భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ భారత మార్కెట్లో తమ సరికొత్త 2023 బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ (2023 Triumph Bonneville T120 Black Edition) ని విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి20 బ్లాక్ ఎడిషన్ ధర రూ. 11.09 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కొత్త మోడల్ ను కంపెనీ ఇప్పుడు కొత్త పెయింట్ స్కీమ్ తో విడుదల చేసింది. వీటిలో ప్రస్తుతం ఉన్న జెట్ బ్లాక్ కలర్ తో పాటుగా కొత్త మ్యాట్ సఫైర్ బ్లాక్ కలర్ ఆప్షన్ పరిచయం చేయబడింది.

భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ లో జెట్ బ్లాక్ పెయింట్ వేరియంట్ ధర రూ. 11.09 లక్షలు కాగా, ఇందులో కొత్తగా పరిచయం చేయబడిన మ్యాట్ సఫైర్ బ్లాక్ వేరియంట్ ధర రూ. 11.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. వీటిలో జెట్ బ్లాక్ కలర్ సింగిల్-టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉండగా, మ్యాట్ సఫైర్ బ్లాక్ వేరియంట్ చాలా వరకూ బ్లాక్ కలర్ ఫినిష్ చేయబడి ఉండి, ఫ్యూయల్ ట్యాంక్‌పై సిల్వర్ స్ట్రిప్‌తో డ్యూయల్-టోన్ థీమ్‌ను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

మ్యాట్ సఫైర్ బ్లాక్ పెయింట్‌ స్కీమ్ లో ఉండే సరికొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ బ్రౌన్ కలర్ సీట్ కవర్‌ ను పొందుతుంది. ఇకపోతే హెడ్‌లైట్ మాస్క్, ఇంజన్ కేస్, ఎగ్జాస్ట్ క్యానిస్టర్ మరియు వైర్-స్పోక్ వీల్స్‌ బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి. స్టాండర్డ్ ట్రైయంప్ బోన్‌విల్ టి120 మోడల్‌లో లభించే అన్ని ఫీచర్లు ఈ ప్రత్యేకమైన మోడల్ లో కూడా లభిస్తాయి. ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు.

భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

స్టాండర్డ్ ట్రైయంప్ బోన్‌విల్ టి120 మోటార్‌సైకిల్ లో శక్తివంతమైన 1200సీసీ, పారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6,550 ఆర్‌పిఎమ్ వద్ద 78.9 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 105 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. కొత్తగా విడుదలైన 2023 మోడల్ ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ లో కూడా అదే ఇంజన్ ను ఉపయోగించారు.

భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, రైడ్-బై-వైర్, ట్రాక్షన్ కంట్రోల్, యూఎస్‌బి ఛార్జింగ్ సాకెట్, వివిధ రకాల రైడింగ్ మోడ్స్, హీటెడ్ గ్రిప్స్, సెంటర్ స్టాండ్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ట్విన్ క్రెడిల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ స్ప్రింగ్‌లు, ముందువైపు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు సింగిల్ డిస్క్ ఉన్నాయి.

భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

ట్రైయంప్ 2020 సంవత్సరంలో భారతదేశంలో బోన్‌విల్ సిరీస్ బైక్ ‌లను విడుదల చేసింది. ఆ తర్వాత కంపెనీ గత సంవత్సరం ఈ బైక్ యొక్క గోల్డ్ రేంజ్ ‌ను విడుదల చేసింది. బోన్‌విల్ సిరీస్ లో ట్రైయంప్ టి100 మరియు టి120 బైక్ ‌లను విక్రయిస్తోంది. ట్రైయంప్ బోన్‌విల్ టి100 బ్లాక్ మరియు ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ రెండు మోడళ్ల డిజైన్ మరియు ఫీచర్లు ఒకేలా ఉంటాయి. అయితే వాటి ఇంజన్ మరియు కలర్ ఆప్షన్లలో మాత్రం తేడా ఉంటుంది. స్టాండర్డ్ బోన్‌విల్ టి100 మ్యాట్ బ్లాక్ లేదా జెట్ బ్లాక్ ఫినిషింగ్ ను కలిగి ఉండగా, బోన్‌విల్ టి120 బ్లాక్ మ్యాట్ గ్రాఫైట్ బ్లాక్ ఫినిషింగ్‌తో వస్తుంది.

భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

ఇంజన్ విషయానికి వస్తే, బోన్‌విల్ టి100 బ్లాక్ ట్రైయంప్ యొక్క 900 సీసీ హై టార్క్ పారలల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 54 బిహెచ్‌పి శక్తిని మరియు 80 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో రైడ్-బై-వైర్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ట్రాక్షన్ కంట్రోల్, యూఎస్‌బి ఛార్జింగ్ సాకెట్, ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో లభిస్తాయి. ఈ బైక్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో అమర్చబడి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

ట్రైయంప్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్‌ లలో బోన్‌విల్ టి100, స్ట్రీట్ స్క్రాంబ్లర్, బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్, బోన్‌విల్ బాబర్ మరియు బోన్‌విల్ టి120 మోడళ్లు ఉన్నాయి. ఈ ఆరు బోన్‌విల్ మోడల్స్ గోల్డ్ లైన్ ఎడిషన్‌ లో విభిన్న కలర్ ఆప్షన్లలో విక్రయించబడుతున్నాయి.

భారత మార్కెట్లో కొత్త 2023 ట్రైయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ విడుదల

భారత మార్కెట్లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ 900 (Triumph Speed Twin 900) విడుదల

ఇదిలా ఉంటే, ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ గడచిన జులై నెలలో భారత మార్కెట్లో తమ కొత్త 'ట్రైయంప్ స్పీడ్ ట్విన్ 900' (Triumph Speed Twin 900) అనే కొత్త స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 8.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. - ఈ బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Triumph india launches 2023 bonneville t120 black edition price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X