దేశీయ మార్కెట్లో Apache RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) భారతీయ మార్కెట్లో ఈ రోజు రెండు కొత్త ఆధునిక బైకులను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఒకటి 'టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160' (TVS Apache RTR 160) కాగా, మరొకటి 'టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180' (TVS Apache RTR 180).

Recommended Video

భార‌త్‌లో విడుదలైన TVS Ronin | ధర మరియు వివరాలు

కంపెనీ విడుదల చేసిన ఈ రెండు బైకులు ఎలాంటి డిజైన్ కలిగి ఉన్నాయి, ధరలు ఏమిటి అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

టీవీఎస్ కంపెనీ ఇప్పుడు తన అపాచే లైనప్‌లో మరో రెండు బైకులను యాడ్ చేసింది. వీటి ధరల విషయానికి వస్తే 'టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 కేవలం ఒకే వేరియంట్ లో లభిస్తుంది. కావున దీని ధర రూ. 1,30,590. అయితే టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మాత్రమే మొత్తం మూడు వేరియంట్స్ లో లభిస్తాయి. కావున వీటి ధరలు రూ. 1,17,790 నుంచి రూ. 1,24,590 మధ్య ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

2022 TVS Apache RTR 180 సిరీస్ కేవలం రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోస్ బ్లాక్ మరియు పెర్ల్ వైట్ కలర్స్. అదే సమయంలో RTR 160 సిరీస్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోస్ బ్లాక్, పెర్ల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ మరియు టి-గ్రే కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

కంపెనీ విడుదల చేసిన ఈ రెండు బైకులు ఆధునిక స్టైల్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. అయితే ఈ రెండు బైకుల బరువు వాటి మునుపటి మోడల్స్ కంటే కొంత తక్కువగా ఉంటుంది. అదే సమయంలో పర్ఫామెన్స్ కొంత ఎక్కువగా ఉంటుంది. కావున బైక్ రైడర్లను చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

టీవీఎస్ కంపెనీ తన అపాచీ సిరీస్ బైకులను దేశీయ మార్కెట్లో విడుదల చేసినప్పటినుంచి కూడా ఆధునిక టెక్నాలజీలతో ప్రవేశపెట్టింది. అదే పద్దతి ఇప్పుడు కూడా కొనసాగుతోంది. కావున ఈ 2022 అపాచే బైకులతో కూడా స్లిప్పర్ క్లచ్ నుండి స్మార్ట్‌ఎక్స్‌నెక్ట్ (SmartXonnect) వంటి లేటెస్ట్ ఫీచర్ వరకు అందిస్తుంది. అంతే కాకూండా వీటిలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి మొత్తం 28 లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

ఇక డిజైన్ విషయానికి వస్తే, ఇవి ఆధునిక గ్రాఫిక్ డిజైన్స్ పొందటంతో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ మరియు సైడ్ ప్రొఫైల్ లో కంపెనీ యొక్క బ్యాడ్జ్ మొదలైన వాటిని పొందుతుంది. కావున మొత్తం మీద చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన ఈ అప్డేటెడ్ బైకుల యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, Apache RTR 160 159.7 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 ఆర్‌పిఎమ్ వద్ద 16.04 పిఎస్ పవర్ మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 13.85 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ కి జత చేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

ఇక Apache RTR 180 విషయానికి వస్తే, ఇది 177.4 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 17.02 పిఎస్ పవర్ మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 15.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ కి జత చేయబడి ఉంటుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు మూడు రైడ్ మోడ్‌లను పొందుతాయి. అవి రెయిన్, అర్బన్ మరియు స్పోర్ట్ మోడ్స్. మొత్తం మీద ఇవి మంచి పనితీరుని అందిస్తాయి.

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

కంపెనీ యొక్క RTR 160 ధరలు దాని మునుపటి మోడల్ కంటే ఇప్పుడు దాదాపు రూ. 5,000 ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో RTR 180 ధర ఏకంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా రూ. 10,000 ఎక్కువగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో RTR 180 & RTR 160 లాంచ్ చేసిన TVS: ధరలు ఇలా ఉన్నాయి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టీవీఎస్ మోటార్ కంపెనీ ఎట్టకేలకు రెండు కొత్త బైకులు లాంచ్ చేసింది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న అపాచే RTR మరిన్ని మంచి అమ్మకాలు పొందటానికి ఇది చాలా సహాయపడుతుందని ఆశిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2022, 13:43 [IST]
English summary
Tvs apache rtr 160 180 launched in india prices specs features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+