హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పుడిప్పుడే కొనుగోలుదారులలో నమ్మకం పెరుగుతుంటే, తాజాగా జరుతున్న ఈవీ అగ్ని ప్రమాద ఘటనలు ఈ నమ్మకాన్ని మరింత బలహీనపరుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలి బూడిదయ్యాయి. చార్జింగ్ లో ఉండగా బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడలో జరిగింది.

హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

కుషాయిగూడకు చెందిన టి హరిబాబు ఇటీవలే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేశాడు. గడచిన సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రెండు బైక్‌లను ఇంటి ముందు పార్క్ చేసి, చార్జింగ్‌ పెట్టాడు. ఆ తర్వాత సరిగ్గా ఓ గంట వ్యవధిలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా, రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఇవి రెండూ ఒకేసారి పేలిపోయాయా లేక ఒకటి పేలిన కారణంగా మరొకదానికి మంటలు అంటుకున్నాయా అనే విషయంపై స్పష్టత లేదు.

హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

అదృష్టవశాత్తు, ఈ ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఇంటిలో ఉండటంతో ఎవ్వరికీ ప్రాణహాని జరగలేదు. హరిబాబు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారని, అప్పటికి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమైపోయాయని సమాచారం. ఎలక్ట్రిక్ స్కూటర్ల వలన వ్యాపించిన మంటలు సమీపంలోని విద్యుత్ తీగలకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ భవనం యొక్క ప్రధాన విద్యుత్ వైరు కూడా మంటల్లో కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు.

హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

కాగా, హరిబాబు కొనుగోలు చేసింది ఏ బ్రాండ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలనే విషయంపై ఇంకా సమాచారం లేదు. బహుశా, ఇవి స్థానిక కంపెనీలకు చెందిన ఈవీలు కావచ్చని తెలుస్తోంది. అంతకు ముందు శనివారం తెల్లవారుజామున వనస్థలిపురం ఎన్జీవో కాలనీలో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన కారణంగా ఓ వ్యక్తి గాయపడ్డాడు. కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి పార్క్ చేసిన బైక్‌ను ఛార్జ్ చేయడానికి స్విచ్ ఆన్ చేయగా, అందులోని బ్యాటరీ పేలింది. దీంతో అతని చేతులు మరియు శరీరంపై కాలిన గాయాలు అయ్యాయి.

హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

అంతకు ముందు జూన్‌లో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్‌కు చార్జింగ్‌ పెడుతుండగా మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు దగ్ధమైంది. మే నెలలో హైదరాబాద్‌లో ఓ ప్రముఖ బ్రాండ్ కి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే, ఏప్రిల్‌ నెలలో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన ఈ ఈవీ బ్యాటరీ పేలుడు ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు మరియు మరో ముగ్గురు గాయపడ్డారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అగ్ని ప్రమాద ఘటనలపై కేంద్రం సీరియస్‌గా వ్యవరిస్తోన్నప్పటికీ, అక్కడక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

అధిక ఉష్ణోగ్రతలే బ్యాటరీ పేలుళ్లకు కారణమా?

ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీలు కాలిపోవడానికి అధిక ఉష్ణోగ్రతలే కారణమని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నప్పటికీ, నిపుణులు మాత్రంలో వాటిలో ఉపయోగించిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీని ఎలా ప్యాక్ చేశారనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలని చెబుతున్నారు. స్కూటర్లలో తక్కువ స్థలం కారణంగా బ్యాటరీ ప్యాక్ లను కుదించి తయారు చేయడం వలన వాటిలో ఉత్పత్తయ్యే అధిక ఉష్ణం బయటకు వెళ్లడానికి మార్గం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బ్యాటరీలు వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.

హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

ఈవీ అగ్ని ప్రమాదాలను ఎలా తగ్గించవచ్చు?

ఇది పూర్తిగా అనివార్యం అయినప్పటికీ, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మనం ఈవీ ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చు. ఎలక్ట్రిక్ వాహనం పనిచేయడం ఆగిపోయిన వెంటనే, దాని బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే, ఆ సమయంలో బ్యాటరీలో ఉన్న లిథియం అయాన్ సెల్స్ కొంత సమయం వరకు వేడిగా ఉంటాయి. ఆ సమయంలో వాటిని చార్జ్ చేయడం వలన ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చే ఉష్ణం కారణంగా బ్యాటరీ సెల్స్ మరింత వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, బ్యాటరీ చల్లబడే వరకూ వేచి ఉండి, ఆ తర్వాత దానిని ఛార్జ్ చేయండి.

హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

మీ ఎలక్ట్రిక్ వాహనం కోసం రూపొందించబడిన నిర్ణీత బ్యాటరీ మరియు ఛార్జింగ్ కేబుల్‌ను మాత్రమే ఉపయోగించండి. తక్కువ ధరలో ఉండే లోకల్ బ్యాటరీని మరియు లోకల్ చార్జర్లను ఉపయోగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనం దెబ్బతింటుంది. ఒకవేళ మీ ఈవీలో వేరు చేయగలిగిన (రిమూవబల్) బ్యాటరీ ఉన్నట్లయితే, దానిని నేరుగా సూర్యకాంతిలో లేదా వేడిగా ఉండే ప్రాంతంలో ఉంచి చార్జ్ చేయకండి. నిర్వాసితులకు దూరంగా మరియు తగినంత వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉంచి చార్జ్ చేయండి.

హైదరాబాద్‌లో కాలి బూడిదైన మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఛార్జింగ్‌లో ఉండగా పేలిన బ్యాటరీలు..!

మీ ఈవీకి రీప్లేస్‌మెంట్ బ్యాటరీలు మరియు ఛార్జర్‌లను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి. మీరు కొనుగోలు చేస్తున్న వస్తువులు అసలైన తయారీదారు లేదా అధీకృత విక్రేత నుండి మాత్రమే కొనుగోలు చేయండి. థర్డ్ పార్టీ వస్తువుల ఎప్పటికైనా ముప్పు తప్పదని గుర్తుంచుకోండి. మీ బ్యాటరీ ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. బ్యాటరీ ప్యాక్ పాడైందని గుర్తిస్తే, వెంటనే దానిని కొత్త దానితో రీప్లేస్ చేసుకోండి. ఒకవేళ మీరు కొనుగోలు చేసిన కొత్త వాహనం బ్యాటరీలో ఏదైనా లోపాన్ని గుర్తిస్తే వెంటనే తయారీదారు దృష్టికి తీసుకువెళ్లండి. బ్యాటరీ తరచూగా వేడిగా అవుతున్నా లేదా అందులో ఏదైనా డ్యామేజ్‌ని గుర్తించినా దాన్ని ఉపయోగించకండి.

NOTE: ఇందులో ఉపయోగించిన ఫోటోలు కేవలం రెఫరెన్స్ కోసం మాత్రమే, పాఠకులు గమనించగలరు.

Most Read Articles

English summary
Two electric scooters catches fire in hydrabad batteries exploded while charging them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X