భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company), భారత మార్కెట్లో ఈ ఏడాది (2022లో) అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా తమ ప్రోడకట్ లైనప్‌ను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. కొత్త ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టడానికి మరియు ద్విచక్ర వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కంపెనీ 700 కోట్ల రూపాయల మూలధనాన్ని వెచ్చించేందుకు టీవీఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కూడా విడుదల చేయనున్నారు.

భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన జనవరి 2020లో ఐక్యూబ్ (iQube) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌తో భారత ఈవీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కంపెనీ ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 12,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఓ మీడియా కథనం ప్రకారం, టీవీఎస్ 5Kw మరియు 25 Kw విభాగాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర మరియు మూడు చక్రాల వాహనాలను సిద్ధం చేస్తోంది. ఇవన్నీ రాబోయే 8 త్రైమాసికాలలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిలో మొదటి ఈవీ FY 23 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి రావచ్చని అంచనా.

భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

ప్రస్తుతం, టీవీఎస్ నుండి లభిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్. దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, కంపెనీ తమ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని ఏటా 10,000 యూనిట్లకు పెంచాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20.5 లక్షల యూనిట్ల విక్రయాలతో టూ-వీలర్ స్పేస్‌లో 17 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ గడచిన ఆర్థిక సంవత్సరంలో 10.9 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, దేశీయ విపణిలో దీని ధర లక్ష రూపాయాలకు పైగా ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.4 కిలోవాట్ల హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది స్కూటర్ లో అమర్చిన 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ల సాయంతో పనిచేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు ఇది పూర్తి చార్జ్‌పై 80 కిలోమీటర్ల రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుంది.

భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలోనే గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటి సాయంతో రైడర్ తన స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌కు రిమోట్‌గా కనెక్ట్ చేసి, వివిధ రకాల ఫీచర్లను తెలుసుకోవచ్చు.

భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

భారత్‌లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) విడుదల

ఇదిలా ఉంటే, టీవీఎస్ భారత విపణిలో విక్రయిస్తున్న తమ స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq) లో కంపెనీ ఓ కొత్త ప్రీమియం వేరియంట్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి (TVS Ntorq 125 XT) అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త మోడల్ ధర రూ. 1,02,823 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టి మోడల్ విభిన్నమైన గ్రాఫిక్స్ మరియు కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

ఇందులో కొత్తగా TFT మరియు LCD ప్యానెల్‌లను రెండింటినీ కలిగి ఉండే కొత్త హైబ్రిడ్ SmartXonnect డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇది రెండు ప్రధాన కొత్త అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. వీటిలో మొదటిది టీవీఎస్ స్మార్ట్‌ఎక్స్‌టాక్‌ (SmartXtalk)గా పిలిచే వాయిస్ అసిస్ట్ అప్‌డేట్. ఈ ఫీచర్ సాయంతో Ntorq 125 XT యజమానులు వాయిస్ అసిస్టెంట్ సహాయంతో స్పోకెన్ కమాండ్‌లను ఉపయోగించి అనేక ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. రైడర్లు ఈ సరికొత్త SmartXtalk ఫీచర్ సాయంతో తమ టీవీఎస్ Ntorq XT స్కూటర్ యొక్క రైడ్ మోడ్‌లను మార్చడానికి, స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని సర్దుబాటు చేయడానికి, ఇష్టపడే గమ్యస్థానానికి నావిగేట్ చేయడానికి మరియు సంగీతాన్ని కంట్రోల్ చేయడానికి వివిధ రకాల వాయిస్ కమాండ్స్ ను ఉపయోగించవచ్చు.

భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

అలాగే, స్కూటర్ యొక్క ఇంధన స్థాయిలు తక్కువగా ఉన్నా, ఇంధనం వృధా అవుతున్నా, ఫోన్ బ్యాటరీ స్థాయిలు తక్కువగా ఉన్నా, ఈ ఫీచర్ రైడర్‌లను హెచ్చరిస్తుంది మరియు ఆడియో ఫీడ్‌బ్యాక్ ద్వారా వాయిస్ అలెర్ట్స్ అందిస్తుంది. ఇది వాతావరణ పరిస్థితులను కూడా తెలియజేస్తుంది. ఇకపోతే, ఇందులో రెండవ ప్రధాన ఫీచర్ స్మార్ట్ఎక్స్‌ట్రాక్ (SmartXtrack). రైడర్లు ఈ స్కూటర్ పై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉన్నప్పుడు స్లయిడర్ స్క్రీన్‌ల సెట్ ద్వారా క్రికెట్ మరియు ఫుట్‌బాల్ స్కోర్‌లు, సోషల్ మీడియా అప్‌డేట్‌లు, వార్తలు, వాతావరణం మరియు ఇతర వాటిని ట్రాక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

భారత్‌లో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్.. టీవీఎస్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు..

ఎవరైనా వ్యక్తులు కాల్ చేసినప్పుడు స్కూటర్ స్క్రీన్‌పై ప్రదర్శించబడే ఇన్‌కమింగ్ కాలర్ ఇమేజ్‌తో పాటు వారి ప్రొఫైల్ ఇమేజ్‌ను సెటప్ చేయడానికి కూడా ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ఇది కొత్త నియాన్ గ్రీన్ పెయింట్ స్కీమ్ లో లభిస్తుంది మరియు ఈ ప్రత్యేకమైన కలర్‌లో ఎక్స్‌టి వేరియంట్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇకపోతే, ఇందులో యాంత్రిక పరంగా మరియు మెకానికల్ ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ కొత్త ఎక్స్‌టి వేరియంట్ ఇప్పుడు ఈ స్కూటర్ లైనప్‌లో టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ గా విక్రయించబడుతుంది.

NOTE: ఈ ఆర్టికల్ లో ఉపయోగించిన ఫోటోలు కేవలం అవగాహనా కోసం మాత్రమే..

Most Read Articles

English summary
Tvs motor plans to launch new electric two wheeler in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X