షాకింగ్ న్యూస్.. TVS రైడర్ 125 ధరలు పెరిగాయ్: ఎంత పెరిగాయంటే?
భారతీయ మారేట్లో ఇప్పటికే చాలా వాహన తయారీ సంస్థలు తన వాహనాల యొక్క ధరలను పెంచింది. పెరిగిన వాహన వాహనాధారలకు సంబంధించిన చాలా సమాచారం మనం మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు టీవీఎస్ (TVS) కంపెనీ తన రైడర్ 125 (TVS Raider) ధరలను కూడా పెంచినట్లు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

టీవీఎస్ కంపెనీ తన తన 125 సిసి బైక్ టీవీఎస్ రైడర్ 125 బైక్ ను 2021 లో విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ బైక్ ప్రారంభ ధర రూ. 77,500 (ఎక్స్-షోరూమ్). ఇది డిస్క్ బ్రేక్ మరియు డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ 'రైడర్ 125 డిస్క్ బ్రేక్' వేరియంట్ ధరను రూ. 1900 పెంచింది. ధరల పెరుగుదల తరువాత టీవీఎస్ రైడర్ 125 డిస్క్ బ్రేక్ ధర రూ. 90,989 (ఎక్స్-షోరూమ్).

కంపెనీ యొక్క టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు. కావున ఈ బైక్ ధర రూ. 84,573 (ఎక్స్-షోరూమ్). టీవీఎస్ రైడర్ 125 సిసి బైకులలో ధరల పెరుగుదల కాకుండా ఇతర మార్పులు ఏమీ జరగలేదు. కావున డిజైన్ మరియు ఫీచర్స్ వంటివి అలాగే ఉన్నాయి.

టీవీఎస్ రైడర్ 125 బైక్ అదే అద్భుతమైన డిజైన్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో డిస్‌క్టివ్ హెడ్‌ల్యాంప్ సెటప్, అందులో ఎల్ఈడీ లైటింగ్ మరియు స్ప్లిట్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లు ఉన్నాయి. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్ ఉంటుంది. ఈ బైక్ లో 10 లీటర్ కెపాసిటీ కలిగిన డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

అంతే కాకుండా ఈ బైక్ లో సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్, క్రాష్ ప్రొటెక్టర్లు, ఇంజిన్ సంప్ గార్డ్, స్ప్లిట్-సీట్లు, అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శ్యారీ గార్డ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు హాలోజన్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ బైక్ ని చాల ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే.. దీని పొడవు 2070 మిమీ, వెడల్పు 785 మిమీ మరియు ఎత్తు 1028 మిమీ వరకు ఉంటుంది. ఇక వీల్‌బేస్ 1326 మిమీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంది. ఈ బైక్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి ఫైరీ ఎల్లో, స్ట్రైకింగ్ రెడ్, బ్లేజింగ్ బ్లూ మరియు వికెడ్ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఈ బైక్ లో ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5 ఇంచెస్ TFT స్క్రీన్ ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క SmartXConnect కనెక్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. అయితే ఇందులోని 'లో వేరియంట్' నెగిటీవ్ LCD యూనిట్‌తో అందించబడుతుంది. ఇందులో వాహన వినియోగదారుడు మల్టిపుల్ ట్రిప్ మీటర్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంజిన్ సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఇండికేటర్, టైమ్, టాకోమీటర్, యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ మరియు ఫ్యూయెల్ రేంజ్ వంటి ఫీచర్స్ కూడా పొందవచ్చు.

ఈ బైక్ లోని TFT డిస్‌ప్లే మరింత సమాచారాన్ని అందించడానికి TVS నుండి అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్, కాల్ మేనేజ్మెంట్, మెసేజ్ నోటిఫికేషన్ అలెర్ట్, హై-స్పీడ్ అలెర్ట్, లో ఫ్యూయెల్ అసిస్టెన్స్ మరియు డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి వాటిని పొందవచ్చు. TFT డిస్‌ప్లే సౌలభ్యం కోసం డే అండ్ నైట్ మోడ్‌లతో పాటు ఆటో-బ్రైట్‌నెస్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంది.అంతే కాకుండా TVS రైడర్లు వారి విలువైన వస్తువులను భద్రపరచడానికి పిలియన్ సీటు కింద మంచి మొత్తంలో స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇది రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

టీవీఎస్ రైడర్ 125 బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 124.8 సీసీ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 99 కిమీ.

ఇంజిన్ ఒక టచ్ స్టార్ట్ ఎనేబుల్ చేయడానికి స్టార్టర్ జెనరేటర్ మరియు మెరుగైన ఇంధన సామర్ధ్యం కోసం ఐడిల్ స్టాప్/స్టార్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇది రెండు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంది. అవి ఎకో మరియు స్పోర్ట్స్ మోడ్స్. TVS Raider అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందుభాగంలో 30 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోశాక్ విత్ 5 స్టెప్ ప్రీ లోడ్ అడ్జస్ట్ ఉంటుంది.

ఇక బ్రేకింగ్ విషయంలోకి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 240 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఇవి చాల అద్భుతంగా పనిచేస్తాయి. మొత్తం మీద టీవీఎస్ రైడర్ బైక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం కంపెనీ ధరలను పెంచడం వల్ల అమ్మకాలపైనే ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా అనేది తెలియరావాలి.


Click it and Unblock the Notifications








