టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారత విపణిలో విక్రయిస్తున్న తమ స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq) లో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను 'టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి' (TVS Ntorq 125 XT) అనే పేరుతో పిలుస్తోంది. భారత మార్కెట్లో కొత్త TVS Ntorq 125 XT ధర రూ. 1,02,823 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించబడింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటికే తమ ఎన్‌టార్క్ స్కూటర్‌ను నాలుగు విభిన్న వేరియంట్‌ లలో విక్రయిస్తోంది. వీటిలో స్టాండర్డ్ (TVS Ntorq Standard) మోడల్, రేస్ ఎడిషన్ (TVS Ntorq Race Edition), సూపర్ స్క్వాడ్ ఎడిషన్ (TVS Ntorq Super Squad Edition) మరియు రేస్ ఎక్స్‌పి (TVS Ntorq Race XP) వేరియంట్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చిన 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ తో దీని మొత్తం వేరియంట్ల సంఖ్య ఐదుకు పెరిగింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి మోడల్ విభిన్నమైన గ్రాఫిక్స్ మరియు కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌లలో TFT మరియు LCD ప్యానెల్‌లు రెండింటినీ కలిగి ఉండే కొత్త హైబ్రిడ్ SmartXonnect డిస్‌ప్లే ఈ వేరియంట్ లో ఉంటుంది. కొత్త ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి లోని SmartXonnect డిస్‌ప్లే రెండు ప్రధాన కొత్త అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. వీటిలో మొదటిది టీవీఎస్ స్మార్ట్‌ఎక్స్‌టాక్‌గా పిలిచే వాయిస్ అసిస్ట్ అప్‌డేట్. ఈ ఫీచర్ సాయంతో Ntorq 125 XT యజమానులు వాయిస్ అసిస్టెంట్ సహాయంతో స్పోకెన్ కమాండ్‌లను ఉపయోగించి అనేక ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

రైడర్లు ఈ సరికొత్త SmartXtalk ఫీచర్ సాయంతో తమ టీవీఎస్ Ntorq XT స్కూటర్ యొక్క రైడ్ మోడ్‌లను మార్చడానికి, స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని సర్దుబాటు చేయడానికి, ఇష్టపడే గమ్యస్థానానికి నావిగేట్ చేయడానికి మరియు సంగీతాన్ని కంట్రోల్ చేయడానికి వివిధ రకాల వాయిస్ కమాండ్స్ ను ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, స్కూటర్ యొక్క ఇంధన స్థాయిలు తక్కువగా ఉన్నా, ఇంధనం వృధా అవుతున్నా, ఫోన్ బ్యాటరీ స్థాయిలు తక్కువగా ఉన్నా, ఈ ఫీచర్ రైడర్‌లను హెచ్చరిస్తుంది మరియు ఆడియో ఫీడ్‌బ్యాక్ ద్వారా వాయిస్ అలెర్ట్స్ అందిస్తుంది. ఇది వాతావరణ పరిస్థితులను కూడా తెలియజేస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

ఇక కొత్త TVS Ntorq 125 XT వేరియంట్ లోని రెండవ ప్రధానమైన ఫీచర్‌ దాని స్మార్ట్ఎక్స్‌ట్రాక్ (SmartXtrack). స్కూటర్ పై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉన్నప్పుడు స్లయిడర్ స్క్రీన్‌ల సెట్ ద్వారా క్రికెట్ మరియు ఫుట్‌బాల్ స్కోర్‌లు, సోషల్ మీడియా అప్‌డేట్‌లు, వార్తలు, వాతావరణం మరియు ఇతర వాటిని ట్రాక్ చేయడానికి ఈ ఫీచర్ యజమానులను అనుమతిస్తుంది. వ్యక్తి కాల్ చేసినప్పుడు స్కూటర్ స్క్రీన్‌పై ప్రదర్శించబడే ఇన్‌కమింగ్ కాలర్ ఇమేజ్‌తో పాటు వారి ప్రొఫైల్ ఇమేజ్‌ను సెటప్ చేయడానికి కూడా ఈ ఫీచర్ అనుమతిస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

ఈ కొత్త వేరియంట్ లో కంపెనీ అప్‌డేట్ చేసినవి ఈ రెండు ఫీచర్లు మాత్రమే. అయితే. చూడటానికి TVS Ntorq 125 లైనప్‌లోని ఇతర వేరియంట్‌ల ఈ కొత్త ఎక్స్‌టి వేరియంట్ ను ప్రత్యేకంగా నిలబడేలా చేయడానికి ఇందులో ప్రధానమైన మార్పు ఉంటుంది, అదే కొత్త నియాన్ గ్రీన్ పెయింట్ స్కీమ్. ఈ ప్రత్యేకమైన కలర్‌లో ఎక్స్‌టి వేరియంట్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇకపోతే, ఇందులో యాంత్రిక పరంగా మరియు మెకానికల్ ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ కొత్త ఎక్స్‌టి వేరియంట్ ఇప్పుడు ఈ స్కూటర్ లైనప్‌లో టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ గా ఉంటుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

ప్రస్తుతం, మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ సిరీస్ ధరలు రూ. 77,000 నుండి ప్రారంభమవుతాయి. కాగా, ఇందులో డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 81,500 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉంటాయి. కాగా, ఇందులో కొత్తగా వచ్చిన TVS Ntorq 125 XT వేరియంట్ ధర రూ. 1,02,823 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

టీవీఎస్ ఎన్‌టార్క్ ఈ సెగ్మెంట్లో ఓ బెస్ట్ పెర్ఫార్మెన్స్ 125 సిసి స్కూటర్. ఇందులో 3-వాల్వ్, 125cc ఇంజన్‌ ఉంటుంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.2 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని రేస్ ఎక్స్‌పి వేరియంట్ (TVS Ntorq 125 Race XP) కొంచెం ఎక్కువ పవర్, టార్క్ లను కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.05 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి పంపిణీ చేయబడుతుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) వేరియంట్ విడుదల; ధర లక్ష రూపాయలకు పైమాటే..!

ఈ స్కూటర్ లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ సెటప్ మరియు వెనుక వైపు కాయిల్ స్ప్రింగ్ యూనిట్ ఉంటాయి. ఈ స్పోర్టీ స్కూటర్‌ను అండర్‌బోన్ ట్యూబ్యులర్ టైప్ ఫ్రేమ్ పై తయారు చేశారు. ఈ స్కూటర్ ముందు మరియు వెనుక వైపున 100/80 టైర్‌లతో కూడిన 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ లు ఉంటాయి. టీవీఎస్ ఎన్‌టార్క్ యొక్క ఇతర ఫీచర్లలో బాహ్య ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఇంజన్ కిల్ స్విచ్, ఎల్ఈడి లైటింగ్ మరియు 5.8-లీటర్ ఇంధన ట్యాంక్ ఉన్నాయి. ఇది ఈ విభాగంలో హోండా యాక్టివా 125, యమహా రే - ZR125, అప్రిలియా 125 మరియు సుజుకి అవెనిస్ 125 లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Tvs motor company launches ntorq 125 xt variant price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X