మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) కంపెనీ యొక్క జుపీటర్ దేశీయ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న స్కూటర్ జాబితాలో ఒకటి. అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్కూటర్ ని 'క్లాసిక్ ఎడిషన్' లో లాంచ్ చేసింది. ఈ కొత్త 'జుపీటర్ క్లాసిక్' గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టీవీఎస్ జుపీటర్ క్లాసిక్' ధర రూ. 85,866 (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ). ఇది కేవలం టాప్-స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇది చూడటానికి మునుపటి మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ, వాటి నుంచి ఇది ప్రత్యేకంగా కనిపించడానికి కొత్త కలర్ ఆప్సన్స్ మరియు కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త 'జుపీటర్ క్లాసిక్' ని కొత్త మోడల్ అని చెప్పకనే చెబుతాయి.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

నిజానికి దేశీయ మార్కెట్లో కొత్త టీవీఎస్ జుపీటర్ క్లాసిక్ విడుదలకావడానికి ప్రధాన కారణం, భారతీయ మార్కెట్లో ఇది 'ఐదు మిలియన్ వాహనాల' మైలురాయిని సాధించడమే. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో టీవీఎస్ యొక్క జుపీటర్ కి ఎంత ఆదరణ ఉందొ స్పష్టంగా తెలుస్తుంది.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

టీవీఎస్ జుపీటర్ క్లాసిక్ ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి సిల్వర్ కలర్ మరియు పర్పల్ కలర్. ఈ రెండు కలర్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్కూటర్ లో ఎన్ని కొత్త అప్డేట్స్ వచ్చినప్పటికీ ఇంజిన్ మరియు పనితీరు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

కొత్త టీవీఎస్ జుపీటర్ క్లాసిక్ లో అదే 109.7 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. కావున ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.8 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ మరియు కిక్ స్టార్టర్ రెండింటికీ జత చేయబడి ఉంటుంది, కావున ఇది రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే టీవీఎస్ యొక్క కొత్త 'జుపిటర్ క్లాసిక్' దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ప్రత్యేకంగా ఉండటానికి కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. ఇందులో భాగంగానే ఇందులోని మిర్రర్స్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతాయి. అయితే దాని మునుపటి మోడల్స్ మాత్రం క్రోమ్‌ ఫినిషింగ్ పొందుతాయి.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

జుపీటర్ క్లాసిక్ లోని డైమండ్-కట్ వీల్స్ డిజైన్ మాత్రం జుపీటర్ 125 ని గుర్తుకు తెస్తుంది. ముందుభాగంలో 'జుపీటర్' బ్యాడ్జ్ అనేది కింది నుంచి పైకి ఉంటుంది. అంతే కాకూండా ఫ్రంట్ ఆప్రాన్ లో భారతదేశంలో దీని ఘనతను గుర్తుచేసే '5 మిలియన్' బ్యాడ్జ్ కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా దీనిని కొత్తగా చూపిస్తాయి.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

కొత్త జుపిటర్ క్లాసిక్ స్కూటర్ లో USB ఛార్జర్‌ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఎక్కువమంది కోరుకునే ఫీచర్స్ లో ఒకటి. అంతే కాకూండా ఇందుల స్పీడోమీటర్ డయల్ ఆర్ట్‌, ఆల్ ఇన్ వన్ లాకింగ్ సిస్టమ్ మరియు ఇంజన్ కిల్ స్విచ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

ఇక బ్రేకింగ్, సస్పెన్షన్ మరియు టైర్స్ వంటి వాటిని పరిశీలిస్తే, ఈ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో ఒకే పరిమాణంలో ఉండే టైర్లు ఉంటాయి. అదే సమయంలో ఈ స్కూటర్ ముందు వైపు డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేకులు అందుబాటులో ఉంటాయి. టీవీఎస్ జుపీటర్ యొక్క మొత్తం బరువు 109 కేజీల వరకు ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందింస్తుందని జుపీటర్ వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పవలసిన ఆవాసం లేదు.

మరింత ఆకర్షణీయంగా మారిన టీవీఎస్ జుపీటర్.. ఇప్పుడు 'జుపీటర్ క్లాసిక్' అవతారంలో: ధర ఎంతంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టీవీఎస్ జుపిటర్ క్లాసిక్.. హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అదే సమయంలో ధరల విషయంలో ఇది టీవీఎస్ జుపీటర్ జెడ్ఎక్స్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ కంటే కూడా రూ. 2,200 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది.

మొత్తం మీద పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ తో విడుదలకావడం జుపీటర్ ప్రియులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. కావున ఈ సీజన్లో కొత్త జుపీటర్ క్లాసిక్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Tvs launched new jupiter classic variant in india price features details
Story first published: Friday, September 23, 2022, 17:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X