Honda NX500 పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది హోండా నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ బైకా..?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా (Honda) యూరోపియన్ యూనియన్‌లో 'NX' మరియు 'NX500' పేర్ల కోసం ట్రేడ్‌మార్క్‌లను దాఖలు చేసింది. అలాగే, 'NX' పేరు కోసం న్యూజిలాండ్‌లో కూడా ట్రేడ్‌మార్క్ ఫైల్ చేసింది. హోండా 'NX' మోనికర్ ఈ బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని డామినేటర్ శ్రేణి మోటార్‌సైకిళ్లతో అనుబంధించబడినందున, ఇది ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ని సూచిస్తుంది. భారతదేశంలో కూడా అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో హోండా, ఈ కొత్త మోడల్‌ను ఇక్కడి మార్కెట్లో కూడా విడుదల చేయవచ్చని అంచనా.

Honda NX500 పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది హోండా నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ బైకా..?

హోండా యొక్క డామినేటర్ (Dominator) సిరీస్ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు 1980 మరియు 1990 కాలంలో ప్రసిద్ధి చెందినప్పటికీ, నార్టన్ అనే సంస్థ ఇప్పటికే 'డామినేటర్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన నేపథ్యంలో, హోండా ఆ మోనికర్‌ (నేమ్‌ప్లేట్) ని ఉపయోగించలేదు. కాబట్టి, హోండా తమ కొత్త ద్విచక్ర వాహనాల కోసం 'NX' పేరును ఉపయోగించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు హోండా తమ రాబోయే హోండా NX500 మోటార్‌సైకిల్‌లో, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన హోండా సిబి500ఎక్స్ మోటార్‌సైకిల్‌లోని అదే ఇంజన్‌ని ఉపయోగించవచ్చని తెలుస్తోంది.

Honda NX500 పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది హోండా నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ బైకా..?

ఈ సరికొత్త హోండా అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఉపయోగించబోయే 471 సిసి లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్‌, ప్రస్తుతం హోండా సిబి500ఎక్స్ (Honda CB500X) మోడల్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 43.2 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, హోండా ఎన్ఎక్స్500 అడ్వెంచర్ బైక్ కాబట్టి, దాని లైట్ వెయింట్ మరియు అడ్వెంచర్ క్యారెక్టర్ కు తగినట్లుగా కంపెనీ ఈ ఇంజన్ ను స్వల్పంగా రీట్యూన్ చేసే అవకాశం ఉంది. బెటర్ ఆఫ్-రోడింగ్ కోసం ఈ మోటార్‌సైకిల్‌ లో డ్యూయల్-పర్పస్ టైర్లు మరియు లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

Honda NX500 పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది హోండా నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ బైకా..?

హోండా ప్రస్తుతం భారత మార్కెట్లో సిబి500ఎక్స్ (CB500X) అనే ప్రీమియం అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ను తమ బిగ్‌వింగ్ (Honda BigWing) డీలర్‌షిప్ ల ద్వారా విక్రయిస్తోంది. గడచిన ఫిబ్రవరి నెలలో కంపెనీ ఈ మోడల్ ధరను భారీగా తగ్గించింది. ఎందుకంటే, కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త 2022 మోడల్ ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ భారత మార్కెట్లో కూడా విడుదల కానున్న నేపథ్యంలో, తమ పాత మోడల్ స్టాక్ ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ దీని ధరను లక్ష రూపాయలకు పైగా తగ్గించింది.

Honda NX500 పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది హోండా నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ బైకా..?

హోండా బిగ్‌వింగ్ వెబ్‌సైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం హోండా CB500X ధర రూ.5.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ, మే 13, 2022వ తేదీ నాటికి) గా ఉంది. హోండా తమ కొత్త సిబి500ఎక్స్ (Honda CB500X) అడ్వెంచర్-టూరర్‌ బైక్ ని భారత మార్కెట్లో 2021 లో విడుదల చేసింది. ఆ సమయంలో ఈ బైక్ ప్రారంభ ధర రూ. 6.87 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉండేది.

Honda NX500 పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది హోండా నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ బైకా..?

ఇక కొత్తగా రాబోయే 2022 మోడల్ హోండా సిబి500ఎక్స్ అడ్వెంచర్ బైక్ విషయానికి వస్తే, ఇందులో కనిపించబోయే అతిపెద్ద మార్పు దాని కొత్త 41 మిమీ నాన్-అడ్జస్టబుల్, షోవా SFF-BP USD ఫోర్క్స్ రూపంలో ఉంటుంది. ఇది మునుపటి టెలిస్కోపిక్ ఫోర్క్‌లను భర్తీ చేస్తుంది మరియు ఈ అప్‌గ్రేడ్ కారణంగా రైడర్ కి అన్ని రకాల టెర్రైన్ లపై చాలా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి లభిస్తుంది. అలాగే, ఈ సస్పెన్షన్ సెటప్ మంచి ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం 132 మిమీ వీల్ ట్రావెల్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది కేవలం ఆఫ్-రోడ్ ప్రయాణానికి మాత్రమే కాకుండా, ఇటు ఆన్-రోడ్ ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

Honda NX500 పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది హోండా నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ బైకా..?

ఇక ఇందులో చేసిన ఇతర మార్పులలో కొత్త అల్యూమినియం ఫ్రంట్ వీల్ ఉంటుంది, ఇది మునుపటి వీల్ కంటే 100 గ్రాములు తేలికైనదిగా ఉంటుంది. ఈ మార్పు వలన మోటార్‌సైకిల్ యొక్క రైడ్ మరియు హ్యాండ్లింగ్ ఫీచర్స్ మెరుగ్గా ఉంటాయి. యాంత్రిక పరమైన మార్పుల విషయానికి వస్తే, ఇందులో కొత్త స్వింగ్‌ఆర్మ్ ఉంటుంది మరియు ఇది మునుపటి యూనిట్ కంటే 1 కిలో తక్కువ బరువును కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఇది అంతే ధృడత్వాన్ని కలిగి ఉంటుంది. హోండా తమ కొత్త 2022 CB500X యొక్క బ్రేకింగ్ హార్డ్‌వేర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది.

Honda NX500 పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది హోండా నుండి రాబోయే కొత్త అడ్వెంచర్ బైకా..?

హోండా సిబి200ఎక్స్ (Honda CB200X) ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ బైక్ కూడా అందుబాటులో ఉంది..

ఖరీదైన హోండా సిబి500ఎక్స్ (CB500X) బైక్‌ను కొనలేని వారి కోసం కంపెనీ ఓ లో-బడ్జెట్ ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను కూడా విక్రయిస్తోంది. హోండా సిబి200ఎక్స్ (Honda CB200X) పేరుతో లభిస్తున్న ఈ ఎంట్రీ-లెవర్ అడ్వెంచర్ బైక్ అన్ని సాధారణ హోండా డీలర్‌షిప్ కేంద్రాలలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ.1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, మే 13, 2022 నాటికి) గా ఉంటుంది. హోండా నుండి లభిస్తున్న అత్యంత చవకైన అడ్వెంచర్ బైక్ ఇది. - ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Trademark filed for honda nx 500 name is it a new adventure bike from japanese auto maker
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X