టీవీఎస్ రోనిన్ మోటార్‌సైకిల్ కోసం సరికొత్త యాక్ససరీ ప్యాక్స్.. రూ.2,299 నుండి ప్రారంభం!
చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ప్రీమియం బైక్ టీవీఎస్ రోనిన్ (TVS Ronin) కోసం కంపెనీ అధికారిక యాక్ససరీలను వెల్లడి చేసింది. ఈ కొత్త యాక్సెసరీస్ ప్యాకేజీల సాయంతో కస్టమర్లు తమ కొత్త టీవీఎస్ రోనిన్ తమ అభిరుచికి తగినట్లుగా కస్టమైజ్ చేసుకోగలుగుతారని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ రోనిన్ కోసం కంపెనీ టూర్, అర్బన్ మరియు స్టైల్ అనే మూడు యాక్ససరీ ప్యాక్ లను విడుదలచేసింది. వీటి ధరలు రూ.2,299 నుండి రూ.9,599 వరకు ఉన్నాయి.

టీవీఎస్ రోనిన్ కోసం అందిస్తున్న టూర్ కిట్ యాక్ససరీ ప్యాక్ లో సాడిల్ బ్యాగ్ స్టే, రియర్ రాక్, శాడిల్ బ్యాగ్, టెయిల్ బ్యాగ్ మరియు ఫ్లై స్క్రీన్ ఉన్నాయి. ఈ కిట్ ధర రూ.9,599 గా ఉంది. కాగా, అర్బన్ కిట్‌లో యూఎస్‌బి ఛార్జర్, సర్దుబాటు చేయగల లివర్స్ మరియు ట్యాంక్ బ్యాగ్‌ని అందిస్తోంది. ఈ అర్బన్ కిట్ ధర రూ.4,499 గా ఉంది. ఇకపోతే, స్టైలింగ్ కిట్‌లో కంపెనీ బార్ ఎండ్ వెయిట్స్, ట్యాంక్ గ్రిప్, ఫ్రంట్ బ్రేక్ రిజర్వాయర్ కవర్, ఇంజన్ కవర్ మరియు ఈఎఫ్ఐ కవర్‌ను అందిస్తోంది. ఈ కిట్ ధర రూ.2,299 గా ఉంది.

కస్టమర్లు ఈ యాక్ససరీ ప్యాక్ లను మొత్తం ప్యాకేజీ రూపంలో అయినా కొనుగోలు చేయవచ్చు లేదా వ్యక్తిగతంగా తమకు నచ్చిన వాటినైనా కొనుగోలు చేయవచ్చు. ఈ కిట్స్ టీవీఎస్ రోనిన్ బైక్ యొక్క అందాన్ని పెంచడమే కాకుండా బైక్ కు మంచి రక్షణ కూడా అందిస్తాయి. స్క్రాంబ్లర్ మరియు టూరర్ మోటార్‌సైకిళ్లను కలగలపి కంపెనీ రూపొందించిన ఈ కొత్త రోనిన్ బైక్ ప్రారంభ ధర రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
| Tour Kit | Price |
| Saddle Bag Stay | ₹1,798 |
| Rear Rack | ₹1,999 |
| Saddle Bag | ₹1,999 |
| Tail Bag | ₹1,599 |
| Flyscreen | ₹1,079 |
| Urban Kit | Price |
| USB Charger | ₹989 |
| Adjustable Levers | ₹809 - ₹1,439 |
| Tank Bag | ₹1,979 |
| Style Kit | Price |
| Bar End Weights | ₹404 |
| Tank Grip | ₹764 |
| Front Brake Reservoir Cover | ₹404 - ₹494 |
| Engine Cover | ₹269 |
| EFI Cover | ₹584 |

కొత్త టీవీఎస్ రోనిన్ సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ మరియు ట్రిపుల్ టోన్ అనే మూడు ట్రిమ్‌లలో, మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రతి ట్రిమ్ కూడా రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది ఇందులోని బేస్ వేరియంట్ లైట్నింగ్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ కలర్లలో అందుబాటులో ఉండగా, బేస్ ప్లస్ వేరియంట్ డెల్టా బ్లూ మరియు స్టార్‌గేజ్ బ్లాక్ అనే డ్యూయెల్ టోన్ కలర్స్ లో లభిస్తుంది మరియు ఇది సింగిల్-ఛానల్ ఏబీఎస్ అందుబాటులో ఉంటుంది. టాప్ ఎండ్ గెలాక్సీ గ్రే కలర్ మరియు డాన్ ఆరెంజ్ కలర్లలో అందుబాటులో ఉంటుంది. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ లభిస్తుంది.

టీవీఎస్ రోనిన్ మనం ఇప్పటి వరకూ ఈ బ్రాండ్ నుండి చూడని ప్రత్యేకమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇందులో ముందు వైపు T-ఆకారంలో ఉండే ఎల్‌డి లైట్‌తో కూడిన గుండ్రటి హెడ్‌ల్యాంప్, ప్రత్యేకమైన రియర్ వ్యూ మిర్రర్స్, టియర్-డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, గోల్డెన్ ఫినిషింగ్‌లో ఉండే అప్ సైడ్ డౌన్ ఫోర్కులు మరియు డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌లో ఉండే మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సైడ్స్ లో చాలా తక్కువ బాడీ ప్యానెల్స్, సింపుల్ అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనే ఫీచర్లను కలిగి ఉంటుంది.

టీవీఎస్ నుండి వచ్చిన ఈ కొత్త రోనిన్ మోటార్‌సైకిల్ సరికొత్త 225.9 సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 19.9 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఫ్లాట్ టార్క్ కర్వ్, లో మరియు మరియు మిడ్ రేంజ్ లలో పుష్కలంగా శక్తిని అందించేలా ట్యూన్ చేయబడిందని, దీని వల్ల రైడర్లు తరచూ గేర్లు మార్చుకోవాల్సిన అవసరం ఉండదని టీవీఎస్ పేర్కొంది. ఈ ఇంజన్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లుగా ఉంటుంది. టీవీఎస్ రోనిన్ లో సైలెంట్ ఇంజన్ స్టార్ట్ కోసం ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఈ బైక్ లో అర్బన్ మరియు రెయిన్ అనే రెండు మోడ్స్ కూడా ఉన్నాయి. మెకానికల్స్ విషయానికి వస్తే, టీవీఎస్ రోనిన్ బైక్ డబుల్-క్రాడిల్ స్ప్లిట్ చాసిస్ పై తయారైంది. ముందు భాగంలో 41 మి.మీ అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుకవైపు గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అన్ని మోడళ్లలో ముందువైపు 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

ఇంకా ఇందులో 9-స్పోక్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు వాటిపై ట్యూబ్‌లెస్ టైర్‌లు ఉంటాయి. ఈ టైర్లు బ్లాక్ ప్యాటర్న్ ను కలిగి ఉంటాయి మరియు రోనిన్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ బైక్ యొక్క డిజిటల్ సింగిల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రాండ్ యొక్క సుజుకి స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తుంది మరియు వాయిస్ కమాండ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. టీవీఎస్ రోనిన్ 181 మిమీ అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 795 మిమీ సీటు ఎత్తును కలిగి ఉండి, రైడర్ కు మంచి రైడింగ్ పొజిషన్ ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








