దేశీయ మార్కెట్లో విడుదలైన ట్రయంఫ్ క్రోమ్ ఎడిషన్ బైకులు: ఒక దాన్ని మించి మరొకటి.. చూస్తే మైండ్ బ్లోయింగ్
ట్రయంఫ్ మోటార్‌సైకిల్ ఇండియా (Triumph Motorcycle India) భారతీయ మార్కెట్లో కొత్త క్రోమ్ లిమిటెడ్ ఎడిషన్ బైకులను విడుదల చేసింది. ఈ బైకులన్నీ కూడా హ్యాండ్‌మేడ్ క్రోమ్ స్కీమ్ మరియు డెడికేటెడ్ క్రోమ్ ఎడిషన్ యాక్సెసరీ కిట్ పొందుతాయి. అయితే ఇవన్నీ కూడా ఒక సంవత్సరం మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. అయితే డెలివరీలు 2022 చివరిలో లేదా 2023 ప్రారంభంలో జరిగే అవకాశం ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 క్రోమ్ ఎడిషన్ (Triumph Speed Twin 900 Chrome Edition):
కంపెనీ విడుదల చేసిన బైకులలో 'స్పీడ్ ట్విన్ 900 క్రోమ్ ఎడిషన్' ఒకటి. ఈ బైక్ ధర రూ. 8.84 లక్షలు. ఈ ఎడిషన్ బైక్ రెడ్ హాప్పర్ షేడ్‌లో జెట్ బ్లాక్ స్ట్రిప్, మెటల్ క్నీ ప్యాడ్ ఇన్‌ఫిల్‌లు మరియు త్రిభుజాకారంలో ఉండే ట్రయంఫ్ బ్యాడ్జ్ కోసం మెటల్ పొందుతుంది. ఇది జెట్ బ్లాక్ ఫెండర్లు మరియు జెట్ బ్లాక్ సైడ్ ప్యానెల్‌లపై రెడ్ అండ్ సిల్వర్ కలర్ చూడవచ్చు.

కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 క్రోమ్ ఎడిషన్ ఇప్పటికే ఉన్న స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 35,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా బైక్ రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 900 క్రోమ్ ఎడిషన్ (Triumph Scrambler 900 Chrome Edition):
కంపెనీ విడుదల చేసిన మరో బైక్ 'స్క్రాంబ్లర్ 900 క్రోమ్ ఎడిషన్' (Scrambler 900 Chrome Edition). ఈ కొత్త బైక్ ధర రూ. 9.94 లక్షలు. ఈ ఎడిషన్ బైక్ బ్రూక్‌ల్యాండ్స్ గ్రీన్ ట్యాంక్ పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

ఈ బైక్ యొక్క ఫెండర్లు, సైడ్ ప్యానెల్లు మరియు ఫ్రేమ్ కౌల్ అన్నీ జెట్ బ్లాక్ కలర్ లో పూర్తిచేయబడ్డాయి. ఈ మోటార్‌సైకిల్‌లో జెట్ బ్లాక్ హై మడ్‌గార్డ్ మరియు బ్రూక్‌ల్యాండ్స్ గ్రీన్ ఫ్లై స్క్రీన్ వంటి వాటిని కూడా యాక్సెసరీలుగా పొందవచ్చు. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 35,000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది.

ట్రయంఫ్ బోన్‌విల్ టి100 క్రోమ్ ఎడిషన్ (Triumph Bonneville T100 Chrome Edition):
ట్రయంఫ్ బోన్‌విల్ టి100 క్రోమ్ ఎడిషన్ అనేది కంపెనీ విడుదల చేసిన బైకులలో ఒకటి. ఈ బైక్ ధర రూ. 10.04 లక్షలు. ఈ ఎడిషన్ మెటల్ స్ట్రిప్‌తో కూడిన కోబాల్ట్ బ్లూ కలర్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ కూడా లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి. మెకానికల్స్ పరంగా ఇది మునుపటి మాదిరిగానే ఉంటుంది. ఈ కొత్త బైక్ దాని మునుపటికంటే కూడా రూ. 35,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

ట్రయంఫ్ బోన్‌విల్ టి120 క్రోమ్ ఎడిషన్ (Triumph Bonneville T120 Chrome Edition):
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ట్రయంఫ్ బోన్‌విల్ టి120 క్రోమ్ ఎడిషన్' ధరలు రూ. 11.89 లక్షలు. ఈ బైక్ మెరిడియన్ బ్లూ సరౌండ్‌తో క్రోమ్ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. దీనికి మెరిడియన్ బ్లూ ఫ్లై స్క్రీన్‌ను కూడా యాక్సెసరీగా పొందవచ్చు. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 80,000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. అయితే మెకానికల్స్ పరంగా ఇందులో ఎటువంటి మార్పులు లేదు.

ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్ క్రోమ్ ఎడిషన్ (Triumph Bonneville Bobber Chrome Edition):
ట్రయంఫ్ యొక్క కొత్త బోన్‌విల్ బాబర్ క్రోమ్ ఎడిషన్ ధర రూ. 12.85 లక్షలు. ఈ ఎడిషన్ జెట్ బ్లాక్ ఓవర్‌లేతో కూడిన క్రోమ్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ట్రయంఫ్ ట్రయాంగిల్ బ్యాడ్జ్ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్ కోసం మీరు అదనంగా జెట్ బ్లాక్ షార్ట్ ఫ్రంట్ మడ్‌గార్డ్ అప్సన్ కూడా పొందవచ్చు. ఈ ఎడిషన్ దాని స్టాండర్డ్ ఎడిషన్ కంటే కూడా రూ. 80,000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది.

ట్రయంఫ్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ క్రోమ్ ఎడిషన్ (Triumph Bonneville Speedmaster Chrome Edition):
ట్రయంఫ్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ క్రోమ్ ఎడిషన్ ఇప్పుడు భారతీయ మార్కెట్లో రూ. 12.85 లక్షల ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 80,000 ఎక్కువ. అయితే ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే చాలా అప్డేట్ డిజైన్ కలిగి ఉంటుంది. అయితే ఇంజిన్ మరియు ఫర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు లేదు.

స్పీడ్‌మాస్టర్ క్రోమ్ ఎడిషన్ ట్రయంఫ్ డయాబ్లో రెడ్ సరౌండ్, జెట్ బ్లాక్ ఫెండర్‌లు, సైడ్ ప్యానెల్స్ మరియు హెడ్‌ల్యాంప్ హౌసింగ్ వంటివి వాటిని పొందుతుంది. బాబర్ బైక్ మాదిరిగానే, స్పీడ్‌మాస్టర్‌ను కూడా జెట్ బ్లాక్ షార్ట్ ఫ్రంట్ మడ్‌గార్డ్ ఆప్సన్స్ తో పొందవచ్చు.

ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ క్రోమ్ ఎడిషన్ (Triumph Rocket 3 R Chrome Edition):
కంపెనీ విడుదల చేసిన బైకుల జాబితాలో 'రాకెట్ 3 ఆర్ క్రోమ్ ఎడిషన్' కూడా ఉంది. ఈ బైక్ ధర రూ. 20.80 లక్షలు. మునుపటి స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే ఈ బైక్ ధర రూ. 90,000 ఎక్కువ. ఇది జెట్ బ్లాక్ కలర్ ఫెండర్‌లు, ఫ్లై స్క్రీన్, హెడ్‌ల్యాంప్ హౌసింగ్, రేడియేటర్ కౌల్స్, సైడ్ ప్యానెల్స్ మరియు రియర్ బాడీవర్క్‌తో కూడిన పూర్తి క్రోమ్ ట్యాంక్ పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ట్రయంఫ్ రాకెట్ 3 జిటి క్రోమ్ ఎడిషన్ (Triumph Rocket 3 GT Chrome Edition):
కంపెనీ దేశీయ విఫణిలో విడుదల చేసిన బైకుల జాబితాలో చివరి బైక్ ఈ 'రాకెట్ 3 GT క్రోమ్ ఎడిషన్'. దీని ధర ప్రస్తుతం రూ. 21.40 లక్షలు. ఈ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 90,000 ఎక్కువ. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ దాదాపు క్రోమ్ తో ఉంటుంది. అంతే కాకూండా ఈ బైక్ యొక్క ముందు భాగంలో డయాబ్లో రెడ్ కలర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రాకెట్ 3 R మాదిరిగానే, 3 GT కి కూడా జెట్ బ్లాక్ ఫెండర్లు, ఫ్లై స్క్రీన్, హెడ్‌ల్యాంప్ హౌసింగ్, రేడియేటర్ కౌల్స్, సైడ్ ప్యానెల్, రియర్ బాడీవర్క్, ఎగువ రేడియేటర్ కౌల్ మరియు ఫోర్క్ గార్డ్ వంటివి మ్యాట్ అల్యూమినియం ఫినిషింగ్ పొందుతాయి. కావున చూడచక్కగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ట్రయంఫ్ మోటార్‌సైకిల్ కంపెనీ ఇప్పుడు ఈ బైకులన్నింటిని మరింత ఆకర్షణీయంగా తయారు చేసింది. ఇవి తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే డిజైన్ లో చాలా మార్పులు జరిగినప్పటికీ ఇందులో మెకానికల్స్ పరంగా ఎటువంటి మార్పులు జరగలేదు. కావున ఈ బైకులు అదే పర్ఫామెన్స్ అందిస్తాయి.


Click it and Unblock the Notifications








