కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' (Ultraviolette) యొక్క F77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఒక ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 307 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ఇప్పటికే తెలిసింది. అయితే ఈ పరిధి అందించడానికి కావలసిన బ్యాటరీ ప్యాక్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

అల్ట్రావయోలెట్ తన కొత్త ఎలక్ట్రిక్ బైకును 2022 నవంబర్ 24 న విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు కంపెనీ ఈ బైక్ కోసం 2022 అక్టోబర్ 23 నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. కావున ఈ బైక్ బుక్ చేసుకునే వారు రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు లాంచ్ తరువాత ప్రారంభమవవుతాయి.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

అల్ట్రావయోలెట్ కంపెనీ 2019 లో ఈ బైక్ ని మొదటిసారిగా చూపించినప్పటికీ ఇప్పటికీ చాలా ఆధునికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి కంపెనీ ఈ బైక్ ని త్వరలోనే విడుదల చేయనుంది. కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్లలో కస్టమర్లు దీనిని ఇప్పుడు చూడవచ్చు. అయితే ఇప్పుడు ఇది కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం చేయబడింది. కాగా, రానున్న రోజుల్లో మరిన్ని నగరాలలో విస్తరించబడే అవకాశం ఉంటుంది.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

అల్ట్రావయోలెట్ F77 బైకులో మొదటి కనిపించిన మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్‌కు బదులుగా 10.5 కిలోవాట్ పెద్ద ప్యాక్‌కి మారింది. ఇది మునుపటికంటే కూడా చాలా పెద్దదిగా ఉంటుంది మరియు లిథియం-అయాన్ సెల్‌లతో నిండి ఉంటుంది. మొత్తం అల్యూమినియం కేస్‌లో 21,700 లిథియం-అయాన్ సెల్స్ మరియు ప్రోటోటైప్‌లోని 18,650 సెల్‌లు ఉంటాయి. కావున పనితీరులో చాలా ఉత్తమంగా ఉంటుంది.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

అల్ట్రావయోలెట్ F77 బైకులోని బ్యాటరీ వల్ల దాని పరిధి 307 కిమీ చేరింది. ఇది భారతీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఎక్కువ పరిధిని అందించే ఎలక్ట్రిక్ బైక్ కానుంది. అంతే కాకుండా ఈ బైకులోని బ్యాటరీ చాలా సురక్షితంగా ఉండేలా కావలసిన మార్పులు జరిగాయి. దీని చుట్టూ అల్యూమినియం కేసింగ్‌ ఉంటుంది, కావున ఇది చాలా సురక్షితంగా ఉంటుంది.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

ఈ కొత్త బైకులోని బ్యాటరీ ప్యాక్ కోసం టాప్-ఆఫ్-ది-లైన్ థర్మల్ మేనేజ్‌మెంట్ సెటప్‌ను అభివృద్ధి చేసినట్లు కూడా కంపెనీ తెలిపింది. కావున వేడి వంటి పరిస్థితులను కూడా ఇది సులభంగా తట్టుకోగలదు, మంచి పనితీరుని అందించగలదు. మొత్తం మీద ఇది మంచి రేంజ్ అందించడానికి కావలసిన మార్పులన్నీ కంపెనీ ఇందులో చేసింది.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

కంపెనీ తన ప్రొడక్షన్-స్పెక్ F77 ఎలక్ట్రిక్ ని కూడా ప్రదర్శించింది. ఇది అద్భుతమైన మరియు దృఢమైన బాడీవర్క్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ లో రైడ్ మోడ్‌లు ఉన్నట్లు సమాచారం, దీని వల్ల రైడర్ తమ రైడింగ్ స్టైల్‌కు అనుగుణంగా వివిధ స్థాయిల రీజెన్‌లను ఎంచుకోవచ్చు.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

ఇప్పటికే చెప్పుకున్నట్లు ఈ నెల 23 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి, కావున కొనుగోలుదారులు రూ. 10,000 చెల్లించి ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ ఈ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాల వారంటీ అందిస్తుంది. దీనిని కస్టమర్లు మరింత పొడిగించుకోవచ్చు.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

అల్ట్రావయోలెట్ F77 విక్రయాలు ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో ఎక్స్‌పీరియన్స్ జోన్‌లను ప్రారంభించడానికి కూడా కంపెనీ తగిన ప్రయత్నాలు చేస్తోంది. అంతే కాకుండా కంపెనీ తన కొత్త F77 యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని మొదటి సంవత్సరంలో 15,000 యూనిట్లకు పరిమితం చేయబడింది. కానీ మొత్తానికి కంపెనీ 1,00,000 యూనిట్ల ఉత్పత్తి పెద్ద ప్రాణాలకలనే సిద్ధం చేసుకుంటోంది. కాగా ఎక్కువమంది కొనుగోలుదారు ఎక్కువ రేంజ్ అందించే ఈ F77 ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయవచ్చు.

కుర్రకారుని ఉర్రూతలూగించడానికి వస్తున్న అల్ట్రావయోలెట్ F77.. ఒక్క ఛార్జ్‌తో 307 కిమీ రేంజ్ పక్కా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతేదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైకులు పుట్టుకొస్తున్నాయి. కాగా మన బెంగళూరుకు చెందిన కంపెనీ యొక్క ఈ F77 ఎలక్ట్రిక్ బైక్ మాత్రం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ పరిధిని అందించడానికి తగిన విధంగా రూపొందించబడింది. కావున ఇది తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము, ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ధర మరియు ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఈ బైక్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ultraviolette f77 bike booking begins on 2022 october 23 battery pack details
Story first published: Wednesday, October 19, 2022, 9:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X