స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) దేశీయ మార్కెట్లో హోండా యాక్టివా (Honda Activa) స్కూటర్ కి పోటీగా విక్రయిస్తున్న టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) లో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసింది. స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త 2022 TVS Jupiter ZX ను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.80,973 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

మార్కెట్లోని ఇతర స్మార్ట్ స్కూటర్ల మాదిరిగానే ఈ కొత్త 2022 టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ వేరియంట్ కూడా ఇప్పుడు బ్లూటూత్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. కొత్త స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ (SmartXonnect ) టెక్నాలజీ వచ్చిన ఈ స్కూటర్ లో కంపెనీ వాయిస్ అసిస్ట్ ఫీచర్‌ ను కూడా జోడించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో పూర్తి డిజిటల్ కన్సోల్, నావిగేషన్ మరియు వాయిస్ అసిస్ట్ ఫీచర్‌ను అందించే ఏకైక 110 సీసీ స్కూటర్ టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ అని కంపెనీ తెలిపింది.

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

టీవీఎస్ జూపిటర్ యొక్క సిద్ధాంతం 'జ్యాదా కా ఫైదా' (ఎక్కువ వల్ల లాభం) తో ఈ కొత్త 2022 టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ (2022 TVS Jupiter ZX) వేరియంట్ పూర్తిగా ఏకీభవిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, భారతదేశంలో కొనుగోలుదారులు అత్యధికంగా ఇష్టపడే స్కూటర్‌లలో టీవీఎస్ జూపిటర్ కూడా ఒకటిగా ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను టీవీఎస్ జూపిటర్ గ్రాండే ఎడిషన్‌తో 110 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో తొలిసారిగా పరిచయం చేశారు.

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

ఇప్పుడు, ఈ SmartXonnect ఫీచర్ లో భాగంగా పూర్తి డిజిటల్ కన్సోల్, వాయిస్ అసిస్ట్, నావిగేషన్ అసిస్ట్ మరియు SMS / కాల్ అలర్ట్‌లు వంటి అదనపు సాంకేతికత ఫీచర్లు కొత్త టాప్-ఆఫ్-లైన్ వేరియంట్‌లో లభ్యం కానున్నాయి. ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ప్రస్తుతం మన మార్కెట్లో వాయిస్ అసిస్ట్ ఫీచర్‌ను అందించే 110 సీసీ సెగ్మెంట్‌లో టీవీఎస్ జూపిటర్ మొదటి స్కూటర్‌గా నిలుస్తుంది.

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

కొత్త TVS SmartXonnect ప్లాట్‌ఫారమ్ ఆండ్రాయిడ్ (Andriod) మరియు యాపిల్ ఐఓఎస్(Apple iOS) యూజర్లకు అందుబాటులో ఉటుంది. కంపెనీ ఇందుకోసం ప్రత్యేకమైన టీవీఎస్ కనెక్ట్ (TVS Connect) మొబైల్ యాప్‌ను కూడా అందిస్తోంది. యూజర్లు ఈ యాప్ ను సంబంధిత ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, బ్లూటూత్ టెక్నాలజీ సాయంతో తమ స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ కావచ్చు మరియు వివిధ ఫంక్షన్లను యాక్సెస్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

ఇందులోని ఇంటరాక్టివ్ వాయిస్ అసిస్ట్ ఫీచర్ సాయంతో యూజర్లు పలు రకాల వాయిస్ కమాండ్స్ ఇవ్వడం ద్వారా తమ స్కూటర్ లోని వివిధ ఫంక్షన్‌ లను కంట్రోల్ చేయవచ్చు. ఇందుకోసం బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు, వైర్డ్ హెడ్‌ఫోన్‌లు లేదా కనెక్ట్ చేయబడిన మరియు బ్లూటూత్ అమర్చిన హెల్మెట్ వంటి పరికరాలను కూడా ఉపయోగించవచ్చు. యూజర్ అందించే వాయిస్ కమాండ్స్‌ కి స్కూటర్ ఇచ్చే ప్రతిస్పందన స్కూటర్ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పై కనిపిస్తుంది లేదా యూజర్ ధరించిన హెడ్‌ఫోన్‌ ల ద్వారా ఆడియో ఫీడ్‌బ్యాక్‌ గా వినిపిస్తుంది.

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

కొత్త 2022 టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ స్కూటర్ ఇప్పుడు సిల్వర్ ఓక్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్‌ తో వస్తుంది, ఇది ఈ ఫ్లాగ్‌షిప్ వేరియంట్‌ ని మిగిలిన వేరియంట్ల నుండి వేరు చేయడానికి మరియు విశిష్టంగా ఉంచడానికి సహకరిస్తుంది. కొత్త జూపిటర్ స్కూటర్ లో ఈ అధునాతన ఫీచర్లు మాత్రమే కాకుండా, ఈ కొత్త జెడ్ఎక్స్ వేరియంట్ లో కొత్త డిజైన్ ప్యాటర్న్ తో కూడిన కొత్త డ్యూయల్ టోన్ సీట్ కూడా లభిస్తుంది.

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

అదనంగా, టీవీఎస్ జూపిటర్ సిరీస్‌లోని ఈ జెడ్ఎక్స్ వేరియంట్ పిలియన్‌కి అదనపు సౌకర్యాన్ని అందించడానికి వెనుక బ్యాక్‌రెస్ట్‌ కూడా ఉంటుంది. కొత్త TVS Jupiter ZX SmartXonnect వేరియంట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ మరియు ఐ-టచ్‌ స్టార్ట్‌తో ఇంటెలిగో టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, 2 లీటర్ గ్లోవ్‌బాక్స్ మొబైల్ ఛార్జర్, 21 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కొత్త 2022 TVS Jupiter ZX విడుదల: ధర రూ.80,973

కొత్త 2022 టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ వేరియంట్ ఇప్పుడు మాట్ బ్లాక్ మరియు కాపర్ బ్రౌన్ అనే రెండు కొత్త ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్ లో ఫీచర్ అప్‌గ్రేడ్స్ మరియు చిన్నపాటి కాస్మెటిక్ అప్‌డేట్స్ మినహా, యాంత్రికంగా మరియు మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో, మునుపటి మోడళ్లలో ఉపయోగించిన అదే 110 సిసి ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 5.8 kW శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2022, 16:00 [IST]
English summary
Tvs launches new jupiter zx smartxonnect with voice assist feature price and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+