భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ ఇ-స్కూటర్ 'Trouve H2'; పూర్తి చార్జ్‌పై 230 కిమీ రేంజ్!

ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ట్రౌవ్ మోటార్ (Trouve Motor) ఇటీవల సరికొత్త హైపర్-స్పోర్ట్స్ బైక్ టీజర్‌ను ఆవిష్కరించి అందరినీ దృష్టిని ఆకట్టుకున్న సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ సంస్థ తమ సరికొత్త ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్‌ టీజర్ ను ఆవిష్కరించింది. ట్రౌవ్ మోటార్ నుండి రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ మాక్సీ స్కూటర్‌ ను హెచ్2 (H2) అనే పేరుతో పిలువనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ స్కూటర్ గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ ఇ-స్కూటర్ 'Trouve H2'; పూర్తి చార్జ్‌పై 230 కిమీ రేంజ్!

భారత మార్కెట్లో విడుదల కానున్న అత్యుత్తమ మరియు అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ట్రౌవ్ హెచ్2 (Trouve H2) కూడా ఒకటి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ మాక్సీ స్కూటర్ బుకింగ్‌ లు ఆగస్టు 2022 నెలలో లో ప్రారంభమవుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది పూర్తి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ గా ఉంటుంది. కంపెనీ దీనిని బెంగళూరులోని ట్రౌవ్ మోటార్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ లో అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ ఇ-స్కూటర్ 'Trouve H2'; పూర్తి చార్జ్‌పై 230 కిమీ రేంజ్!

ట్రౌవ్ హెచ్2తో పాటు మరో 2 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కూడా భారతదేశంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ట్రౌవ్ మోటార్ తెలిపింది. ఈ మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 2023 లో విక్రయించబడతాయని భావిస్తున్నారు. ట్రౌవ్ మోటార్ విడుదల చేసిన హెచ్2 టీజర్ ఫొటోలను గమనిస్తే, ఇది అంతర్జాతీయ మార్కెట్లలో బిఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు విక్రయించే ఖరీదైన పెట్రోల్ మాక్సీ స్కూటర్ల డిజైన్ ను తలపిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై 230 కిమీ రేంజ్ ను అందిస్తుంది.

ట్రౌవ్ హెచ్2 ఇ-స్కూటర్ లో లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్, సింగిల్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, ముందు వైపు అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు, వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్, ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. వస్తుంది. ఇది మెరుగైన ప్రారంభ కాటు మరియు బ్రేక్ అనుభూతి కోసం 2-పిస్టన్ కాలిపర్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది 4G కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేయనుంది మరియు రైడర్‌లకు అధునాతన ఇంటర్నెట్-ఆధారిత ఫీచర్‌లను అందించడానికి గూగుల్ ఆధారిత ఓఎస్‌ను కలిగి ఉండనుంది.

భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ ఇ-స్కూటర్ 'Trouve H2'; పూర్తి చార్జ్‌పై 230 కిమీ రేంజ్!

సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇందులో 2 పిస్టన్ కాలిపర్ లతో కూడిన డిస్క్ బ్రేక్‌లు కూడా ఉండనున్నాయి. ఇవి బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ టెక్నాలజీని కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. సాధారణంగా, భారత మార్కెట్లో విక్రయించబడే అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లలో, 10 నుంచి 12 అంగుళాల చక్రాలు మాత్రమే అందించబడతాయి. కానీ ట్రౌవ్ హెచ్2 ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్‌లో, పెద్ద 14 ఇంచ్ వీల్స్ ను అందించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ హెచ్2 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మాక్సీ స్టైల్ ను మరింత మెరుగపరస్తుంది.

భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ ఇ-స్కూటర్ 'Trouve H2'; పూర్తి చార్జ్‌పై 230 కిమీ రేంజ్!

ట్రౌవ్ హెచ్2 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పవర్‌ట్రైన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.3 సెకండ్లలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఈ భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ స్కూటర్ పూర్తి చార్జ్ పై 130-230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని వరకు ప్రయాణించవచ్చని ట్రౌవ్ మోటార్ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ మాక్సీ స్కూటర్ 2023 ప్రథమార్థంలో వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

హెచ్2 ఎలక్ట్రిక్ మాక్సీ స్కూటర్ కోసం ప్రీ-బుకింగ్స్ ఆగస్టు 2022లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తిగల కస్టమర్ల కోసం కంపెనీ రిజిస్ట్రేషన్లను కూడా ఓపెన్ చేసింది. మరిన్ని వివరా కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (www.trouvemotor.com) ను సందర్శించవచ్చు. ఈ సందర్భంగా ట్రౌవ్ మోటార్ వ్యవస్థాపకుడు అరుణ్ సన్నీ మాట్లాడుతూ, భారతదేశంలో ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా శరవేగంగా అభివృద్ధి చెందిందని, కేవలం 2021లోనే ఇది 132 శాతం వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు.

భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ ఇ-స్కూటర్ 'Trouve H2'; పూర్తి చార్జ్‌పై 230 కిమీ రేంజ్!

ఈ ట్రెండ్ చూస్తుంటే, ప్రస్తుత 2022 సంవత్సరం ఈ వృద్ధి రేటు మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. హెచ్2 ఎలక్ట్రిక్ మాక్సీ-స్కూటర్‌ విడుదలతో తాము ఈ వృద్ధి పథంలో పాలుపంచుకోవడమే కాకుండా, మరిన్ని ఆవిష్కరణలను తీసుకురావడం ద్వారా ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని మరింత విప్లవాత్మకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని అరుణ్ అన్నారు.

భారతదేశపు మొట్టమొదటి హైపర్-మ్యాక్సీ ఇ-స్కూటర్ 'Trouve H2'; పూర్తి చార్జ్‌పై 230 కిమీ రేంజ్!

గంటకు 200 కిమీ వేగంతో పరుగులు తీసే ట్రౌవ్ ఎలక్ట్రిక్ బైక్

ఇదిలా ఉంటే, ట్రౌవ్ మోటార్ గడచిన మార్చ్ నెలలో తమ ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ సూపర్‌ బైక్‌ను ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ సూపర్ ‌బైక్ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని, మరియు కేవలం మూడు సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో 40 kW శక్తిని ఉత్పత్తి చేసే లిక్విడ్-కూల్డ్ ఏసి ఇండక్షన్ మోటార్‌తో కూడిన ఆల్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఉంటుందని, ఇంకా ఇందులో లేజర్ లైటింగ్ ప్యాకేజీ, ఎల్‌ఈడి అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 360 కెమెరా, టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లతో దీనిని రూపొందించామని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Trouve motor teases h2 electric maxi scooter check details here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X