ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph) తమ సరికొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ 'ట్రైయంప్ టైగర్ 1200' (Triumph Tiger 1200) నేడు (మే 24, 2022) భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ట్రైయంప్ టైగర్ 1200 మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల చేయబడింది. వీటిలో జిటి ప్రో, ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ప్రో మరియు ర్యాలీ ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ. 19.19 లక్షల నుండి రూ. 21.69 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) లో ఉన్నాయి.

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

పాత మోడల్ తో పోల్చుకుంటే, ఈ సరికొత్త 2022 మోడల్ ట్రైయంప్ టైగర్ 1200 అనేక అంశాలలో మెరుగ్గా ఉంటుంది. ట్రైయంప్ బ్రాండ్ వచ్చిన అన్ని టైగర్ సిరీస్ మోటార్‌సైకిళ్లు కూడా వాటి విభాగాల్లో మంచి ప్రాచుర్యాన్ని దక్కించుకున్నాయి. టైగర్ సిరీస్ లో 660సీసీ నుండి 1200సీసీ వరకూ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ లైనప్ ను ఇటీవలే క్రమంగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇటీవలే టైగర్ 800 స్థానంలో టైగర్ 900ని పరిచయం చేసింది. టైగర్ 900 సరికొత్తగా ఉంది మరియు టైగర్ 800 కంటే ప్రతి అంశంలో కూడా మెరుగ్గా ఉంది.

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

భారతదేశంలో ట్రైయంప్ టైగర్ 900 అనేక కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంది, ఇదే సమయంలో కంపెనీ తమ మిడిల్-వెయిట్ అడ్వెంచర్ బైక్ ట్రైయంప్ టైగర్ 660 స్పోర్ట్‌ను కూడా విడుదల చేసింది. తాజాగా, ఇప్పుడు ఈ టైగర్ సిరీస్ లో టైగర్ 1200 బైక్ ను పరిచయం చేసింది. మార్కెట్లో ఈ బైక్ వేరియంట్ల వారీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

- ట్రయంఫ్ టైగర్ 1200 జిటి ప్రో: రూ. 19,19,000

- ట్రయంఫ్ టైగర్ 1200 ఎక్స్‌ప్లోరర్: రూ. 20,69,000

- ట్రయంఫ్ టైగర్ 1200 ర్యాలీ ప్రో: రూ. 20,19,000

- ట్రయంఫ్ టైగర్ 1200 ర్యాలీ ఎక్స్‌ప్లోరర్: రూ. 21,69,000

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త 2022 మోడల్ ట్రైయంప్ టైగర్ మునుపటి మజిక్యులర్ డిజైన్ తో మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుంది. దీని డిజైన్ మరియు స్టైలింగ్ అంశంలోని ప్రతి బిట్ కూడా కొత్తదిగా కనిపిస్తుంది. ముందు భాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు, సెమీ ఫెయిరింగ్ మరియు ఆకర్షణీయమైన గ్రాఫిక్‌లు మొదటి చూపులోనే కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తాయి.

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

బైక్ ముందు భాగంలో తలక్రిందులుగా ఉండే ఫోర్కులు జిటి వేరియంట్లలో అల్లాయ్ వీల్స్‌ మరియు ర్యాలీ వేరియంట్లలో స్పోక్డ్ వీల్స్ ఉంటాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి చక్రాల సైజ్ కూడా మారుతూ ఉంటుంది. జిటి మరియు ర్యాలీ రెండూ కూడా వెనుక వైపున 18 ఇంచ్ వీల్స్ ను కలిగి ఉంటాయి. అయితే, జిటి వేరియంట్ మాత్రం ముందు వైపు 19 ఇంచ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. కాగా, ర్యాలీ వేరియంట్స్ ముందు వైపు ఫుల్ సైజ్ 21 ఇంచ్ వీల్ ని పొందుతుంది.

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ర్యాలీ వేరియంట్స్ సరైన ఆఫ్-రోడ్ బయాస్డ్ డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంటాయి. అయితే జిటి వేరియంట్స్ మాత్రం రోడ్-బయాస్డ్ డ్యూయల్-పర్పస్ టైర్లను పొందుతుంది. ఇందులో త్రీ ఎగ్జాస్ట్ డౌన్‌పైప్‌లు స్టైలింగ్‌కు మరింత ఆకర్షణను జోడిస్తాయి. రెండు మోడల్‌ళ్లలో కూడా పెద్ద ఫంక్షనల్ విండ్‌స్క్రీన్‌ ఉంటుంది మరియు ఇది సర్దుబాటు చేయగల ఆప్షన్ ను కలిగి ఉంటుంది.

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ర్యాలీ మోడల్‌లు క్రాష్ గార్డ్ రూపంలో ఇంజన్‌కు మరింత రక్షణను అందించేందుకు మరియు ఆఫ్-రోడ్ స్పిల్ విషయంలో ఇంజన్ ను కాపాడేందుకు పెద్ద బాష్‌ప్లేట్‌ను కలిగి ఉంటాయి. పెరిగిన ఎగ్జాస్ట్ సిస్టమ్ కారణంగా కొత్త ట్రైయంప్ టైగర్ 1200 బైక్ మంచి క్యారెక్టర్ లభిస్తుంది. ఎక్స్‌ప్లోరర్ ట్రిమ్‌లు పెద్ద 30 లీటర్ ఇంధన ట్యాంకులను కలిగి ఉంటి, ఇవి ప్రో ట్రిమ్‌ల కంటే 10 లీటర్లు ఎక్కువ ఇంధన నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఇక ఇంజన్ విషానికి వస్తే, అన్ని వేరియంట్లు కూడా సరికొత్త లిక్విడ్-కూల్డ్, 1,160 సిసి ఇన్‌లైన్-త్రీ-సిలిండర్ ఇంజన్‌ ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 147 బిహెచ్‌పి శక్తిని మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్ ను పొందుతాయి. ఈ ఇంజన్ నుండి వచ్చే శక్తి స్లిప్పర్ క్లచ్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి పంపిణీ చేయబడుతుంది. ఈ బైక్ పటిష్టత మరియు మన్నికను పెంచడానికి, ట్రయంప్ చైన్ డ్రైవ్ సిస్టమ్‌కు బదులుగా షాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగించింది.

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఇక మెకానికల్ భాగాలను గమనిస్తే, ఈ బైక్ ముందు భాగంలో 49 మిమీ షోవా అప్‌సైడ్-డౌన్ ఫోర్క్‌లుమరియు వెనుక వైపున షోవా సెమీ-యాక్టివ్ మోనోషాక్ యూనిట్ ఉంటాయి. అదే జిటి మోడళ్లలో అయితే, సస్పెన్షన్ ట్రావెల్ 200 మిమీ కాగా, ర్యాలీ మోడల్స్ 20 మిమీ అదనంగా ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు బ్రెంబో స్టైల్మా కాలిపర్‌లతో కూడిన రెండు 320ఎమ్ఎమ్ డిస్క్‌లు మరియు వెనుకవైపు బ్రెంబో సింగిల్-పిస్టన్ కాలిపర్ హ్యాండిల్ బ్రేకింగ్‌తో కూడిన ఒకే 282ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

ట్రైయంప్ టైగర్ 1200 (Triumph Tiger 1200) అడ్వెంచర్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

టైగర్ 1200 ట్రైయంప్ తయారు చేస్తున్న ఫ్లాగ్‌షిప్ బైక్ అయినందున, ఇందులో అత్యంత అధునాతనమైన రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉంటాయి. వీటిలో క్రూయిజ్ కంట్రోల్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ రాడార్ సిస్టమ్, లేన్-చేంజ్ అసిస్ట్, సిక్స్ రైడ్ మోడ్‌లు మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం ఫుల్ కలర్ TFT స్క్రీన్‌ను కూడా ఉంటుంది. టాప్-స్పెక్ ఎక్స్‌ప్లోరర్ ట్రిమ్‌లలో హీటెడ్ సీట్లు మరియు హ్యాండిల్‌బార్ గ్రిప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 24, 2022, 14:38 [IST]
English summary
Triumph tiger 1200 adventure bike launched in india price specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+