కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'టీవీఎస్ మోటార్' (TVS Motors) కంపెనీ ఎప్పటికప్పుడు భారతీయ మార్కెట్లో కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ వచ్చే నెలలో (2022 జులై) 6 వ తేదీన కొత్త టూవీలస్ విడుదల చేయనున్నట్లు తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ద్వారా ప్రకటించింది. అయితే మార్కెట్లో విడుదల చేయనున్న ఈ టూ వీలర్ పేరును మాత్రం వెల్లడించలేదు.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

టీవీఎస్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త బైక్ గురించి ఎక్కువ సమాచారం వెల్లడించనప్పటికీ ఇది కొత్త బైక్ అపాచే ఆర్ఆర్ 310 లేదా జెప్పెలిన్ క్రూయిజర్ బైక్‌కు నేక్డ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంటుందని నివేదికల చెబుతున్నాయి. అయితే ఈ కొత్త బైక్ గురించి అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

కంపెనీ విడుదల చేసే ఈ కొత్త బైక్ అపాచే ఆర్ఆర్ 310 అయితే ఇది నేక్డ్ మోడల్ బిఎండబ్ల్యు జి310 ఆర్ ఆధారంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ కొత్త బైక్ లో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

అయితే ఇది జెప్పెలిన్ క్రూయిజర్ బైక్‌ అయితే ఇది 2018 ఆటో ఎక్స్‌పోలో మొదటి సారి వెల్లడైంది. ఇది క్రూయిజర్ బైక్ కావున ఇందులో 220 సిసి సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇంజన్ 20 బిహెచ్‌పి పవర్ మరియు 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. TVS జెప్పెలిన్ క్రూయిజర్ యొక్క గరిష్ట వేగం గంటకు 130 కిమీ వరకు ఉంటుంది.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

టీవీఎస్ యొక్క ఈ కాన్సెప్ట్ క్రూయిజర్ బైక్ ప్రొడక్షన్ ప్రారంభం కాగానే దాని గురించి కంపెనీ మరింత సమాచారం వెల్లడిస్తుంది. అయితే జులై 6 న విడుదలయ్యే బైక్ ఏది అనేది మాత్రం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. నిజానికి జెప్పెలిన్ క్రూయిజర్ బైక్‌ పేరును కంపెనీ రెండు సంవత్సరాల క్రితమే ట్రేడ్‌మార్క్ చేసింది.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

ఇదిలా ఉండగా టీవీఎస్ కంపెనీ ఇటీవల తన తన టీవీఎస్ రైడర్ 125 (TVS Raider) ధరలను కూడా పెంచినట్లు తెలిపింది. టీవీఎస్ కంపెనీ తన 125 సిసి బైక్ టీవీఎస్ రైడర్ 125 బైక్ ను 2021 లో విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ బైక్ ప్రారంభ ధర రూ. 77,500 (ఎక్స్-షోరూమ్). ఇది డిస్క్ బ్రేక్ మరియు డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ 'రైడర్ 125 డిస్క్ బ్రేక్' వేరియంట్ ధరను రూ. 1900 పెంచింది. ధరల పెరుగుదల తరువాత టీవీఎస్ రైడర్ 125 డిస్క్ బ్రేక్ ధర రూ. 90,989 (ఎక్స్-షోరూమ్).

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

కంపెనీ యొక్క టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు. కావున ఈ బైక్ ధర రూ. 84,573 (ఎక్స్-షోరూమ్). టీవీఎస్ రైడర్ 125 సిసి బైకులలో ధరల పెరుగుదల కాకుండా ఇతర మార్పులు ఏమీ జరగలేదు. కావున డిజైన్ మరియు ఫీచర్స్ వంటివి అలాగే ఉన్నాయి.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

టీవీఎస్ కంపెనీ ఇటీవల కాలంలోనే తన ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ యొక్క కొత్త వేరియంట్‌ విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ మునుపటికంటే కూడా ఎక్కువ పరిధిని అందించేలా రూపొందించబడింది. కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఇందులో అధిక రేంజ్ అందించే కొత్త వేరియంట్ విడుదల చేయడం జెరిగింది.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

టీవీఎస్ యొక్క 2022 మోడల్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ ప్యాక్ అప్డేట్ చేయబడింది. కావున కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ లో పెద్ద 5.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 140 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంతకు ముందు కేవలం 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ని మాత్రమే ఉపయోగించబడింది. అయితే ఇప్పుడు 2022 మోడల్ లో 3.4 కిలోవాట్ మరియు 5.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ లతో అందిస్తోంది. కావున పరిధి ఇప్పుడు మునుపటికంటే కూడా ఎక్కువ పరిధిని అందిస్తుంది.

కొత్త టూవీలర్ విడుదలకు సిద్దమైన TVS: 2022 జులై 6 న లాంచ్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టీవీఎస్ కంపెనీ త్వరలో కొత్త టూవీలర్ విడుదల చేస్తుందన్న సంగతి అధికారికంగా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ టూవీలర్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు కొత్త బైకులు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, June 17, 2022, 9:56 [IST]
English summary
Tvs to launch new two wheeler on july 6 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+