టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

దేశీయ విఫణిలో 'టీవీఎస్ మోటార్' (TVS Motor) కంపెనీ ఎట్టకేలకు తన కొత్త మోటార్ సైకిల్ 'రోనిన్' (Ronin) అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'టీవీఎస్ రోనిన్' బైక్ ప్రారంభ ధర రూ. 1,49,000 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1,68,750. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

టీవీఎస్ రోనిన్ మొత్తం ఆరు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ప్రతి వేరియంట్ కూడా రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. మొదటగా ఇందులోని బేస్ వేరియంట్ లైట్నింగ్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్‌ కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. అదే విధంగా బేస్ ప్లస్ వేరియంట్ డెల్టా బ్లూ మరియు స్టార్‌గేజ్ బ్లాక్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్ లో లభిస్తుంది. ఇది సింగిల్-ఛానల్ ఏబీఎస్ తో వస్తుంది.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

ఇక చివరగా టాప్ ఎండ్ వేరియంట్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ తో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో గెలాక్సీ గ్రే కలర్ మరియు డాన్ ఆరెంజ్ కలర్ స్కీమ్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ధరలు కలర్ ఆప్సన్ బట్టి మారుతాయి.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

టీవీఎస్ రోనిన్ వేరియంట్స్ & ధరలు

TVS Ronin Price
Single Tone Single Channel ₹1,49,000
Dual Tone Single Channel ₹1,56,500
Triple Tone Dual Channel ₹1,68,750
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, టియర్-డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ వంటివాటిని కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ డ్యూయల్-టోన్ కలర్ థీమ్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకూండా ఇది గోల్డెన్ ఫినిషింగ్‌లో యుఎస్డి ఫోర్క్స్ మరియు డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌లో మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. టీవీఎస్ రోనిన్ మోటార్ సైకిల్ బరువు 160 కేజీల వరకు ఉంటుంది. కావున రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

టీవీఎస్ రోనిన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది SmartXonnect కనెక్టివిటీ పొందుతుంది. ఈ ఫీచర్ ద్వారా వాహన వినియోగదారులు టర్న్-బై-టర్న్ నావిగేషన్, రేస్ టెలిమెట్రీ, లో ఫ్యూయెల్ వార్ణింగ్, క్రాష్ అలర్ట్ మరియు కాల్ / ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌ వంటి ఫీచర్స్ యాక్సెస్ చేయవచ్చు. కావున ఇది రైడింగ్ సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ 225 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి పవర్ మరియు 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 20 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ వరకు ఉంటుంది. రోనిన్ సైలెంట్ స్టార్ట్‌లను అనుమతించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

టీవీఎస్ రోనిన్ బైక్ డబుల్-క్రెడిల్ స్ప్లిట్ చాసిస్ కలిగి 41 మి.మీ అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుకవైపు గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్‌ను కలిగి ఉంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క బ్రేకింగ్స్ సిస్టం గమనిస్తే, ముందు మరియు వెనుక భాగంలో స్పోర్ట్స్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

రోనిన్ మోటార్ సైకిల్ దేశీయ మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హైనెస్ సిబి350, బజాజ్ పల్సర్ 250 మరియు డామినార్ 250 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది మార్కెట్లో బలమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ అత్యంత పాపులర్ టూ వీలర్ కంపెనీలలో ఒకటి. కావున కంపెనీ యొక్క ద్విచక్ర వాహనాలు మార్కెట్లో మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. కావు కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఈ కొత్త బైక్ కూడా తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2022, 18:41 [IST]
English summary
Tvs ronin launched price rs 1 49 lakh features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+