ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఈ తరుణంలో టోర్క్ మోటార్స్ (Tork Motors) భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ కోసం ప్లాన్‌లను ప్రకటించిన దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు రెండు ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేసింది. ఈ రెండు కొత్త బైకులు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

టోర్క్ మోటార్స్ (Tork Motors) విడుదల చేసిన ఈ రెండు బైకులలో ఒకటి క్రటోస్ (Kratos) కాగా మరొకటి క్రటోస్ ఆర్(Kratos R). వీటి ధరలు వరుసగా రూ. 1,92,499 మరియు రూ. 2,07,499 (ఎక్స్-షోరూమ్, పూణే). అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబటులో ఉన్న ఫేమ్-2 స్కీమ్ కింద దాదాపు రూ. 60,000 తగ్గుతుంది. అంతే కాకూండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాష్ట్ర సబ్సిడీల ద్వారా రూ. 24,500 తగ్గింపు లభిస్తుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఫేమ్-2 మరియు రాష్ట్ర సబ్సిడీ కింద ధరలు తగ్గిన తరువాత వీటి ధరలు వరుసగా రూ. 1,07,999 మరియు రూ. 1,22,999 వరకు ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో అందుబటులో ఉన్న సబ్సిడీలను వినియోగించుకుని ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేయవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

టోర్క్ మోటార్స్ (Tork Motors) పూణె, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ మరియు ఢిల్లీ వంటి ఫేజ్ 1 నగరాలతో కంపెనీ దశలవారీగా బైక్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదే సమయంలో రెండవ దశలో కంపెనీ దాదాపు 100 నగరాల్లో విడుదలచేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ త్వరలో దేశవ్యాప్తంగా తన ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

క్రటోస్ (Kratos) ఎలక్ట్రిక్ బైక్ 7.5kW, 28Nm మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఇందులోని క్రటోస్ ఆర్ (Kratos R) 9kW, 38Nm మోటార్‌ని కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గరిష్టంగా 100kph మరియు 105kph వరకు వేగవంతం అవుతుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

టోర్క్ మోటార్స్ యొక్క ఈ రెండు బైక్‌లు 3 రైడింగ్ మోడ్‌లను పొందుతాయి. అవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ మోడ్స్. దీనితో పాటు కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ బైక్స్ రివర్స్ మోడ్ కూడా పొందుతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇందులోని బ్యాటరీ IP67 వెదర్ ప్రొటక్షన్ రేటింగ్ పొందుతుంది. ఈ రెండు బైకుల యొక్క పరిధి ఇండియన్ డ్రైవ్ టెస్టింగ్ సమయంలో 180 కి.మీ మరియు వాస్తవ ప్రపంచంలో 120 కి.మీ వరకు ఉంటుంది. ఈ పరిధి దాదాపు Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పరిధికి సమానంగా ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇక ఇందులోని బ్యాటరీ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది హోమ్ ఛార్జర్ తో గంటకు 25 శాతం చొప్పున ఛార్జింగ్ అవుతుంది. అదే సమయంలో ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో క్రటోస్ ఆర్ బైక్ కేవలం ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ మోటార్‌సైకిల్ యొక్క స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ ద్వారా ఉంచబడుతుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇక ఇందులోని సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్‌ ద్వారా నిర్వహిచబడుతుంది. క్రటోస్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో సిబిఎస్ ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Kratos బైక్స్: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు మంచి డిజైన్ కలిగి ఉంటాయి. క్రటోస్ బైక్‌లు వాటి స్పెక్ షీట్‌ను బట్టి కొద్దిగా తగ్గించబడినట్లు అనిపిస్తుంది. అయితే ఇవి మంచి పనితీరుని అందిస్తాయి. క్రటోస్ ఆర్ యొక్క క్లెయిమ్ చేయబడిన యాక్సిలరేషన్ మరియు టాప్ స్పీడ్ అనేది కంపెనీ తెలిపిన దానికి చాలా దగ్గరగా ఉంటాయి.ఎట్టకేలకు ఈ రెండు బైకులు దేశీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఇక ఎలాంటి అమ్మకాలను పొందుతాయనే వివరాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
Tork motors launched the much awaited kratos electric bike in india at a starting price of 1 07 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X