉంటాయి.

కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్.. వీడియో

క్రటోస్ మరియు క్రటోస్ ఆర్ బైకులు రెడ్, వైట్, బ్లూ మరియు బ్లాక్‌ కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం కంపెనీ వైట్ కలర్‌ బైకులను మాత్రమే డెలివరీ చేస్తోంది. త్వరలోనే మిగిలిన కలర్ బైకులను కూడా డెలివరీ చేసే అవకాశం ఉంది.

కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్.. వీడియో

టోర్క్ క్రటోస్ (Kratos) ఎలక్ట్రిక్ బైక్ 7.5kW ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 10 బిహెచ్‌పి పవర్ మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో 0గంటకు నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు.

కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్.. వీడియో

ఇక టోర్క్ క్రటోస్-ఆర్ బైక్ 9kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 12 బిహెచ్‌పి పవర్ మరియు 38 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ తో కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. టోర్క్ మోటార్స్ యొక్క ఈ రెండు బైక్‌లు 3 రైడింగ్ మోడ్‌లను పొందుతాయి. అవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ మోడ్స్. దీనితో పాటు కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ బైక్స్ రివర్స్ మోడ్ కూడా పొందుతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇక ఇందులోని సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్‌ ద్వారా నిర్వహిచబడుతుంది. క్రటోస్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో సిబిఎస్ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

కొత్త పద్దతిలో డెలివరీ ప్రారభించిన టోర్క్ మోటార్స్.. వీడియో

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా టోర్క్ మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగా కంపెనీ మంచి అమ్మకాలను పొందుతుంది. ఇప్పుడు కంపెనీ అవలంభించిన కొత్త డెలివరీ విధానం మరింత ఆకర్షణీయంగా ఉంది ఇది మరింతమందిని ఆకర్షించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Sunday, July 31, 2022, 12:00 [IST]
English summary
Tork motors delivers e bikes to customers with unique way
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+