Just In
- 1 hr ago
ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!
- 1 hr ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 2 hrs ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 4 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
Don't Miss
- News
75 శాతం ఉద్యోగాలు స్దానికులకే -కంపెనీలకు మరోసారి తేల్చి చెప్పేసిన జగన్
- Sports
హార్దిక్ పాండ్యా ఉంటే ఇండియా వేరే లెవెల్ టీం.. పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తిన లాన్స్ క్లూసెనర్
- Technology
Reliance నుంచి Jio 5G Phone ..! ధర & స్పెసిఫికేషన్లు వివరాలు
- Finance
Srilanka crisis: ప్రజలకు లంకంత కష్టం.. కిలో చికెన్ రూ.1,200, ఒక్కో గుడ్డు రూ.62.. ఎందుకంటే..
- Lifestyle
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- Movies
Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
జున్ నెల అమ్మకాలలో అదరగొట్టిన టీవీఎస్ మోటార్ కంపెనీ.. జులై 6న కొత్త టూవీలర్ లాంచ్!
చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన జూన్ 2022 నెల అమ్మకాలలో మంచి ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. జూన్ 2021 నెలలో కంపెనీ విక్రయించిన 2,51,886 యూనిట్లతో పోలిస్తే జూన్ 2022 నెలలో కంపెనీ మొత్తం 3,08,501 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు 22 శాతం వృద్ధి చెందాయి. గత నెలలో స్కూటర్, మోటార్‌సైకిల్, త్రీవీలర్ మరియు ఎలక్ట్రిక్ టూవీలర్ విభాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి.

టీవీఎస్ మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు (స్కూటర్ మరియు మోటార్‌సైకిల్ అమ్మకాలు కలిపి) జూన్ 2021 నెలలో 2,38,092 యూనిట్ల నుండి జూన్ 2022 నెలలో 2,93,715 యూనిట్లకు పెరిగి 23 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. కాగా, ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు జూన్ 2021 నెలలో 1,45,413 యూనిట్ల నుండి జూన్ 2022 నాటికి 1,93,090 యూనిట్లకు పెరిగి 33 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

గత నెలలో కేవలం మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 1,46,075 యూనిట్లుగా నమోదు కాగా, స్కూటర్ అమ్మకాలు 1,05,211 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం ఎగుమతులు కూడా జూన్ 2021లో 1,06,246 యూనిట్ల నుండి జూన్ 2022 నాటికి 1,14,449 యూనిట్లకు పెరిగాయి. అదే సమయంలో, ద్విచక్ర వాహనాల ఎగుమతులు జూన్ 2021లో 92,679 యూనిట్ల నుండి జూన్ 2022 నాటికి 1,00,625 యూనిట్లకు పెరిగాయి.

సెమీకండక్టర్ల సరఫరాలో కొరత కారణంగా ప్రీమియం ద్విచక్ర వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాలపై ప్రభావం పడిందని, అయినప్పటికీ తాము ప్రత్యామ్నాయ వనరులతో ముందుకు సాగుతున్నామని మరియు వీలైనంత త్వరగా సరఫరాను మెరుగుపరచడానికి తాము చేయగలిగినదంతా చేస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలలో చిప్స్ సరఫరాలో కొంత మెరుగుదల ఉందని, సెమీకండక్టర్ సరఫరా మెరుగుపడటం కొనసాగుతుంది కాబట్టి, వాహనాల ఉత్పత్తి మరియు సేల్స్ సాధారణ స్థాయికి తిరిగి వస్తాయని తాము ఆశిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

టీవీఎస్ మోటార్ కంపెనీ త్రిచక్ర వాహన విభాగంలో కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ త్రీ-వీలర్ అమ్మకాలను గమనిస్తే, జూన్ 2021 నెలలో ఇవి 13,794 యూనిట్లుగా నమోదైతే, జూన్ 2022 నాటికి 14,786 యూనిట్లకు పెరిగి 7 శాతం వృద్ధిని కనబరిచాయి. టీవీఎస్ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విషయానికి వస్తే, గడచిన జూన్ 2022 నెలలో ఇవి 4,667 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది టీవీఎస్ ఐక్యూబ్య యొక్క అత్యధిక నెలవారీ విక్రయాల సంఖ్య మరియు మే 2022 నెల అమ్మకాలతో పోలిస్తే, ఇవి 77 శాతం పెరిగాయి.

జులై 6న టీవీఎస్ నుండి కొత్త బైక్ విడుదల..
ఇదిలా ఉంటే, టీవీఎస్ మోటార్ కంపెనీ జూలై 6 వ తేదీన భారత మార్కెట్లో ఓ కొత్త బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. కంపెనీ ఇంకా ఈ కొత్త పేరును ప్రకటించనప్పటికీ, రాబోయే కొత్త బైక్ అపాచే ఆర్ఆర్ 310 లేదా జెప్పెలిన్ క్రూయిజర్ బైక్ యొక్క నేక్డ్ వెర్షన్ కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. టీవీఎస్ జెప్పెలిన్ తొలిసారిగా 2018 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడింది.

టీవీఎస్ జెప్పెలిన్ ఒక క్రూయిజర్ స్టైల్ బైక్, ఇందులో 220 సీసీ సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది, ఈ ఇంజన్ గరిష్టంగా 20 బిహెచ్పి పవర్ మరియు 18.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని అంచనా. మరో నివేదిక ప్రకారం, టీవీఎస్ నుండి జులై 6న కొత్తగా రాబోయే టూవీలర్ ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్పోర్ట్స్ స్కూటర్ ఎన్‌టార్క్ (NTorq) యొక్క మరొక కొత్త వేరియంట్ కూడా అయి ఉండొచ్చని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ రేడియాన్ బైక్ విడుదల
ఇదిలా ఉంటే, టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ టీవీఎస్ రేడియన్ (TVS Radeon) లో కంపెనీ ఓ కొత్త 2022 మోడల్ ను విడుదల చేసింది. ఈ కొత్త 2022 టీవీఎస్ రేడియన్ రిఫ్రెష్డ్ డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 59,925 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, టాప్ వేరియంట్ (డిజి డ్రమ్ డ్యూయల్ టోన్ వేరియంట్) ధర రూ. 71,966 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

కొత్త 2022 టీవీఎస్ రేడియాన్ ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో లభిస్తుంది. దీంతో ఈ సెగ్మెంట్లోనే మొదటి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగిన 110 సిసి బైక్‌గా మారింది. టీవీఎస్ రేడియాన్ తొలిసారిగా 2018లో భారత మార్కెట్లో విడుదలైంది. ఆ తర్వాత ఈ బైక్ లో కంపెనీ చిన్నపాటి మార్పులు చేర్పులు చేసినప్పటికీ, ఫీచర్ల పరంగా వస్తున్న మొదటి మేజర్ అప్డేట్ ఇది. ఈ 2022 మోడల్ ఇప్పుడు రియల్ టైమ్ మైలేజ్ వంటి విషయాలను తెలియజేసే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. ఇంకా ఇందులో మైలేజ్‌ను పెంచేందుకు ఇంటెలిగో సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. - ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.