టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో కొత్త (TVS Ntorq XT) వేరియంట్ వస్తోంది.. టీజర్ విడుదల!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారత విపణిలో విక్రయిస్తున్న స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq) లో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటర్ యొక్క రాబోయే కొత్త వేరియంట్ కోసం కంపెనీ టీజర్ ను కూడా విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన కొత్త టీజర్ చిత్రాన్ని విశ్లేషిస్తే, టీవీఎస్ ఎన్‌టార్క్ యొక్క కొత్త వేరియంట్‌కు 'Ntorq XT' అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో కొత్త (TVS Ntorq XT) వేరియంట్ వస్తోంది.. టీజర్ విడుదల!

ప్రస్తుతం, దేశీయ విపణిలో టీవీఎస్ ఎన్‌టార్క్స్కూటర్ నాలుగు విభిన్న వేరియంట్‌ లలో అందుబాటులో ఉంది. అవి: స్టాండర్డ్ (TVS Ntorq Standard) మోడల్, రేస్ ఎడిషన్ (TVS Ntorq Race Edition), సూపర్ స్క్వాడ్ ఎడిషన్ (TVS Ntorq Super Squad Edition) మరియు రేస్ ఎక్స్‌పి (TVS Ntorq Race XP) వేరియంట్లు. ఇప్పుడు ఇందులో కొత్తగా రాబోయే ఎక్స్‌టి (TVS Ntorq XT) వేరియంట్ తో దీని మొత్తం వేరియంట్ల సంఖ్య ఐదుకు చేరుకోనుంది. ఇది ఈ విభాగంలో హోండా యాక్టివా 125, యమహా రే - ZR125, అప్రిలియా 125 మరియు సుజుకి అవెనిస్ 125 లకు పోటీగా నిలుస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో కొత్త (TVS Ntorq XT) వేరియంట్ వస్తోంది.. టీజర్ విడుదల!

టీవీఎస్ ఎన్‌టార్క్ లో రాబోయే కొత్త వేరియంట్ విషయానికి వస్తే, 'XT' వేరియంట్‌ లో అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కనెక్టెడ్ ఫీచర్‌లు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా, ఈ మోడల్ దాని స్వంత ప్రత్యేకమైన స్టైలింగ్ కోసం సరికొత్త కలర్ ఆప్షన్స్ మరియు బాడీ గ్రాఫిక్స్ ను కలిగి ఉండే ఇవకాశం ఉంది. ప్రస్తుతం, మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ సిరీస్ ధరలు రూ. 77,000 నుండి ప్రారంభమవుతాయి. కాగా, ఇందులో డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 81,500 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉంటాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో కొత్త (TVS Ntorq XT) వేరియంట్ వస్తోంది.. టీజర్ విడుదల!

అయితే, రాబోయే టీవీఎస్ ఎన్‌టార్క్ యొక్క కొత్త వేరియంట్ టెక్-ప్యాక్డ్ థీమ్‌ను కలిగి ఉంటుంది కాబట్టి, దాని ధర ప్రస్తుత టాప్-ఎండ్ మోడల్ రేస్ ఎక్స్‌పి వేరియంట్ ధర కంటే అధికంగా ఉంటుందని సమాచారం. ఇటీవలి కాలంలో, ద్విచక్ర వాహనాలలో కూడా కనెక్టింగ్ ఫీచర్లు సర్వసాధారణంగా మారిపోయాయి. బ్లూటూత్ టెక్నాలజీ సాయంతో రైడర్లు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ అయి, కాల్స్, మెసేజెస్ మ్యూజిక్ మరియు మ్యాప్స్ వంటి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో కొత్త (TVS Ntorq XT) వేరియంట్ వస్తోంది.. టీజర్ విడుదల!

టీవీఎస్ మోటార్ కంపెనీ గత సంవత్సరం, తమ పాపులర్ స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్‌లో స్పైడర్‌మ్యాన్ మరియు థోర్ థీమ్ లతో కూడిన వేరియంట్‌లను విడుల చేసింది. మార్వెల్ సూపర్ హీరో థీమ్ లతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్లు, సదరు థీమ్ కు తగినట్లుగా పెయింట్ స్కీమ్స్ మరియు బాడీ గ్రాఫిక్స్ ను కలిగి ఉండేవి. మార్వెల్ సూపర్‌ హీరో థీమ్ తో వచ్చిన ఈ 125 సిసి స్కూటర్ లో మార్పులు కేవలం ఎక్స్టీరియర్ గ్రాఫిక్స్ మరియు కలర్ స్కీమ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, సదరు థీమ్ సిల్హౌట్ మరియు లోగో వంటి కొన్ని అంశాలను ప్రదర్శించడానికి టీవీఎస్ యూఐని కూడా కస్టమైజ్ చేసింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో కొత్త (TVS Ntorq XT) వేరియంట్ వస్తోంది.. టీజర్ విడుదల!

టీవీఎస్ అందిస్తున్న SmartXonnect యాప్ యొక్క UIకి కూడా ఇది విస్తరించబడింది. టీవీఎస్ ఎన్‌టార్క్ ఈ సెగ్మెంట్లో ఓ బెస్ట్ పెర్ఫార్మెన్స్ 125 సిసి స్కూటర్. ఇందులో 3-వాల్వ్, 125cc ఇంజన్‌ ఉంటుంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.2 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని రేస్ ఎక్స్‌పి వేరియంట్ (TVS Ntorq 125 Race XP) కొంచెం ఎక్కువ పవర్, టార్క్ లను కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.05 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో కొత్త (TVS Ntorq XT) వేరియంట్ వస్తోంది.. టీజర్ విడుదల!

టీవీఎస్ ఎన్‌టార్క్ కూడా నేటి ఆధునిక స్కూటర్ల మాదిరిగానే బ్లూటూత్ కనెక్టివిటీ, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌ వంటి మరెన్నో ఫీచర్లతో కూడిన అత్యంత ఫీచర్ రిచ్ ట్రెడిషనల్ పవర్డ్ స్కూటర్‌ లలో ఒకటిగా ఉంటుంది. ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ సెటప్ మరియు వెనుక వైపు కాయిల్ స్ప్రింగ్ యూనిట్ ఉంటాయి. ఈ స్పోర్టీ స్కూటర్‌ను అండర్‌బోన్ ట్యూబ్యులర్ టైప్ ఫ్రేమ్ పై తయారు చేశారు. ఈ స్కూటర్ ముందు మరియు వెనుక వైపున 100/80 టైర్‌లతో కూడిన 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ లు ఉంటాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో కొత్త (TVS Ntorq XT) వేరియంట్ వస్తోంది.. టీజర్ విడుదల!

టీవీఎస్ ఎన్‌టార్క్ యొక్క ఇతర ఫీచర్లలో బాహ్య ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఇంజన్ కిల్ స్విచ్, ఎల్ఈడి లైటింగ్ మరియు 5.8-లీటర్ ఇంధన ట్యాంక్ ఉన్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ తొలిసారిగా 2018లో ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ డిజైన్, కనెక్ట్ చేయబడిన ఫీచర్లు మరియు అద్భుతమైన ఎగ్జాస్ట్ నోట్ కారణంగా మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 విక్రయాలు దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం మరియు ASEAN మార్కెట్‌లతో సహా 19 దేశాలకు విస్తరించాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 29, 2022, 10:58 [IST]
English summary
Tvs ntorq xt variant teased launch expected soon likely to sport additional features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+