Just In
- 16 hrs ago
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు
- 1 day ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 2 days ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 2 days ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
Don't Miss
- Movies
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
అల్ట్రావయోలెట్ F77 డెలివరీ టైమ్‌లైన్ వచ్చేసింది.. ఫస్ట్ డెలివరీ ఎక్కడో తెలుసా?
బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' భారతీయ మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ఎఫ్77 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు డెలివరీలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది.
కొత్త అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 10,000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే బుక్ చేసుకున్న తరువాత మొదటి డెలివరీలు బెంగళూరు నగరంలో ప్రారంభమవుతాయి. ఫేజ్ 1 కింద, 2023 జనవరి నాటికి డెలివరీలు బెంగళూరులో మాత్రమే ప్రారంభమవుతాయి. అంటే కంపెనీ మొదటి ప్రాధాన్యత ప్రస్తుతం బెంగళూరు ప్రాంత వాసులకు కల్పిస్తుంది.

బెంగళూరులో డెలివరీలు ప్రారంభమైన తరువాత ఫేజ్-2 మొదటి భాగంలో 2023 ఏప్రిల్ మరియు జూన్ మధ్య కాలంలో చెన్నై, ముంబై, పూణే మరియు కొచ్చిన్‌లలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఫేజ్-2 రెండవ భాగం 2023 జూలై మరియు సెప్టెంబర్ మధ్యలో హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ మరియు లక్నో నగరాల్లో ప్రారంభించబడుతుంది. ఇక ఫేజ్-2 మూడవ మరియు చివరి భాగంగా గురుగ్రామ్, జైపూర్, కోల్‌కతా, గౌహతి మరియు లుధియానాలలో అక్టోబర్-డిసెంబర్ మధ్యలో ప్రారంభిస్తుంది.
కంపెనీ తన అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైకుని గ్లోబల్ మార్కెట్లో కూడా విక్రయిస్తుందని గతంలోనే చెప్పింది. కావున భారతీయ మార్కెట్లో డెలివరీలను చేసిన తరువాత ఇతర దేశాలైన యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, జపాన్ మరియు ఇతర ఆగ్నేయాసియా దేశాలలో కూడా డెలివరీలను ప్రారంభిస్తుంది, కానీ ఈ దేశాలలో ఎప్పుడు డెలివరీ చేస్తుంది అనే అధికారిక సమాచారం గానీ, డెలివరీ టైమ్ కానీ విడుదల చేయలేదు.
ఇప్పటికే కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం దాదాపు 190 దేశాల నుంచి 70,000 ప్రీ బుకింగ్స్ పొందే అవకాశం ఉందని గతంలోనే వెల్లడించింది. కావున ఇది ప్రపంచ మార్కెట్లో తప్పకుండా మంచి ఆదరణ పొందే అవకాశం కూడా ఉంది. ఈ కొత్త మూడు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి షాడో (బ్లాక్), ఎయిర్‌స్ట్రైక్ (వైట్ అండ్ బ్లాక్) మరియు లేజర్ (రెడ్ అండ్ బ్లాక్).
అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎఫ్77 వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 207 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 307 కిమీ రేంజ్ అందిస్తుంది. అంటే ఎఫ్77 వేరియంట్ కంటే కూడా రీకాన్ వేరియంట్ రేంజ్ 100 కిమీ ఎక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది.
అల్ట్రావయోలెట్ ఎఫ్77 (F77) వేరియంట్ బరువు 197 కేజీలు కాగా, రీకాన్ వేరియంట్ బరువు 187 కేజీల వరకు ఉంటుంది. కాగా ఈ రెండు వేరియంట్స్ యొక్క అవుట్‌పుట్ గణాంకాలు కూడా వేరుగా ఉంటాయి. ఎఫ్77 వేరియంట్ గరిష్టంగా 36.2 బిహెచ్‌పి పవర్ మరియు 85 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 38.88 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
అల్ట్రావయోలెట్ F77 లిమిటెడ్ ఎడిషన్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం 77 యూనిట్లు మాత్రమే విక్రయించబడతాయి. ఈ బైక్ ధర రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కూడా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇవి స్టాండర్డ్ మరియు బూస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ కలిగి ఉంటాయి. బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి 15A ప్లగ్ పాయింట్‌లోకి ప్లగ్ చేయవచ్చు.