మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy), భారత మార్కెట్లో విక్రయిస్తున్న 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మరో రెండు కొత్త వేరియంట్‌ లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450 ప్లస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, వీటికి అదనంగా రాబోయే రెండు కొత్త వేరియంట్‌లలో ఒకటి ఎక్కువ పవర్‌ను అందించే కొత్త ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఎక్కువ రేంజ్‌ను అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయని సమాచారం.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

ఏథర్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్‌లను విడుదల చేయాలనే యోచనకు సంబంధించిన సమాచారాన్ని ఆ కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా వెల్లడించారు. పైన చెప్పినట్లుగా, ఏథర్ ఎనర్జీ నుండి రాబోయే ఈ రెండు వేరియంట్లు కూడా కంపెనీ యొక్క ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతాయి. కాగా, ఇందులో ఒకటి మాత్రం ఎక్కువ రేంజ్ మరియు పవర్‌ను జనరేట్ చేసేలా అప్‌గ్రేడ్‌ను పొందే అవకాశం ఉంది.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

ప్రస్తుతం, ఏథర్ ఎనర్జీ విక్రయిస్తున్న Ather 450X మరియు Ather 450 Plus ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏథర్ 450ఎక్స్ అనేది ప్రీమియం వేరియంట్ కాగా, 450 ప్లస్ బేస్ వేరియంట్‌గా ఉంది. దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1,52,401 ఉంటే, ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1,33,391 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, విజయవాడ)గా ఉంది. కాగా, కొత్తగా రాబోయే రెండు వేరియంట్‌లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి చాలా పరిమితంగా ఉన్నప్పటికీ, వీటిలో ఒకటి మాత్రం పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

ఏథర్ 450 ఇ-స్కూటర్ల కోసం కొత్త OTA అప్‌డేట్

ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ తమ రెండు 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఇటీవలే ఓ అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ ఇప్పుడు ఏథర్ 450ఎక్స్ మరియు 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త స్మార్ట్ఎకో (SmartEco) అనే రైడ్ మోడ్‌ను పరిచయం చేసింది. ఏథర్ ఇ-స్కూటర్ల యజమానులు ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ స్మార్ట్ఎకో రైడ్ మోడ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. యజమానులు తమ స్కూటర్‌ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ OTA అప్‌డేట్‌ను పొందవచ్చు.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

ఈ అప్‌డేట్ తర్వాత కొత్త స్మార్ట్ ఎకో (SmartEco) మోడ్, ఆయా స్కూటర్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మునుపటి ఎకో (Eco) మోడ్‌ను భర్తీ చేస్తుంది. ఏథర్ ల్యాబ్స్ దీన్ని క్రమంగా కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం, ఏథర్ ఇ-స్కూటర్‌ లలో ఉన్న ఎకో మోడ్‌ని ఉపయోగించడం వలన రైడర్లు ఇతర మోడ్‌లలో కన్నా ఎక్కువ రేంజ్‌ను పొందుతారు. సాధారణంగా, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎకో రైడ్ మోడ్‌ని ఉపయోగించడం వలన సదరు స్కూటర్ ప్రయాణించే గరిష్ట వేగం తగ్గుతుంది, ఫలితంగా రేంజ్ పెరుగుతుంది.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

ఈ మోడ్‌లో ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్‌పై ఎక్కువ ప్రభావం పడదు కాబట్టి, ఇందులో ఇతర హై-స్పీడ్ మోడ్‌ల కంటే ఎక్కువ రేంజ్ లభిస్తుంది. అయితే, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్తగా పరిచయం చేసిన ఈ స్మార్ట్ ఎకో మోడ్‌లో, సదరు ఇ-స్కూటర్ గరిష్ట త్వరణాన్ని (యాక్సిలరేషన్)ను అందిస్తూనే, బ్యాటరీ విద్యుత్ వినియోగాన్ని తెలివిగా నియంత్రిస్తుంది. కాబట్టి, ఇది నిజమైన రేంజ్‌ను సాధించడానికి సహకరిస్తుందని కంపెనీ అంటోంది.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

ఏథర్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఓటిఏ అప్‌డేట్ లను విడుదల చేయడం ఇదేం మొదటిసారి కాదు. కంపెనీ గతంలో కూడా, కొన్ని OTA అప్‌డేట్‌లను విడుదల చేసింది. వాటిలో ట్రిప్ ప్లానర్ మరియు సేవింగ్స్ ట్రాకర్ వంటి కొన్ని అప్‌డేట్స్ ఉన్నాయి. అయితే, కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, కొత్త OTA అప్‌డేట్ Ather 450 Plus మరియు Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉండదు. ఇది 'Ather Connect Pro' సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు సభ్యత్వం పొందిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

ఏథర్ ఎనర్జీ నుండి అత్యంత పాపులర్ అయిన 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉపయోగించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ (సర్టిఫైడ్ రేంజ్) పైగా దూరం ప్రయాణించవచ్చు.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

భారతదేశంలో ఏథర్ ఎనర్జీ అమ్మకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. దేశంలో ఇప్పటికే అనేక బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో పలు సమస్యలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఏథర్ ఎనర్జీపై మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి వివాదాలు రాలేదు. ఏథర్ ఎనర్జీ గడచిన మార్చి 2022 నెలలో 2,591 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.

మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్న ఏథర్ ఎనర్జీ.. ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్..!

ఈ కంపెనీ ఇటీవలే తమ 25,000వ యూనిట్ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తమిళనాడులోని తమ ప్లాంట్ నుండి బయటకు విడుదల చేసింది. ఏథర్ ఎనర్జీ తమిళనాడులోని హోసూర్‌లోని తన కొత్త తయారీ కర్మాగారంలో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుండి కేవలం 2 సంవత్సరాలలోనే ఈ మైలురాయిని సాధించింది.

మూలం: BikeWale

Most Read Articles

English summary
Two more new ather 450 variants to be launched soon may get more power and range
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X