వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) అందిస్తున్న స్కూటర్లలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) మంచి స్పోర్టీ అప్పీల్ ను కలిగి ఉండి, అన్ని తరాల వారికి అనుకూలంగా ఉండేలా ఉంటుంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ పాపులర్ స్కూటర్ పై సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులు ప్రయాణించడాన్ని సులభతరం చేయడానికి ఎన్‌టార్క్ 125 కోసం ఓ ప్రత్యేకమైన రెట్రో ఫిట్టింగ్ కిట్‌ను పరిచయం చేసింది.

వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగుల ప్రయాణాన్ని మరింత సురక్షితం మరియు సులభతరం చేసేందుకు ఈ ప్రత్యేకమైన కిట్ సహాయపడుతుంది. ఈ కిట్ ధర రూ. 11,249 లుగా ఉంటుంది. ఇందులో ఒక జత సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సపోర్ట్ వీల్స్ ఉంటాయి. ఇవి స్కూటర్ ని ఎల్లప్పుడూ బ్యాలెన్స్డ్‌గా ఉంచడంలో సహకరిస్తాయి. దీంతో వారి ప్రయాణం మరింత సులభతరం అవుతుందని కంపెనీ పేర్కొంది.

వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

ఈ కిట్ సులభంగా అసెంబుల్ చేయవచ్చు మరియు తొలగించవచ్చు. ఈ కిట్ ను అమర్చడం కోసం ఆరు మౌంటు పాయింట్లు ఉంటాయి. కఠినమైన రోడ్లపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి సపోర్ట్ వీల్స్ ఉచిత స్ప్రింగ్‌లను (సస్పెన్షన్) కూడా కలిగి ఉంటాయి. కాబట్టి, దీనిపై ఎగుడుదిగుడుగా ఉండే రోడ్లపై కూడా సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం, ఈ కిట్ ధరపై ప్రత్యేకంగా 10 శాతం తగ్గింపును పొందుపరిచినట్లు కంపెనీ తెలిపింది.

వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

బ్రాండ్ లైన్ నుండి పెప్ ప్లస్, సెట్ మరియు ఎక్స్ఎల్100 వంటి ఇతర స్కూటర్లు మరియు మోపెడ్‌లతో కూడా కిట్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) ధర శ్రేణి రూ. 75,455 (డ్రమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇందులో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ అయిన రేస్ ఎడిషన్ ఎక్స్‌పి (Race Edition XP) ఎడిషన్ ధర రూ. 87,550 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది.

వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

టీవీఎస్ ఎన్‌టార్క్ విజయం తరువాత, కంపెనీ వివిధ దశలలో అనేక విభిన్న వెర్షన్లు మరియు స్పెషల్ ఎడిషన్ మోడల్‌లను విడుదల చేసింది. టీవీఎస్ తొలిసారిగా 2018లో ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ డిజైన్, కనెక్ట్ చేయబడిన ఫీచర్లు మరియు అద్భుతమైన ఎగ్జాస్ట్ నోట్ కారణంగా మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 విక్రయాలు దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం మరియు ASEAN మార్కెట్‌లతో సహా 19 దేశాలకు విస్తరించాయి.

వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే, దాని శక్తివంతమైన ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్, రేస్-ట్యూన్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (RT-Fi) 124cc ఇంజన్‌. ఈ ఇంజన్ 7,000 rpm వద్ద గరిష్టంగా 9.1 bhp శక్తిని మరియు 5,500 rpm వద్ద 10.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, ఇందులోని రేస్ ఎక్స్‌పి ఎడిషన్ 124 cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ను కలిగి ఉండి, ఇది 7,000 rpm వద్ద 10.2 bhp శక్తిని మరియు 5,500 rpm వద్ద 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

ఈ స్కూటర్ లో రేస్ మరియు స్ట్రీట్ అనే రెండు రైడ్ మోడ్‌లు ఉంటాయి, వీటిని ఒకే స్విచ్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. రైడర్ ఎంచుకునే రైడ్ మోడ్ ను బట్టి, స్కూటర్ పనితీరు మారుతూ ఉంటుంది. ఈ స్కూటర్ లో అందించబడే ఫీచర్లే, దాని అమ్మకాల పెరుగుదల విషయంలో ముఖ్యపాత్ర పోషించాయి. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ బ్రాండ్ యొక్క స్మార్ట్ కనెక్ట్ (SmartXonnect) అనే కనెక్టెడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ కూడా ఉంటుంది.

వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

స్మార్ట్‌కనెక్ట్ సాయంతో రైడర్ తన స్మార్ట్‌ఫోన్ ను స్కూటర్ తో అనుసంధానం చేసుకొని, వివిధ రకాల ఫీచర్లను నియంత్రించవచ్చు. వీటిలో నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇన్-బిల్ట్ ల్యాప్-టైమర్, ఫోన్-బ్యాటరీ స్ట్రెంగ్త్ డిస్‌ప్లే, ఎండ్-పార్క్డ్ లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, స్ట్రీట్ మరియు స్పోర్ట్ వంటి మల్టీ-రైడ్ స్టాటిక్ మోడ్‌లు ఉన్నాయి.

వికలాంగుల కోసం టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125)లో స్పెషల్ రెట్రో ఫిట్‌మెంట్ కిట్

టీవీఎస్ ఎన్‌టార్క్ యొక్క ఇతర ఫీచర్లలో బాహ్య ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఇంజన్ కిల్ స్విచ్, ఎల్ఈడి లైటింగ్ మరియు 5.8-లీటర్ ఇంధన ట్యాంక్ ఉన్నాయి. ఈ స్కూటర్ లో ఎగ్జాస్ట్ నోట్ ఆకర్షణీయమైన ఫీచర్‌గా ఉంటుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, ఈ స్కూటర్ వివిధ రంగులు మరియు ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో మాట్ రెడ్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్ మరియు మెటాలిక్ బ్లూ ఉన్నాయి. రేస్ ఎడిషన్ రెడ్-బ్లాక్ మరియు ఎల్లో-బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 125 స్కూటర్లలో ఒకటి. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 హోండా యాక్టివా 125, యమహా రే - ZR125, అప్రిలియా 125 మరియు సుజుకి అవెనిస్ 125 లకు పోటీగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, February 28, 2022, 19:07 [IST]
English summary
Tvs ntorq 125 gets retro fitment kit for for specially abled read to find more deatils
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+