గోవాలో జరగనున్న TVS MotoSoul అల్టిమేట్ బైకింగ్ ఫెస్టివల్ - పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) 2023 జనవరి 03 మరియు 04 వ తేదీలలో TVS MotoSoul అనే బైకింగ్ ఫెస్టివల్ నిర్వహించనుంది. TVS MotoSoul రెండవ ఎడిషన్ గోవాలోని హిల్‌టాప్ వాగేటర్‌లో జరుగుతుంది.

TVS MotoSoul 2023 రెండు రోజుల మోటార్‌సైకిల్ మ్యూజిక్ ఫెస్టివల్ చాలా ఉత్తేజకరంగా నిర్వహించబడుతుంది. ఇందులో చాలా మంది ప్రముఖులు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఈవెంట్‌లో మోటో క్రాస్‌ఫిట్, డర్ట్ రేస్ వంటివి నిర్వహించబడతాయి. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్‌కు చెందిన స్టంట్ రైడర్లు కూడా పాల్గొంటారు. ఇందులో లైవ్ కాన్వాస్ పెయింటింగ్ మరియు సంగీత ప్రదర్శనలు కూడా నిర్వహించబడతాయి.

గోవాలో జరగనున్న TVS MotoSoul అల్టిమేట్ బైకింగ్ ఫెస్టివల్

TVS MotoSoul ఈవెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతి మరియు జీవనశైలి మొదలైన వాటి సమ్మేళనాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం TVS MotoSoul బైకింగ్ ప్రపంచంలోని వివిధ ప్రముఖుల నుండి టెక్ చర్చలను కూడా నిర్వహిస్తుంది. ఇందులో కస్టమర్‌లు, అడ్మైరర్స్ మరియు ఔత్సాహికులు తమ జీవితకాల అనుభవాలను ఇందులో తెలియజేస్తారు. ఇవన్నీ తప్పకుండా ఔత్సాహికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ ఆ రెండు రోజులు జరిగే ఈవెంట్ లో నిర్వహించబడతాయి.

రెండు రోజులపాటు జరిగే ఉత్సాహభరితమైన ఈ TVS MotoSoul ఈవెంట్‌లో ఉత్కంఠభరితమైన ప్రదర్శనలను అందించే అంతర్జాతీయ కళాకారులు, ప్రపంచ సంగీత కళాకారులు మరియు DJ లతో గ్రూవీ వైబ్‌లు ఉంటాయి. ఈ ఫెస్టివల్‌కు హాజరైనవారు కొంత మంది ప్రసిద్ధ సంగీత విద్వాంసుల స్వరాలకు డ్యాన్స్ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. మొత్తానికి 2023 TVS MotoSoul ఎంతోమంది మోటార్‌సైకిల్ ఔత్సాహికులందరికీ స్వాగతం పలకడానికి సిద్దమైపోతోంది.

2023 TVS MotoSoul ఈవెంట్ లో కంపెనీ తమ ప్రసిద్ధ ఉత్పత్తులను కూడా ప్రదర్శించనుంది. ఇవన్నీ TVS మోటార్ కంపెనీ ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈవెంట్ లో ప్రతి తినుబండారాల అభిరుచికి అనుగుణంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. నిజానికి ఈ ఈవెంట్ ఇంతకు ముందే నిర్వహించి ఉండాల్సింది, కానీ దేశంలో ప్రబలంగా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారిని వల్ల అప్పుడు జరగవలసిన ఈ ఈవెంట్ రాబోయే నెలలో నిర్వహించబడుతుంది.

త్వరలో నిర్వహించే ఈ TVS MotoSoul గురించి టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ బిజినెస్ 'విమల్ సుంబ్లీ' మాట్లాడుతూ.. టీవీఎస్ మోటార్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఇనిషియేటివ్ అయిన 2023 TVS MotoSoul 'ది అల్టిమేట్ బైకింగ్ ఫెస్టివల్‌'ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రీమియం మోటార్‌సైకిల్ ఓనర్స్ మరియు బైకింగ్ ఔత్సాహికులు ఈ ఫెస్టివల్ వేదికలో పాల్గొంటారు. ఇందులో రేసింగ్ & బైకింగ్ చేసే దిగ్గజాలతో సంభాషించడం తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

రెండు రోజుల పాటు గోవాలో జరగనున్న ఈ TVS MotoSoul ఫెస్టివల్ తప్పకుండా బైకింగ్ ఔత్సాహికులకు మంచి సందేశాన్ని అందిస్తుంది. ఇందులో వివిధ ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలు కూడా కలగలిసి ఔత్సాహికులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి. మొత్తానికి తప్పకుండా దేశం నలుమూలల నుంచి బైక్ ఔత్సాహికులకు మొదలైన వారు ఇందులో పాల్గొని తమ అనుభవాలను కూడా పంచుకోనున్నారు. గతంలో కూడా కంపెనీ ఈ ఫెస్టివల్ నిర్వహించింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేసి కష్టమర్లను ఆకర్శించడమే కాకుండా.. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఇప్పుడు జనవరి 3 మరియు 4 న జరిగే TVS MotoSoul ఫెస్టివల్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మరియు మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 24, 2022, 12:41 [IST]
English summary
Tvs motor announced motosoul festival 2023 in goa details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+