రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ప్రస్తుతం భారత మార్కెట్లో మోపెడ్ మొదలుకొని స్పోర్ట్స్ బైక్ వరకూ అన్ని విభాగాలలో ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. కానీ, ఈ బ్రాండ్ స్క్రాంబ్లర్ లేదా క్రూయిజ్ మోటార్‌సైకిల్ విభాగంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్పత్తి అందించ లేదు. తాజా సమాచారం ప్రకారం, టీవీఎస్ రేపు (జులై 6న) ఓ కొత్త మోటార్‌సైకిల్ ను విడుదల చేయబోతోంది. ఇది స్క్రాంబ్లర్ మరియు క్రూయిజర్ కలయికతో రూపొందించిన టీవీఎస్ రోనిన్ (TVS Ronin) కావచ్చని తెలుస్తోంది.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

టీవీఎస్ నుండి రాబోయే కొత్త మోటార్‌సైకిల్‌ విడుదలకు ముందే కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. కంపెనీ కూడా తమ అధికారిక వెబ్‌సైట్ లో ఓ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ టి ఆకారపు గుర్తు కనిపిస్తుంది మరియు దానిలోపల లాంగ్ రైడ్ లను సూచించే రోడ్ ఫొటో ఉంటుంది. దీన్నిబట్టి చూస్తుంటే, టీవీఎస్ నుండి రాబోయేది ఖచ్చితంగా ఓ క్రూయిజర్ లేదా స్క్రాంబ్లర్ స్టైల్ మోటార్‌సైకిల్ కావచ్చని తెలుస్తోంది.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

ఈ కొత్త మోటార్‌సైకిల్ యొక్క ఖచ్చితమైన ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ఇది ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని టీజర్ చిత్రాలు సూచిస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం, ఈ మోటార్‌సైకిల్‌లో 225సీసీ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 20 బిహెచ్‌పి శక్తిని అందించగలదు మరియు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

టీవీఎస్ రోనిన్ నియో-క్లాసిక్ బాడీ స్టైల్‌ను కలిగి ఉంటుందని గతంలో వెల్లడైని చిత్రాలు సూచించాయి. ఈ మోటార్‌సైకిల్ సాంప్రదాయిక లో-స్లంగ్ క్రూయిజర్ మరియు కఠినమైన స్క్రాంబ్లర్ మధ్య తయారైన క్రాస్‌ఓవర్ బైక్ మాదిరిగా ఉంటుంది. ఈ బైక్ బాడీవర్క్‌లో క్లియర్ క్నీ-ఇండెంట్, ఓల్డ్ స్కూల్ స్టైల్ సైడ్ ప్యానెల్‌లతో కూడిన ట్యాపర్డ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్, బ్లాక్ ఫినిష్డ్ ఇంజన్ మరియు అల్లాయ్ వీల్స్ ఈ మోటార్‌సైకిల్ కు మరింత అందాన్ని జోడిస్తాయి.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

టీవీఎస్ రోనిన్ ముందు భాగంలో గోల్డ్ ఫినిష్డ్ ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, అల్లాయ్ వీల్స్, మందపాటి టైర్లు మరియు పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఈ మోటార్‌సైకిల్‌లోని అత్యంత అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే, ఇందులో ఇన్‌స్టాల్ చేయబడిన T- ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు. ఇంకా ఇందులో సింగిల్ రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు కూడా ఉన్నాయి. సమాచారం ప్రకారం, ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో బ్రాండ్ యొక్క టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (TVS SmartXonnect) టెక్నాలజీని సపోర్ట్ చేయనుంది. ఇది బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా రైడర్ యొక్క స్మార్ట్ ఫోన్ ను బైక్ తో కెనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా, ఇందులో బ్రౌన్ కలర్ సీట్ చంకీ ఎగ్జాస్ట్ క్యానిస్టర్‌లు, ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు, డ్యూయెల్ ఏబిఎస్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఆశించవచ్చు.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

టీవీఎస్ నుండి రాబోయే ఈ కొత్త 225 సీసీ మోటార్‌సైకిల్ కంపెనీ గతంలో ఆవిష్కరించిన జెప్పెలిన్ (TVS Zeppelin) క్రూయిజర్ కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుందని సమాచారం. టీవీఎస్ తొలిసారిగా ఈ బైక్ ను కాన్సెప్ట్ రూపంలో 2018 ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించింది. అయితే, కాన్సెప్ట్ వెర్షన్ కి మరియు ప్రొడక్షన్ వెర్షన్ కి మధ్య చాలా ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు, కాన్సెప్ట్‌లో లిక్విడ్-కూల్డ్ ఇంజన్, స్పోక్ వీల్స్ మరియు ఫుల్ బ్లోన్ టెయిల్‌పీస్ ఉన్నాయి. ఇవి ప్రొడక్షన్ వెర్షన్ టీవీఎస్ రోనిన్ లో కనిపించవు.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

మార్కెట్ అంచనా ప్రకారం, టీవీఎస్ రోనిన్ మోటార్‌సైకిల్ ధర సుమారు రూ. 1.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పోటీ విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్ ప్రత్యర్థులు లేని పూర్తిగా కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోంది. కాబట్టి, ఇది దానికదే పోటీగా నిలుస్తుంది. ఈ బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ జులై 6, 2022వ తేదీన వెల్లడి చేయనుంది. అప్పటి వరకూ తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

జూన్ నెలలో 22 శాతం అమ్మకాల వృద్ధిని చూసిన టీవీఎస్ మోటార్ కంపెనీ

ఇదిలా ఉంటే, టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన జూన్ 2022 నెల అమ్మకాలలో మంచి ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. జూన్ 2021 నెలలో కంపెనీ విక్రయించిన 2,51,886 యూనిట్లతో పోలిస్తే జూన్ 2022 నెలలో కంపెనీ మొత్తం 3,08,501 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు 22 శాతం వృద్ధి చెందాయి.

రేపు కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్న టీవీఎస్.. రోనిన్ స్క్రాంబ్లర్ రాబోతోందా..?

గత నెలలో టీవీఎస్ మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు (స్కూటర్ మరియు మోటార్‌సైకిల్ అమ్మకాలు మరియు ఎగుమతులు కలిపి) 2,93,715 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి (జూన్ 2021లో) 2,38,092 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో టీవీఎస్ వార్షిక టూవీలర్ అమ్మకాలు 23 శాతం పెరిగాయి. ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు జూన్ 2021 నెలలో 1,45,413 యూనిట్ల నుండి జూన్ 2022 నాటికి 1,93,090 యూనిట్లకు పెరిగి 33 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Most Read Articles

English summary
Tvs motor to launch new motorcycle tomorrow will it be ronin scrambler
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X