అల్ట్రావయోలెట్ F77 వేరియంట్ వారీగా వివరాలు.. ఇక్కడ చూడవచ్చు
బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' ఇటీవల ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ 'F77' లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ లాంచ్ సమయంలోనే మూడు వేరియంట్స్ గురించి వెల్లడించింది. ఈ వేరియంట్స్ గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
అల్ట్రావయోలెట్ ఎఫ్77:
ఎఫ్77 అనేది కంపెనీ యొక్క మూడు వేరియంట్స్ లో మొదటి మోడల్ (బేస్ మోడల్). దీని ధర రూ.3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 207కిమీ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 0-60 కిమీ వేగాన్ని మరియు 8.3 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

అల్ట్రావయోలెట్ ఎఫ్77 లోని బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీని అందిస్తుంది. అయితే దీనిని 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీ వారంటీకీ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కలర్ ఆప్సన్ విషయానికి వస్తే, ఎఫ్77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ బ్లాక్, సిల్వర్ మరియు రెడ్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.
అల్ట్రావయోలెట్ ఎఫ్77 రీకాన్:
అల్ట్రావయోలెట్ యొక్క మరో వేరియంట్ అయిన ఎఫ్77 రీకాన్ విషయానికి వస్తే, దీని ధర రూ.4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 307కిమీ రేంజ్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించింది. ఈ బైక్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 0-60 కిమీ మరియు 8.0 సెకన్లలో 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
ఇక బ్యాటరీ ప్యాక్ యొక్క వారంటీ విషయానికి వస్తే, స్టాండర్డ్ గా 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీల వారంటీని పొందవచ్చు. అయితే దీనిని 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీకీ అప్డేట్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే బేస్ మోడల్ ఏ కలర్ ఆప్సన్ లో లభిస్తుంది అదే కలర్స్ (బ్లాక్, సిల్వర్ మరియు రెడ్ కలర్స్) ఇది కూడా లభిస్తుంది.
అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్:
ఇక చివరగా ఇందులోని చివరి మోడల్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ పేరుకి తగిన విధంగానే ఇది లిమిటెడ్ యూనిట్లలో మాత్రమే లభిస్తుంది. కావున ఇది కేవలం 77 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 77 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ పనితీరు విషయంలో మిగిలిన రెండు బైకులంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ లో రీకాన్ వేరియంట్ లో ఉన్న అదే బ్యాటరీ (10.3 కిలోవాట్) ఉంటుంది. కావున రేంజ్ కూడా రీకాన్ మోడల్ మాదిరిగానే 307 కిమీ ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ మరియు 7.8 సెకన్లలో 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుని మార్కెట్లో లాంచ్ చేయకముందు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తికలిగిన కొనుగోలుదారులు రూ. 10,000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మొదట బెంగళూరులో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దశల వారిగా డెలివరీలు ప్రారభించబడతాయి.


Click it and Unblock the Notifications








