పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

ప్రముఖ భారతదేశపు టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ (TVS), మోటార్‌స్పోర్ట్ రంగంలో కూడా కీలకంగా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, ఈ బ్రాండ్ ఇప్పుడు తమ మోటార్‌స్పోర్ట్ ఉనికిని మరింత విస్తరించుకునేందుకు గాను ప్రముఖ లూబ్రికెంట్స్ బ్రాండ్ అయిన పెట్రోనాస్ (PETRONAS)తో చేతులు కలిపింది. ఈ రెండు బ్రాండ్లు కలిసి ఇప్పుడు పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team)గా ఏర్పడ్డాయి. ఈ కొత్త రేసింగ్ బృందం దేశీయ 2-వీలర్ రేసింగ్ యొక్క అన్ని ఫార్మాట్లలో పాల్గొంటుందని కంపెనీ పేర్కొంది.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

అంతేకాకుండా, టీవీఎస్ మోటార్ కంపెనీ మరియు పెట్రోనాస్ లూబ్రికెంట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ రెండూ కలిసి భారతదేశం అంతటా పెట్రోనాస్ టీవీఎస్ ట్రూఫర్ రేస్ ప్రో (PETRONAS TVS TRU4 RacePro) అనే కొత్త కో-బ్రాండెడ్ ఆయిల్‍‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ డీల్‌తో భారతదేశపు మొట్టమొదటి ఫ్యాక్టరీ రేసింగ్ జట్టు అయిన టీవీఎస్ రేసింగ్ (TVS Racing) యొక్క టైటిల్ స్పాన్సర్‌గా పెట్రోనాస్ వ్యవహరించనుంది. ఈ రెండు బ్రాండ్ల కలయికతో ఇప్పుడు పాత టీవీఎస్ రేసింగ్ జట్టును కొత్త పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ జట్టుగా రీబ్రాండ్ చేయబడింది.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

కొత్తగా ఏర్పడిన పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ ఈ సీజన్‌లో జరగబోయే మోటార్‌స్పోర్ట్ ఈవెంట్ల కోసం కొత్త లైవరీతో కూడిన అవుట్‌ఫిట్ నూ త్వరలోనే వెల్లడించనుంది. అంతేకాకుండా, రోడ్-రేసింగ్, సూపర్‌క్రాస్ మరియు ర్యాలీ ఫార్మాట్‌లలో నిర్వహించబోయే ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (INMRC), ఇండియన్ నేషనల్ సూపర్‌క్రాస్ ఛాంపియన్‌షిప్ (INSC), ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ (INRC) లలో పాల్గొనే జట్టుకు పెట్రోనాస్ తన అధిక-పనితీరు గల (హై-పెర్ఫార్మెన్స్) ఇంజన్ ఆయిల్, పెట్రోనాస్ స్ప్రింటా (PETRONAS Sprinta) ను కూడా సరఫరా చేయడానికి కూడా సిద్ధంగా ఉంది.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

భారతదేశంలో మోటార్‌స్పోర్ట్‌లను నిర్మించడంలో టీవీఎస్ రేసింగ్, 1982 నుండి అగ్రగామిగా ఉంది మరియు ఇది దేశంలో రేసింగ్ పెర్ఫార్మెన్స్ కల్చర్‌ను విస్తరించడంలో సమగ్రంగా ఉంది. యువ ఔత్సాహికులు ఆహ్లాదకరమైన మరియు సురక్షితమైన వాతావరణంలో రేస్ పెర్ఫార్మెన్స్ ను అన్వేషించడానికి బహుళ రైడింగ్ ప్లాట్‌ఫారమ్‌ లను అందించడం ద్వారా టీవీఎస్ రేసింగ్ దేశంలో ఈ సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుంది. కాగా, కొత్తగా ఏర్పడిన ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో రేసింగ్‌ కు ఆదరణను మరింతగా పెంచేందుకు ఊతాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

ఈ రెండు బ్రాండ్లు కేవలం మోటార్‌స్పోర్ట్ విభాగంలోనే కాకుండా, వినియోగదారులకు అధిక పనితీరును అందించే ఇంజన్ ఆయిల్‌ను అందించేందుకు కూడా ముందుకు వచ్చాయి. ఈ రెండు బ్రాండ్ల నుండి వస్తున్న కో-బ్రాండెడ్ ఆయిల్ పెట్రోనాస్ టీవీఎస్ ట్రూఫర్ రేస్‌ప్రోను అభివృద్ధి చేయడానికి పెట్రోనాస్ లూబ్రికెంట్స్ ఇంటర్నేషనల్ (PLI) తో టీవీఎస్ కుదుర్చుకున్న ఈ వ్యూహాత్మక వ్యాపార కూటమి ద్వారా ఇరు కంపెనీల మధ్య అనుబంధం మరింత బలంగా మారనుంది. ఈ కొత్త రకం హై-పెర్ఫార్మెన్స్ ఇంజన్ ఆయిల్ మే 2022 నుండి భారతదేశం అంతటా వినియోగదారులకు అందుబాటులో రానుంది.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

పెట్రోనాస్‌తో తమ భాగస్వామ్యం గురించి టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్ మరియు సీఈఓ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. టీవీఎస్ రేసింగ్ కోసం పెట్రోనాస్ తమ భాగస్వామిగా ఉన్నందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని, ఈ బ్రాండ్‌కు ప్రముఖ రేసింగ్ ఈవెంట్‌లలో గణనీయమైన విజయాల మద్దతు ఉందని, అంతేకాకుండా పెట్రోనాస్ అనేక ప్రగతిశీల సాంకేతిక పరిష్కారాలను అందిస్తోందని అన్నారు. టీవీఎస్ రేసింగ్ యొక్క నాలుగు దశాబ్దాల బలమైన రేసింగ్ వారసత్వంతో పాటు మోటార్‌స్పోర్ట్స్‌లో పెట్రోనాస్ యొక్క ప్రపంచ నైపుణ్యం మరియు పటిష్టమైన ఉనికి తమను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

అలాగే, ఈ ఒప్పందం గురించి డౌన్‌స్ట్రీమ్ పెట్రోనాస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ డౌన్‌స్ట్రీమ్

దతుక్ సజాలి హమ్జా మాట్లాడుతూ.. పెట్రోనాస్ భారతదేశ వ్యాప్తంగా తన పురోగతిని కొనసాగిస్తోందని. తమ ముఖ్యమైన పోర్ట్‌ఫోలియో యొక్క ఉదాహరణలలో, ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్ (IPPL) ద్వారా LPGని సరఫరా చేయడం మొదలుకొని యామ్‌ప్లస్ ఎనర్జీ (AmPlus Energy) ద్వారా రూఫ్‌టాప్ సౌర ఫలకాలను (సోలార్ ప్యానెళ్లను) అందించడం వరకూ వివిధ విభాగాల్లో తాము వ్యాపారం చేస్తున్నామని చెప్పారు.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

తాజాగా ఇప్పుడు పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ లాంచ్‌తో భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫాక్చరర్) అయిన టీవీఎస్ మోటార్ కంపెనీలో ఒకదానితో తాము బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని, పెట్రోనాస్ లూబ్రికెంట్‌లు గ్లోబల్ మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌లలో ఘనమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉందని, ఇప్పుడు టీవీఎస్ రేసింగ్ ఆశయాలకు మద్దతు ఇస్తున్నందుకు తాము ఎంతో గర్విస్తున్నామని ఆయన అన్నారు.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

టీవీఎస్ బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మోటార్‌సైకిల్ 'టీవీఎస్ అపాచే 165 ఆర్‌పి' (TVS Apache 165 RP) లిమిటెడ్ ఎడిషన్ అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ ను గడచిన డిసెంబర్ నెలాఖరులో దేశీయ విపణిలో విడుదల చేసింది. మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. స్టాండర్డ్ Apache RTR 160 4V మోడల్ ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్ Apache RTR 165 RP ని తయారు చేశారు.

పెట్రోనాస్‌తో దోస్తీ కట్టిన టీవీఎస్.. పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ టీమ్ (PETRONAS TVS Racing Team) ఏర్పాటు

టీవీఎస్ అపాచే 165 ఆర్‌పిలో RP అంటే 'రేస్ పెర్ఫార్మెన్స్' అని అర్థరం. ఈ RP సిరీస్ కింద అభివృద్ధి చేయబడిన కొత్త అపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి మోడల్ ఉత్పత్తిని కంపెనీ కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ బైక్ మార్కెట్లో విడుదలైన మొదటి రెండు వారాల్లోనే పూర్తిగా 200 యూనిట్లు అమ్ముడైపోయినట్లు కంపెనీ తెలిపింది. ఈ మొత్తం 200 యూనిట్లు డెలివరీలు కాకమునుపే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో కంపెనీ ఈ రేస్ పెర్ఫార్మెన్స్ (RP) సిరీస్ లో మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tvs racing join hands with petronas to form a new racing team details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X