దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

సాధారణంగా వాహన వినియోగదారులు ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే వాహన తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేయడానికి తగిన సన్నాహాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే ఈ నెల (2022 మార్చి) కొన్ని కొత్త ద్విచక్ర వాహనాలు విడుదలయ్యాయి.

ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రమ్ 411, ఒకినావా ఒకి90 ఎలక్ట్రిక్ స్కూటర్, క్రేయాన్ ఎన్‌వి ఎలక్ట్రిక్ స్కూటర్, గ్రేటా గ్లైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు ఎన్ఐజే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. వీటి గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రమ్ 411 (Royal Enfield Scram 411):

దేశీయ ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇటీవల 'స్క్రామ్ 411' అనే ఓ కొత్త బైక్ విడుదల చేసింది. ఈ బైక్ యొక్క ప్రారంభ ధర రూ. రూ.2.03 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.2.08 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రమ్ 411 ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది దాని విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కి ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రమ్ 411 బైక్ 411 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ స్లిక్-షిఫ్టింగ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

ఒకినావా ఒకి90 (Okinawa Okhi90):

ఒకినావా కంపెనీ ఇటీవలదేశీయ మార్కెట్లో తన 'ఒకినావా ఒకి90' ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఒకినావా ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.21 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సబ్సీడీలు అందిన తరువాత ధరలలో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతాయి.

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

ఒకినావా ఒకి90 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 80 నుండి 90 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. ఒకినావా ఒకి90 దాని విభాగంలో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు బజాజ్ చేతక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

క్రేయాన్ ఎన్వీ (Crayon Envy):

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగం శరవేగంగా ముందుకు సాగుతున్న సమయంలో 'క్రేయాన్ మోటార్స్' ఇటీవల 'క్రేయాన్ ఎన్వీ' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీని ధర రూ. 64,000 (ఎక్స్-షోరూమ్).

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

క్రేయాన్ ఎన్వీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద బూట్ స్పేస్, కీలెస్ స్టార్ట్ మరియు రివర్స్ అసిస్ట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో డిజిటల్ స్పీడోమీటర్ మరియు మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వబడింది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

ఎన్ఐజే యాక్సెలెరో+ (NIJ Accelerio+):

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ఎన్ఐజే ఆటోమోటివ్' దేశీయ విఫణిలో 'ఎన్ఐజే యాక్సెలెరో+' అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 53,000. ఎన్ఐజే యాక్సెలెరో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ను పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 మార్చి) విడుదలై కొత్త బైకులు: వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కస్టమర్ ఎంచుకునే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ను బట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 53,000 నుండి రూ. 98,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఎన్ఐజే ఆటోమోటివ్ ప్రవేశపెట్టిన ఈ యాక్సిలెరో ప్లస్ ఇ-స్కూటర్ లో కంపెనీ వాల్వ్ రెగ్యులేటెడ్ లీడ్-యాసిడ్ లేదా లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ లను ఉపయోగిస్తుంది. మొత్తం మీద ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 29, 2022, 11:34 [IST]
English summary
Two wheelers launched in march 2022 scram 411 okhi90 glide electric scooter details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+