రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq 125 రేస్ ఎడిషన్: ధర & వివరాలు

ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) దేశీయ మార్కెట్లో ఇప్పుడు కొత్త కలర్ NTORQ 125 రేస్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ధర రూ. 87,011 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). భారతీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ ఈ కొత్త కలర్ NTORQ 125 కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభిందించింది.

Recommended Video

భార‌త్‌లో విడుదలైన TVS Ronin | ధర మరియు వివరాలు

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కలర్ NTORQ 125 లోని డిజైన్ మరియు ఇంజిన్ అప్డేట్స్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq: ధర & వివరాలు

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన కొత్త NTORQ 125 స్కూటర్ 'మెరైన్ బ్లూ' అనే కొత్త కలర్‌ ఆప్సన్ లో అందుబాటులో ఉంది. ఈ కొత్త కలర్ షేడ్ లో ఉన్న స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq: ధర & వివరాలు

కొత్త TVS NTORQ 125 రేస్ ఎడిషన్ ఇప్పడు కొత్త కలర్ లో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇది బ్లాక్, మెటాలిక్ బ్లాక్ మరియు మెటాలిక్ బ్లూ అనే మూడు కలర్స్ కలయికలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది రైడర్లను మరింత ఎక్కువగా ఆకర్శించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు పండుగ సీజన్ లో విడుదల కావడం వల్ల మరింత మంచి అమ్మకాలను పొండటానికి అవకాశం ఉంటుంది.

రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq: ధర & వివరాలు

కొత్త TVS NTORQ 125 రేస్ ఎడిషన్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులోని సిగ్నేచర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్ కలిగి చాలా అట్రాక్టివ్ లుక్ పొందుతుంది. అంతే కాకూండా.. సైడ్ ప్రొఫైల్ లో NTORQ బ్యాడ్జ్ మరియు రేస్ ఎడిషన్ బ్యాడ్జ్ పొందుతుంది. ఇది ప్రత్యేకంగా రేసింగ్ ఎడిషన్ అని చెప్పకనే చెబుతాయి.

రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq: ధర & వివరాలు

అంతే కాకూండా ఇందులో స్పోర్టీ స్టబ్ మఫ్లర్, టెక్స్‌చర్డ్ ఫ్లోర్‌బోర్డ్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కొత్త టీవీఎస్ NTORQ 125 రేస్ ఎడిషన్ మరింత స్టైల్ గా చూపించడంలో సహాయపడతాయి.

రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq: ధర & వివరాలు

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, TVS NTORQ 125 రేస్ ఎడిషన్ లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీనితోపాటి ఇప్పుడు TVS SmartXonnectTM తో వస్తుంది. కావున ఇది రైడర్ తన స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా అనేక ఫీచర్స్ యాక్సెస్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో పాస్ బై స్విచ్, డ్యూయల్ సైడ్ స్టీరింగ్ లాక్, పార్కింగ్ బ్రేక్ మరియు ఇంజన్ కిల్ స్విచ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.

రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq: ధర & వివరాలు

TVS NTORQ 125 రేస్ ఎడిషన్ స్కూటర్ లో ఫ్యూయెల్ క్యాప్ అనేది బయటవైపు ఉంటుంది. కావున ఫ్యూయెల్ ఫిల్ చేసుకోవాల్సిన ప్రతిసారి మునుపటి మోడల్స్ లో మాదిరిగా సీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనితోపాటు ఇందులో మొబైల్ ఫోన్ కోసం USB ఛార్జర్ స్లాట్ కూడా ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ సుమారు 20 లీటర్ల వరకు ఉంటుంది. కావున హెల్మెట్ వంటి వాటిని కూడా ఇందులో సులభంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq: ధర & వివరాలు

కొత్త కలర్ TVS NTORQ 125 రేస్ ఎడిషన్ స్కూటర్ 124.8 సిసి, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 3-వాల్వ్, ఎయిర్-కూల్డ్ SOHC, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.38 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 9 సెకన్లలో గంటకు 0 ఉంచి 60 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

రంగుల ప్రపంచంలోకి కొత్త హంగులతో విడుదలైన TVS Ntorq: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న టీవీఎస్ NTORQ 125 ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్ తో విడుదలకావడం అనేది NTORQ వినియోగదారుకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు విడుదలైన ఈ కొత్త కలర్ స్కూటర్ మార్కెట్లో పండుగ సీజన్ లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది.

Most Read Articles

English summary
Tvs ntorq 125 race edition launched in new colour details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X