కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77' వచ్చేసింది.. ధర రూ. 3.80 లక్షలు

బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' (Ultraviolette) ఎప్పుడుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త 'ఎఫ్77' (F77) ఎలక్ట్రిక్ బైకుని అధికారికంగా లాంచ్ చేసింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. అవి ఎఫ్77 మరియు రీకాన్ వేరియంట్స్. వీటి ధరలు వరుసగా రూ. 3.80 లక్షలు, రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్).

రూ. 3.80 లక్షల వద్ద విడుదలైన అల్ట్రావయోలెట్ F77

కొత్త అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్‌ చూడటానికి చాలా ఆకర్షణీయమైన కొత్త డిజైన్ కలిగి మూడు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి షాడో (బ్లాక్), ఎయిర్‌స్ట్రైక్ (వైట్ అండ్ బ్లాక్) మరియు లేజర్‌ (రెడ్ అండ్ బ్లాక్). ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 10,000 చెల్లించి అధికారిక వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు.

అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎఫ్77 వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 207 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 307 కిమీ రేంజ్ అందిస్తుంది. అంటే ఎఫ్77 వేరియంట్ కంటే కూడా రీకాన్ వేరియంట్ రేంజ్ 100 కిమీ ఎక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది.

రూ. 3.80 లక్షల వద్ద విడుదలైన అల్ట్రావయోలెట్ F77

అల్ట్రావయోలెట్ ఎఫ్77 (F77) వేరియంట్ బరువు 197 కేజీలు కాగా, రీకాన్ వేరియంట్ బరువు 187 కేజీల వరకు ఉంటుంది. కాగా ఈ రెండు వేరియంట్స్ యొక్క అవుట్‌పుట్ గణాంకాలు కూడా వేరుగా ఉంటాయి. ఎఫ్77 వేరియంట్ గరిష్టంగా 36.2 బిహెచ్‌పి పవర్ మరియు 85 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 38.88 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

పర్ఫామెన్స్ లో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కొలతల పరంగా చాలా వరకు ఒకేవిధంగా ఉంటాయి. కావున ఈ ఎలక్ట్రిక్ బైకు యొక్క వీల్‌బేస్ 1,340 మిమీ, సీటు ఎత్తు 800 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లు గ్లైడ్, కంబాట్ మరియు బాలిస్టిక్ అనే రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటాయి. బ్యాటరీ ఛార్జ్ 70 శాతం కంటే ఎక్కువ ఉన్నప్పుడు బాలిస్టిక్ మోడ్‌ ఉపయోగించవచ్చు.

రూ. 3.80 లక్షల వద్ద విడుదలైన అల్ట్రావయోలెట్ F77

అల్ట్రావయోలెట్ F77 లిమిటెడ్ ఎడిషన్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం 77 యూనిట్లు మాత్రమే విక్రయించబడతాయి. ఈ బైక్ ధర రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కూడా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇవి స్టాండర్డ్ మరియు బూస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ కలిగి ఉంటాయి. బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి 15A ప్లగ్ పాయింట్‌లోకి ప్లగ్ చేయవచ్చు.

డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో ఎల్ఈడీ లైట్, వెనుక స్ప్లిట్ LED టైల్‌లైట్లు ఉంటాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ TFT డాష్‌తో టర్న్-బై-టర్న్ నావిగేషన్ మరియు నోటిఫికేషన్ అలర్ట్‌లు వంటి ఫీచర్లను ఎనేబుల్ చేయవచ్చు. అంతే కాకుండా.. ఇందులో రైడ్ అనలిటిక్స్, రియల్ టైమ్ లొకేషన్, క్రాష్ డిటెక్షన్ మరియు బ్యాటరీ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ యొక్క వారంటీ విషయానికి వస్తే కంపెనీ ఎఫ్77 వేరియంట్‌లోని బ్యాటరీ ప్యాక్ పైన 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీ, రీకాన్‌ బ్యాటరీ పై 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీ వారంటీ మరియు లిమిటెడ్ ఎడిషన్ బ్యాటరీ పై 8 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీ బ్యాటరీ వారంటీ అందిస్తుంది. ఈ వారంటీని కస్టమర్లు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది.

ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే ఈ ఎలక్ట్రిక్ బైకుని బుక్ చేసుకోలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు 2023 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే అల్ట్రావయోలెట్ F77 లిమిటెడ్ ఎడిషన్ 77 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది, కావున ఈ వేరియంట్ కోసం మరింత త్వరగా బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొనుగోలుదారులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.

More from DriveSpark

Article Published On: Thursday, November 24, 2022, 15:23 [IST]
English summary
Ultraviolette f77 launched price features range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+