TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్పోర్టీయర్ స్కూటర్లను పరిశీలిస్తే, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) మరియు ఏథర్ 450 (Ather 450) స్కూటర్లు రెండూ కూడా షార్ప్ అండ్ స్టైలిష్ డిజైన్ కలిగి ఉండి, ప్రధానంగా యువతను లక్ష్యం చేసుకొని ప్రవేశపెట్టబడిన మోడళ్ల మాదిరిగా ఉంటాయి. అయితే, ఇందులో ఎన్‌టార్క్ 125 పెట్రోల్‌తో నడిచే మోడల్ కాగా, ఏథర్ 450 ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేసే మోడల్. ఇవి ఈ ఒక్క విషయంలో ఇవి రెండూ చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, ఇతర అనేక విషయాల్లో వీటి మధ్య చాలా పోలికలు ఉన్నాయి.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఖరీదైన శిలాజ ఇంధనాలపై ఆధారపడుతుండగా, ఏథర్ 450 మోడళ్లు మరింత అధునాతనమైన మరియు ఫ్యూచర్-ప్రూఫ్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటాయి. ప్రస్తుతం, పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే, ఎలక్ట్రిక్ వాహనాలు కాస్తంత ఖరీదైనవిగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఎలక్ట్రిక్ టూవీలర్లు అందించే ప్రయోజనాలే మెరుగ్గా ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఏథర్ ఎనర్జీ భారతదేశంలో స్థిరంగా అభివృద్ధి చెందుతోంది మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో, దేశంలో కెల్లా అత్యుత్తమ నాణ్యత మరియు ఫిట్-అండ్-ఫినిష్‌తో అందుబాటులో ఉన్న అగ్ర కంపెనీల జాబితాలో ఒకటిగా ఉంది.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

టీవీఎస్ మోటార్ కంపెనీకి దేశవ్యాప్తంగా సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ఉంది. చిన్న పట్టణాల నుండి మెట్రో నగరాలకు వరకు ఇది విస్తృతమైన నెట్‌వర్క్ ను కలిగి ఉంది. అయితే, ఏథర్ ఎనర్జీ మాత్రం ఇప్పుడిప్పుడే తన నెట్‌వర్క్ పరిధిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏథర్ ఎనర్జీ భారతదేశంలోని టైర్ 1 నగరాలతో పాటు, ముంబై, పూణే, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, తిరుచ్చి, విశాఖపట్నం, జైపూర్, కోజికోడ్, ఇండోర్ మరియు నాసిక్‌ వంటి పలు నగరాలలో తమ ఉత్పత్తులను మరియు సేవలను అందిస్తోంది.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: డిజైన్

డిజైన్ పరంగా చూస్తే, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ క్లీన్ అండ్ షార్ప్ బాడీ లైన్స్ తో అధునాతనంగా మరియు ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తుంది. ఏథర్ 450 యొక్క పదునైన మరియు పొడవైన ఫ్రంట్ ఫాసియా ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లతో చక్కగా అనుసంధానించబడి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఎగ్జాస్ట్ లేకపోవడం మరియు సీటు కింద ఎక్స్‌పోజ్డ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉండటం వల్ల ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రీమియం మరియు అధునాతన రూపాన్ని భారతదేశంలోని ఏ ఇతర సాంప్రదాయక స్కూటర్‌తో పోల్చలేము. ఈ స్కూటర్ వెనుక డిజైన్ కూడా చాలా సింపుల్ గా మరియు అంతే స్టైలిష్ గా ఉంటుంది.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

ఇక టీవీఎస్ ఎన్‌టార్క్ 125 విషయానికి వస్తే, ఇది స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్స్ ను కలిగి ఉన్నప్పటికీ, చాలా వరకూ ఇది ట్రెడిషనల్ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. అయితే, కొన్ని ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో ఈ స్కూటర్ ను సెగ్మెంట్లోని ఇతర స్కూటర్ల కన్నా భిన్నంగా కనిపించేలా చేయడంలో కంపెనీ తగు చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. టీవీఎస్ ఇటీవలే ఇందులో స్పైడర్‌మ్యాన్ మరియు థోర్ థీమ్‌తో అవెంజర్ సూపర్ హీరోస్ వేరియంట్లను కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

మార్వెల్ సూపర్ హీరో-థీమ్‌తో ఉన్న ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లు వాటి సంబంధిత మార్వెల్ సూపర్‌హీరోల నుండి స్పూర్తి పొందిన కలర్ స్కీమ్స్ తో డిజైన్ చేబయబడి ఉంటాయి కాబట్టి ఇవి ప్రేక్షకుల నుండి ప్రత్యేకంగా నిలుస్తాయి. సాలిడ్ కలర్ స్కీమ్‌లు కాకుండా, సంబంధిత సూపర్‌హీరోలను సూచించే రెండు స్కూటర్‌లపై మార్వెల్ సూపర్‌హీరో-థీమ్ డెకాల్స్ కూడా ఉన్నాయి. గతంలో, టీవీఎస్ తన ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో మార్వెల్ సూపర్‌హీరోల ఆధారంగా మరో మూడు ప్రత్యేక ఎడిషన్లు కూడా విడుదల చేసింది.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పవర్‌ట్రైన్

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారతదేశంలో రెండు మోడళ్లను విక్రయిస్తోంది. అందులో మొదటి, బేస్ మోడల్ ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) ఇందులో 22Nm టార్క్‌ను జనరేట్ చేసే 5.4kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇకపోతే, రెండవది శక్తివంతమైన టాప్-ఎండ్ వేరియంట్ ఏథర్ 450ఎక్స్ ( Ather 450X). ఈ వేరియంట్ లో 26Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 6kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ రెండు మోడళ్లలో ఎలక్ట్రిక్ మోటార్లే కాకుండా, బ్యాటరీ ప్యాక్ లు కూడా వేర్వేరుగా ఉంటాయి.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

బేస్ మోడల్ అయిన ఏథర్ 450 ప్లస్ లో 2.4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 70 కి.మీలకు పైగా రేంజ్ ను అందిస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 10 కి.మీకు సరిపడా చార్జ్ చేసుకోవచ్చు. మరోవైపు, ఏథర్ 450ఎక్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్ పై 80 కి.మీలకు పైగా రేంజ్ ను అందిస్తుంది. ఇది కూడా ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది, ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లో 15 కిమీలకు సరిపడా చార్జ్ చేసుకోవచ్చు.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

ఇక టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq 125) స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 3-వాల్వ్, 125cc పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 7,000 rpm వద్ద 9.2bhp పవర్ ను మరియు 5,500rpm వద్ద 10.5Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇందులో మరింత శక్తివంతమైన వేరియంట్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో ఎన్‌టార్క్ 125 రేస్ ఎక్స్‌పి (TVS Ntorq 125 Race XP) అనే ఎడిషన్ ను అందిస్తోంది. ఇది రీట్యూన్ చేయబడిన 125cc ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 7,000 rpm వద్ద 10.05bhp పవర్ ను మరియు 5,500 rpm వద్ద 10.8Nm టార్క్ ను విడుదల చేస్తుంది.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: ఫీచర్లు

ఎన్‌టార్క్ 125 స్కూటర్ లో బ్లూటూత్ కనెక్టివిటీ, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, ఎన్‌టార్క్ ఫీచర్లను ఏథర్‌ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో లబించే ఫీచర్లతో పోల్చితే ఇది చాలా వెనుకబడి ఉంటుంది. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఆండ్రియోడ్-ఆధారిత ఓఎస్, 22-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 12 ఇంచ్ వీల్స్, గూగుల్ మ్యాప్స్, రివర్స్ మోడ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ వాటర్-రెసిస్టెంట్ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్. ఈ సిస్టమ్ సాయంతోనే స్కూటర్ లోని అనేక ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లు మరియు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు కూడా ఉన్నాయి. ఈ రెండు స్కూటర్‌ల కోసం ఆయా కంపెనీలు ప్రత్యేకమైన మొబైల్ ఫోన్ అప్లికేషన్ ను కూడా అందిస్తున్నాయి.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: సస్పెన్షన్ మరియు బ్రేక్‌లు

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక వైపున కాయిల్ స్ప్రింగ్ యూనిట్‌ ఉంటుంది. ఇందులో ఇరు వైపులా 100/80 టైర్‌లతో కూడిన 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. అయితే, ఇందులోని రేస్ ఎక్స్‌పి వేరియంట్ మాత్రం వెనుకవైపు వెడల్పాటి 110 సెక్షన్ టైర్‌ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపున 220mm డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 130mm డ్రమ్ బ్రేక్ ఉంటాయి.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

ఇక ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక వైపున సిమెట్రిక్‌గా మౌంటెడ్ మోనో షాక్ సస్పెన్షన్‌ సెటప్ ఉంటుంది. ఇది కూడా ఎన్‌టార్క్ మాదిరిగానే ఇరువైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో ఇరువైపులా సన్నటి 90 సెక్షన్ టైర్‌లు ఉంటాయి. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ముందు మరియు వెనుక చక్రాలపై వరుసగా 200mm మరియు 190mm డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి.

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీ పెడితే..?

TVS Ntorq 125 వర్సెస్ Ather 450: ధర

మార్కెట్లో Ather 450 Plus ధర రూ. 1,27,916 (FAME II సబ్సిడీతో సహా) కాగా, Ather 450X ధర రూ. 1,46,926 (FAME II సబ్సిడీతో కలిపి) గా ఉంది. అదే TVS Ntorq 125 విషయానికి వస్తే ఇందులో స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 80,957 మరియు రేస్ ఎక్స్‌పి వేరియంట్ ధర రూ. 90,812 గా ఉన్నాయి. పైన పేర్కొన్న ధరలు అన్నీ ఎక్స్-షోరూమ్.

Most Read Articles

English summary
Tvs ntorq 125 vs ather 450 lets find out which is better for you
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X