భారత్‌లో Triumph Tiger Sport 660 బైక్ విడుదల.. ధర జస్ట్ రూ.8.95 లక్షలు మాత్రమే..!!

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph) గతేడాది అంతర్జాతీయంగా ఆవిష్కరించిన తమ సరికొత్త మిడిల్-వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టైగర్ స్పోర్ట్ 600 (Tiger Sport 660) ను కంపెనీ ఇప్పుడు భారత మార్కెట్లో కూడా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 ధర రూ. 8.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా నిర్ణయించబడింది. ట్రైయంప్ గతంలో ఆవిష్కరించిన ట్రైడెంట్ 660 నేక్డ్ బైక్‌ను ఆధారంగా చేసుకొని, ఇందులో అడ్వెంచర్ వెర్షన్‌గా టైగర్ స్పోర్ట్ 660 ని తయారు చేశారు.

భారత్‌లో Triumph Tiger Sport 660 బైక్ విడుదల.. ధర జస్ట్ రూ.8.95 లక్షలు మాత్రమే..!!

Triumph Tiger Sport 660: ఇంజన్

సరికొత్త ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ట్రైయంప్ ట్రైడెంట్ 660 నేక్డ్ బైక్ ఆధారంగా తయారు చేసిన నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్ మరియు పరికరాలలో అనేక సారూప్యతలు ఉండనున్నాయి. ఇందులో ప్రధానమైనది, దాని 660 సిసి లిక్విడ్-కూల్డ్, 12 వాల్వ్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్, ఇన్‌లైన్ 3-సిలిండర్ ఇంజన్. ఈ ఇంజన్ 10,250 ఆర్‌పిఎమ్ వద్ద 80 బిహెచ్‌పి శక్తిని మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

భారత్‌లో Triumph Tiger Sport 660 బైక్ విడుదల.. ధర జస్ట్ రూ.8.95 లక్షలు మాత్రమే..!!

Triumph Tiger Sport 660: డిజైన్, ఫీచర్లు

టైగర్ సిరీస్‌లో ట్రైయంప్ ఇప్పటికే పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. అయితే, వాటితో పోలిస్తే ఈ సరికొత్త ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 చాలా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. టైగర్ స్పోర్ట్ 660 హాఫ్-ఫెయిరింగ్‌ను (సగం బాడీ ప్యానెల్‌ను) మాత్రమే కలిగి ఉంటుంది కాబ్టటి, ఇది బైక్‍కు షార్ప్ లుక్‌ని ఇస్తుంది. అలాగే ఇందులో ముందు వైపు అమర్చిన డ్యూయల్ హెడ్‌ల్యాంప్ యూనిట్ బైక్‌కు మరింత అగ్రెసివ్ ఫ్రంట్ అప్పీల్‌ను తెచ్చిపెడుతుంది. టైగర్ 660 స్పోర్ట్ లో పెద్ద సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్‌ కూడా ఉంటుంది. ఇది రైడర్‌కు విండ్ బ్లాస్ట్ నుండి రక్షణ కల్పించడంలో సహాయపడుతుంది.

భారత్‌లో Triumph Tiger Sport 660 బైక్ విడుదల.. ధర జస్ట్ రూ.8.95 లక్షలు మాత్రమే..!!

షార్ప్ బాడీ లైన్స్‌తో కూడిన ఇంధన ట్యాంక్ టైగర్ 660 స్పోర్ట్‌కు మంచి మజిక్యులర్ లుక్‌ని అందిస్తుంది. ఇందులో మరొక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే, దాని సైలెన్సర్ డిజైన్ అని చెప్పవచ్చు. ఇది చాలా చిన్నదిగా ఉండి, బైక్ బాడీ క్రింది భాగంలోనే ఇమిడిపోయినట్లుగా ఉంటుంది. బైక్ వెనుక భాగంలో పిలియన్ రైడర్ కోసం ఇరువైపులా గ్రాబ్ రైల్స్ మరియు డ్యూయల్ టెయిల్‌లైట్లు కూడా ఇందులో ఉన్నాయి.

భారత్‌లో Triumph Tiger Sport 660 బైక్ విడుదల.. ధర జస్ట్ రూ.8.95 లక్షలు మాత్రమే..!!

ఇక ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్‌లో కంపెనీ అందిస్తున్న ఫీచర్లను గమనిస్తే, ఇందులో డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది మరియు ఇది పాక్షికంగా TFT ని మరియు పాక్షికంగా LED ని కలిగి ఉంటుంది. టైగర్ స్పోర్ట్ 660 బైక్‌లో రెండు రైడింగ్ మోడ్‌లు (రోడ్ మరియు రైన్) మరియు స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్‌ సిస్టమ్ కూడా ఉంటుంది. సమర్థవంతమైన బ్రేకింగ్ ఇది డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ఫీచర్‌తో వస్తుంది.

భారత్‌లో Triumph Tiger Sport 660 బైక్ విడుదల.. ధర జస్ట్ రూ.8.95 లక్షలు మాత్రమే..!!

Triumph Tiger Sport 660: మెకానికల్స్

టైగర్ స్పోర్ట్ 660 మోటార్‌సైకిల్‌ను ట్యూబులర్ స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించారు. ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను కఠినమై రోడ్లపై సైతం సున్నితమైన రైడింగ్ అనుభూతిని అందించేలా మెరుగైన సస్పెన్షన్ సెటప్‌తో అందిస్తున్నారు. ఇందులో ముందు వైపు 150 మిమీ ట్రావెల్‌తో కూడిన 41 మిమీ షోవా అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపు కూడా 150 మిమీ ట్రావెల్‌తో కూడిన షోవా మోనో షాక్‌ సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించారు. ఇది ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌ను కలిగి ఉంటుంది మరియు ఈ బైక్‌లో ట్విన్ సైడెడ్ స్టీల్ స్వింగ్‌ఆర్మ్ కూడా ఉంటుంది.

భారత్‌లో Triumph Tiger Sport 660 బైక్ విడుదల.. ధర జస్ట్ రూ.8.95 లక్షలు మాత్రమే..!!

ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 పూర్తిగా ఆఫ్-రోడ్ ప్రయోజనాన్ని ఉద్దేశించి రూపొందించిన బైక్ కాదు కాబట్టి, కంపెనీ ఇందులో ఇరువైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 120/70 ZR 17 ప్రొఫైల్‌తో కూడిన టైరు మరియు వెనుకవైపు 180/55 ZR 17 ప్రొఫైల్‌తో కూడిన టైర్‌లను అందిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు నిస్సిన్ బ్రాండ్ నుండి గ్రహించిన 2-పిస్టన్ స్లైడింగ్ కాలిపర్‌లతో కూడిన డ్యూయల్ 310 మిమీ డిస్కులు మరియు వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పిస్టన్ స్లైడింగ్ కాలిపర్‌తో కూడిన సింగిల్ 255 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

భారత్‌లో Triumph Tiger Sport 660 బైక్ విడుదల.. ధర జస్ట్ రూ.8.95 లక్షలు మాత్రమే..!!

Triumph Tiger Sport 660: కొలతలు, కలర్ ఆప్షన్స్

ట్రైయంప్ టైగర్ స్పోర్ట్ 660 బైక్ 2,071 మిమీ పొడవు, 834 మిమీ వెడల్పు మరియు 1,418 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. టైగర్ స్పోర్ట్ 660 యొక్క ఎత్తు ఫ్రంట్ స్క్రీన్ స్థానాన్ని బట్టి 1,315 మిమీ నుండి 1,398 మిమీ మధ్యలో ఉంటుంది. టైగర్ స్పోర్ట్ 660 సీటు భూమి నుండి 835 మిమీ ఎత్తులో ఉంటుంది మరియు ఈ బైక్ మొత్తం బరువు 206 కిలోగ్రాములు (కెర్బ్ వెయిట్)గా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో 17.2 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఇది మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. వీటిలో లూసర్న్ బ్లూ/సఫైర్ బ్లాక్, గ్రాఫైట్/సఫైర్ బ్లాక్ మరియు కొరోసి రెడ్/గ్రాఫైట్ కల్ర ఆప్షన్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Triumph tiger sport 660 adv motorcycle launched in india price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X