భారత్‌లో '2022 టీవీఎస్ రేడియన్' లాంచ్: ధర ఇప్పుడు రూ. 59,925 మాత్రమే
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) భారతీయ మార్కెట్లో తన కొత్త '2022 టీవీఎస్ రేడియన్' (2022 TVS Radeon) విడుదల చేసింది. ఈ కొత్త అప్డేటెడ్ రేడియన్ ప్రారంభ ధర రూ. 59,925 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, టాప్ వేరియంట్ (డిజి డ్రమ్ డ్యూయల్ టోన్ వేరియంట్) ధర రూ. 71,966 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త బైక్ ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. కావున ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అందుబాటులో ఉన్న మొదటి 110 సిసి బైక్‌గా నిలిచింది.

దేశీయ విఫణిలో మొదటసారిగా 2018 లో టీవీఎస్ కంపెనీ తన రేడియన్ ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్ గా విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఇది ఆధునిక అప్డేట్స్ పొందుతూ వచ్చింది. ఇది 2019 మరియు 2020 మధ్యలో బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. టీవీఎస్ రేడియన్ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో రావడం వల్ల ఇది భవిష్యత్ లో కూడా మరిన్ని మంచి అమ్మకాలను పొందుతుంది.

కొత్త టీవీఎస్ రేడియన్ ఇప్పుడు ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా.. ఇందులో ఇంటెల్లిగో సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది, కావున మరింత ఎక్కువ మైలేజ్ అందించడానికి సహాయపడుతుంది.

ఇప్పుడు ఈ బైక్ లో అందుబాటులో ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రియల్ టైమ్ మైలేజీతో పాటు, క్లాక్, సర్వీస్ రిమైండర్, లో బ్యాటరీ ఇండికేటర్, టాప్ స్పీడ్ మరియు యావరేజ్ స్పీడ్‌తో సహా 17 ఇన్-బిల్ట్ ఫీచర్లను అందిస్తుంది. వీటితోపాటు మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి యుఎస్బి ఛార్జింగ్ స్లాట్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

టీవీఎస్ రేడియన్ ఇప్పుడు పొడవైన సీటును పొందుతుంది. కావున లాంగ్ రైడింగ్ కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ క్రోమ్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు కొత్త థాయ్ ప్యాడ్స్ వంటి వాటిని కూడా పొందుతుంది.

కొత్త టీవీఎస్ రేడియన్ సింగిల్ మరియు డ్యూయెల్ టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. సింగిల్ టోన్ కలర్స్ విషయానికి వస్తే, ఇందులో స్టార్‌లైట్ బ్లూ, మెటల్ బ్లాక్, రాయల్ పర్పుల్ మరియు టైటానియం గ్రే వంటివి ఉన్నాయి. ఇక డ్యూయెల్ టోన్ కలర్స్ విషయానికి వస్తే, ఇందులో బ్లాక్ / రెడ్ మరియు బ్లూ / బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

2022 టీవీఎస్ రేడియన్ ఇప్పుడు మరింత మెరుగైన రైడింగ్ అనుభూతిని అందించడానికి ఇంటెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది. ఈ టెక్నాలజీ వల్ల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద లేదా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో బైక్ ఇంజిన్ ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అవుతుంది. తద్వారా ఇంధనం కొంత పొదుపు అవుతుంది. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి రైడర్ కేవలం క్లచ్‌ను నొక్కి, త్రాటల్ తిప్పితే సరిపోతుంది.

టీవీఎస్ రేడియన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 109.7 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.28 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. అదే సమయంలో ఇది ఒక లీటరుకు 73 కిమీ మైలేజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా సర్టిఫైడ్ చేయబడింది. కావున ఈ బైక్ ఒక ఫుల్ ట్యాంక్ తో ఏకంగా 600 కిమీ మైలేజ్ అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ యొక్క రేడియన్ మంచి అమ్మకాలు పొందుతున్న కంపెనీ యొక్క బైక్. ఇది ఇప్పుడు ఆధునిక ఫీచర్స్ తో విడుదలకావడం వల్ల మరిన్ని మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ బైక్ దేశీయ విఫణిలో హీరో ప్యాసినో ఎక్స్‌టెక్ (Hero Passion XTEC), బజాజ్ ప్లాటినా హెచ్-గేర్ మరియు హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 (Hero Splendor iSmart 110) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








