స్పోర్ట్స్ కార్ లాంటి పవర్ అందించే Triumph TE-1 ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్' (Triumph Motorcycles) తాజాగా టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన ఒక నమూనా మోడల్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ చూడటానిక్ చాలా స్టైలిష్ గా మరియు మంచి డిజైన్ కలిగి ఉంది. ఈ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్పోర్ట్స్ కార్ లాంటి పవర్ అందించే Triumph TE-1 ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ట్రయంఫ్ టిఈ-1 (Triumph TE-1) ఎలక్ట్రిక్ బైక్ విలియం అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్ (WAE) సహాయంతో అభివృద్ధి చేయబడిన కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ ను త్వరలోనే వాస్తవ ప్రపంచంలో టెస్టింగ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. దీని గురించి పూర్తి సమాచారం అప్పుడు అందుబాటులోకి వస్తుంది.

స్పోర్ట్స్ కార్ లాంటి పవర్ అందించే Triumph TE-1 ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం, ఈ బైక్ లైట్ వెయిట్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇది మంచి పరిధిని అందించడమే కాకుండా, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ లో లైట్ వెయిట్ బ్యాటరీ ఉపయోగించడం వల్ల దీని బరువు కూడా చాలా వరకు తగ్గుతుంది. కావున మోటారుపై బరువు ఒత్తిడిని తగ్గడం వల్ల పరిధి అనేది ఎక్కువగా ఉంటుంది.

స్పోర్ట్స్ కార్ లాంటి పవర్ అందించే Triumph TE-1 ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ట్రయంఫ్ టిఈ-1 (Triumph TE-1) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క పవర్‌ట్రెయిన్‌లో, కంపెనీ ఇన్వర్టర్ టెక్నాలజీతో పాటు సిలికాన్ కార్బైడ్‌ను ఉపయోగించింది, ఇది మోటారుకు చేరిన వెంటనే బ్యాటరీ మానిఫోల్డ్ శక్తిని పెంచుతుంది. ఈ బైక్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ 670 బిహెచ్‌పి కంటే ఎక్కువ పవర్ ఉత్పత్తి చేయగలదు. ఈ పవర్ స్పోర్ట్స్ కారు కంటే ఎక్కువని కంపెనీ తెలిపింది. కానీ కంపెనీ ఈ బైక్‌కు పవర్ అనేది 130 బిహెచ్‌పికి పరిమితం చేయబడింది.

స్పోర్ట్స్ కార్ లాంటి పవర్ అందించే Triumph TE-1 ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ట్రయంఫ్ టిఈ-1 అనే ఎలక్ట్రిక్ బైక్ యొక్క అభివృద్ధి ప్రస్తుతం నాల్గవ దశలో. ఇది మొత్తం దాదాపుగా 6 నెలల పాటు టెస్టింగ్ చేయబడుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ యొక్క అభివృద్ధి ఈ సంవత్సరం వేసవి నాటికి దాదాపుగా పూర్తయ్యే అవకాశం ఉంది. తరువాత త్వరలోనే ఈ బైక్ మార్కెట్లో అడుగుపెడుతుంది.

ఈ కొత్త బైక్ యొక్క ఉత్పత్తి పూర్తయిన తరువాత ఒరిజినల్ బాడీ ప్యానెల్స్ మరియు పెయింట్లతో పాటు దాని ప్రొడక్షన్ మోడల్ వంటివి బయటపడతాయి. అయితే ప్రస్తుతానికి కంపెనీ టిఈ-1 ఎలక్ట్రిక్ బైక్ యొక్క పరిధి మరియు ఛార్జింగ్ వంటి వివరాలను మరియు ధరకు సంబంధించిన వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇవన్నీ కూడా త్వరలో వెల్లడవుతాయి.

స్పోర్ట్స్ కార్ లాంటి పవర్ అందించే Triumph TE-1 ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ఇదిలా ఉండగా ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా (Triumph Motorcycle India) భారతదేశంలో తన ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ ట్రైడెంట్ 660 (Trident 660) బైక్ ధరను పెంచినట్లు తెలిపింది. ఇప్పుడు ఈ బైక్ ధర మునుపటికంటే కూడా రూ. 50,000 ఎక్కువ. ఈ ధర ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి దేశంలోని అన్ని డీలర్‌షిప్‌లలో అమలుచేయబడింది.

స్పోర్ట్స్ కార్ లాంటి పవర్ అందించే Triumph TE-1 ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ధరల పెరుగుదల తరువాత ట్రయంఫ్ ట్రైడెంట్ 660 కొత్త ధర రూ. 7.45 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. కంపెనీ తన ట్రైడెంట్ 660 బైక్ ని 2021 ఏప్రిల్ నెలలో రూ. 6.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదల చేసింది. ఈ బైక్ పూర్తిగా సిబియు మార్గం ద్వారా దేశీయ మార్కెట్ కి దిగుమతి చేయబడుతుంది. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ మంచి రెట్రో లుకింగ్ మిడిల్ వెయిట్ నేక్డ్ బైక్, ఇందులో చాలా వరకు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి.

ట్రైడెంట్ 660 బైక్ ట్యూబులర్ స్టీల్ పారామీటర్ ఫ్రేమ్‌ని పొందుతుంది. ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్ లో బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 310 మిమీ డ్యూయల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక చక్రంలో 255 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ అందుబాటులో ఉంటాయి.

స్పోర్ట్స్ కార్ లాంటి పవర్ అందించే Triumph TE-1 ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో వచ్చేస్తుంది

ఈ బైక్ ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది. దీని ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంది. బైక్‌లోని ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీ లైట్స్ పొందుతాయి. ఈ బైక్ దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా క్లాసిక్ 350, యెజ్జీ స్క్రాంబ్లర్ మరియు బెనెల్లీ ఇంపీరియల్ 400 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ట్రైడెంట్ 660 (Trident 660) యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 660 సిసి ఇన్‌లైన్ ట్రిపుల్ మోటార్ ఉంది, ఈ ఇంజన్ కంపెనీ యొక్క ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ బైక్ నుండి తీసుకోబడింది. కావున ఇది 81 బిహెచ్‌పి పవర్ మరియు 61 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. మొత్తానికి ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 10, 2022, 9:38 [IST]
English summary
Triumph te 1 electric motorcycle prototype unveiled features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+