మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph), గతేడాది డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ సరికొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ 'ట్రైయంప్ టైగర్ 1200' (Triumph Tiger 1200) ను మే 24, 2022న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఇప్పటికే తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్ మరియు డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్ కోసం బుకింగ్‌లు తీసుకోవడం ప్రారంభించింది. ట్రైయంప్ టైగర్ 1200 బైక్ ను ర్యాలీ మరియు ప్రో అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేయనున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ బైక్ ధరలు, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

ట్రైయంప్ గతేడాది అంతర్జాతీయ మార్కెట్లలో తమ కొత్త టైగర్ 1200 విడుదల చేసింది. అక్కడి మార్కెట్లోల ఇందులో జిటి అనే వేరియంట్ కూడా లభిస్తోంది మరియు ఇది స్టాండర్డ్ వేరియంట్ల కన్నా పెర్ఫార్మెన్స్ వేరియంట్ గా ఉంటుంది. ఈ అడ్వెంచర్ బైక్ ఇప్పుడు అనేక ఆధునిక ఫీచర్లతో పాటుగా కొత్త 1,160 సిసి ఇంజన్‌తో రానుంది. టైగర్ 1200 మోటార్‌సైకిల్ ను కంపెనీ కొత్త తేలికపాటి ఛాసిస్‌పై నిర్మించబడింది ఫలితంగా, ఇది ఎలాంటి ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో నైనా కూడా మంచి స్థిరత్వాన్ని అందిస్తుంది.

మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

కొత్త ట్రైయంప్ టైగర్ 1200 బైక్ 25 కిలోల తేలికైన అల్యూమినియం ఛాసిస్‌పై రూపొందించబడింది. ఈ బైక్ డిజైన్ దాని పాత మోడల్‌తో పోలిస్తే స్లిమ్‌గా ఉంటుంది మరియు ఇది షార్ప్ రియర్ సెక్షన్ ను పొందుతుంది ఓవరాల్‌గా, కొత్త టైగర్ 1200 మరింత మెరుగ్గా కనిపించేలా ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ గణనీయమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ట్రైయంప్ టైగర్ 1200 యొక్క ముఖ్యాంశాలలో ఒకటి, కాంటినెంటల్ భాగస్వామ్యంతో కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త ట్రయంఫ్ బ్లైండ్ స్పాట్ రాడార్ సిస్టమ్.

మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

ట్రైయంప్ నుండి రాబోయే ఈ కొత్త 2022 మోడల్ టైగర్ 1200 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మునుపటి కన్నా మరింత శక్తివంతమైన 1160 సిసి ఇంజన్ రాబోతోంది. ఈ ఇంజన్ పాత మోడల్ కంటే మరింత శక్తివంతమైనది మరియు ఇది గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్‌పి శక్తిని మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ తో పోల్చి చూసినప్పుడు ఇది దాని కంటే 9 బిహెచ్‌పి ఎక్కువ పవర్ మరియు 8 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

ఈ కొత్త ఇంజన్ T-ప్లేన్ క్రాంక్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది, ఇది మరింత ఉత్తేజకరమైన మిడ్-రేంజ్ మరియు లో-ఎండ్ ట్రాక్‌బిలిటీని అందిస్తుంది. కంపెనీ ఈ ఇంజన్‌లో బోర్ మరియు స్ట్రోక్ నుండి క్రాంక్, సిలిండర్ హెడ్, గేర్‌బాక్స్, క్లచ్, షాఫ్ట్ డ్రైవ్ మరియు బెవెల్ బాక్స్ వరకు అన్నింటినీ అప్‌గ్రేడ్ చేసింది. మెకానికల్స్ విషయానికి వస్తే, ఇందులో కొత్త షోవా సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు మరియు ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

టైగర్ 1200 లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ మై ట్రయంఫ్ కనెక్టివిటీ సిస్టమ్‌తో కూడిన 7 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్, ఐఎమ్‌యూవీ ఆప్టిమైజ్ చేయబడిన కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, వివిధ రకాల రైడింగ్ మోడ్‌లు, ఇగ్నిషన్‌తో కూడిన కీలెస్ సిస్టమ్, స్టీరింగ్ లాక్ మరియు ఫ్యూయెల్ క్యాప్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో కార్నరింగ్ ABS, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, కార్నరింగ్ లైట్లు వంటి మరిన్ని ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

ఇంటర్నేషనల్ వెర్షన్ ట్రైయంప్ టైగర్ 1200 ర్యాలీ మోటార్‌సైకిలో ముందు వైపు 21 ఇంచ్ టైరును మరియు వెనుక వైపు 18 ఇంచ్ టైరును ఉపయోగించారు. ఈ టైర్లు ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో రైడర్ కు మంచి హ్యాండ్లింగ్ ను ఆఫర్ చేయడంలో సహకరిస్తాయి. ఇతర మెకానికల్స్ ను గమనిస్తే, ఈ బైక్‌లో ట్రై-లింక్ స్వింగార్మ్ మరియు షాఫ్ట్ డ్రైవ్, షోవా సస్పెన్షన్ మరియు ముందువైపు 320 మిమీ రోటర్ మరియు బ్రేకింగ్ కోసం వెనుకవైపు డిస్క్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి.

మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

ట్రైయంప్ ఈ ప్రీమియం మోటార్‌సైకిల్ ను పూర్తిగా విదేశాలలో తయారు చేసి, ఇక్కడి మార్కెట్ కు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని ధర కూడా కాస్తంత ప్రీమియంగానే ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో కొత్త ట్రయంప్ టైగర్ 1200 ధర సుమారు రూ.18 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4, హోండా ఆఫ్రికా ట్విన్ మరియు బిఎమ్‌డబ్ల్యు ఆర్ 1250 జిఎస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

మే 24వ తేదీన ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల

భారత్‌లో ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 (Triumph Tiger Sport 660) విడుదల

ఇదిలా ఉంటే, ట్రైయంప్ భారత మార్కెట్లో తమ సరికొత్త మిడిల్-వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టైగర్ స్పోర్ట్ 600 (Tiger Sport 660) ను ఇటీవలే విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 ధర రూ. 8.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా నిర్ణయించబడింది. ట్రైయంప్ గతంలో ఆవిష్కరించిన ట్రైడెంట్ 660 నేక్డ్ బైక్‌ను ఆధారంగా చేసుకొని, ఇందులో అడ్వెంచర్ వెర్షన్‌గా టైగర్ స్పోర్ట్ 660 ని తయారు చేశారు. - ఈ బైక్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Triumph tiger 1200 adventure bike launch on 24th may 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X