మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

బజాజ్ ఆటో నుండి లభిస్తున్న ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బజాజ్ సిటి (Bajaj CT) సిరీస్ లో కంపెనీ ఓ కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. బజాజ్ ఆటో గతంలో టూవీలర్ ధర మరియు మైలేజీకి ప్రాధాన్యతనిచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని, బజాజ్ సిటి 100 (Bajaj CT 100) ని విడుదల చేసింది. వ్యాపారస్తులు, రైతులు, అధిక మైలేజ్ కోరుకునే ఉద్యోగులు ఈ మోటార్‌సైకిల్‌ను ఎంతగానో ఆదరించడం మరియు ఈ బైక్ ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో, ఇది మార్కెట్లో త్వరలోనే ఓ సక్సెస్‌ఫుల్ ఎంట్రీ-లెవల్ బైక్‌గా మారింది.

మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

అయితే, బజాజ్ ఈ 100సీసీ బైక్ ఉత్పత్తిని డిస్‌కంటిన్యూ చేసి, దాని స్థానంలో 110సీసీ బైక్‌ను మాత్రమే విక్రయిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పుడు సిటి సిరీస్‌కు కొనసాగింపుగా ఓ కొత్త మరియు పవర్‌ఫుల్ బజాజ్ సిటి 125ఎక్స్ (Bajaj CT 125X) ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా, ఓ బజాజ్ ఆటో డీలర్‌షిప్ కేంద్రంలో ఉంచిన బజాజ్ సిటి 125ఎక్స్ కెమెరా కంటపడింది. దీన్నిబట్టి చూస్తుంటే, త్వరలోనే ఈ కొత్త సిటి మోడల్ మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

ప్రస్తుత బజాజ్ CT110X యొక్క 125సీసీ వెర్షనే ఈ కొత్త బజాజ్ CT125X. ఇది 110సీసీ మోడల్ కన్నా కొంచెం ఎక్కువ పవర్ మరియు మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. బజాజ్ సిటి 125ఎక్స్ ను మోటార్‌సైకిల్‌ను ప్రారంభించడంతో, బజాజ్ ఆటో తమ ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో 125సీసీ బడ్జెట్ కమ్యూటర్‌ను తిరిగి పరిచయం చేస్తుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించినప్పటికీ, బజాజ్ యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కొంతకాలంగా బడ్జెట్ 125సీసీ కమ్యూటర్ లేదు.

మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

బజాజ్ ఆటో గతంలో విక్రయించిన డిస్కవర్ 125, ఎక్స్‌సిడి 125 మోటార్‌సైకిళ్లను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసిన తర్వాత ఈ విభాగంలో కంపెనీ ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్పత్తిని అందించలేదు. ప్రస్తుతం, బజాజ్ ఆటో యొక్క ఎంట్రీ-లెవల్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ప్లాటినా 100, ప్లాటినా 110 మరియు సిటి110ఎక్స్ మోడళ్లు తప్ప వేరే ఇతర మోడళ్లు లేవు. అలాగే, బజాజ్ ఆటో తన ప్రోడక్ట్ లైనప్‌లో పెట్రోల్-ఆధారిత స్కూటర్లను కూడా విక్రయించడం లేదు. ఫలితంగా, బజాజ్ ఆటో ఎంట్రీ-లెవల్ టూవీలర్ విభాగంలో భారీగా కస్టమర్లను కోల్పోవలసి వస్తోంది.

మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

ఈ నేపథ్యంలో, బజాజ్ ఆటో ఎంట్రీ-లెవల్ టూవీలర్ విభాగంలో తిరిగి తన మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు ఇప్పుడు కొత్తగా బజాజ్ సిటి 125ఎక్స్ మోటార్‌సైకిల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం, మార్కెట్లో అత్యంత లాభదాయకమైన మోటార్‌సైకిల్ సెగ్మెంట్లలో బడ్జెట్ 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌ కూడా ఒకటి. ఈ విభాగంలో లభించే మోటార్‌సైకిళ్లు మెరుగైన వపర్ డెలివరీని అందిస్తూనే అత్యుత్తమ మైలేజీని కూడా అందిస్తాయి. కాబ్టటి, కస్టమర్లు కూడా 100సీసీ బైక్‌ల కన్నా 125సీసీ బైక్ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

బజాజ్ ఆటో నుండి రాబోయే కొత్త సిటి 125ఎక్స్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలోని 125సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లైన హోండా ఎస్‌పి125, హోండా షైన్, హీరో గ్లామర్, హీరో సూపర్ స్ప్లెండర్ వంటి కొన్ని మోడళ్లకు పోటీగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. డిజైన్ పరంగా బజాజ్ సిటి 125ఎక్స్ మోటార్‌సైకిల్ అవుట్‌గోయింగ్ బజాజ్ సిటి 110ఎక్స్ మోటార్‌సైకిల్‌కు చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది. అయితే, ఈ కొత్త మోటార్‌సైకిల్ పై '125X' బ్యాడ్జింగ్, కొద్దిగా భిన్నమైన గ్రాఫిక్స్, రిబ్బెడ్ సీట్ మరియు బ్లాక్ కలర్ కిక్ రాడ్ వంటి కొన్ని మార్పులను ఉన్నాయి.

మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

అంతేకాకుండా, రాబోయే బజాజ్ CT125X టైప్-A యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది, ప్రస్తుత టెక్ యుగంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఇందులో ముందు వైపు ఎల్ఈడి డైటైమ్ రన్నింగ్ లైట్ మరియు దాని దిగువ భాగంలో గుండ్రటి హెడ్‌ల్యాంప్ మరియు దాని ప్రొటెక్ట్ చేసే మెటల్ కేసింగ్, దిగువ భాగంలో ఇంజన్ మరియు సైలెన్సర్లను రక్షించే క్రాష్ గార్డ్, సైలెన్స్ ఎగువన జోడించిన లగేజీ క్యారియర్, సైడ్ క్రాష్ గార్, హ్యాండిల్‌బార్‌పై రబ్బర్ గ్రిప్‌లు, ముందు మరియు వెనుక భాగంలో సెమీ-నాబీ టైర్లు, ఫోర్క్ లలోకి దుమ్ము, దూళి చేరకుండే ఉండేందుకు ఫోర్క్ గైటర్‌లు మరియు వెనుక గ్రాబ్ రెయిల్ పై అమర్చిన లగేజ్ క్యారియర్‌ వంటి విశిష్టమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

ఇందులోని V- ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆల్-బ్లాక్ ఎఫెక్ట్‌తో కూడిన హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్ సెటప్‌తో ఈ మోటార్‌సైకిల్ కొంచెం స్పోర్టీగా కనిపిస్తుంది. ఈ కొత్త బజాజ్ సిటి 125ఎక్స్ మోటార్‌సైకిల్ బజాజ్ పల్సర్ 125 మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 మోటార్‌సైకిళ్లలో ఉపయోగిస్తున్న అదే 125సీసీ ఇంజన్‌ను కలిగి ఉంటుంది ఈ ఇంజన్ గరిష్టంగా 11.6 బిహెచ్‌పి శక్తిని మరియు 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండే అవకాశం ఉంది.

మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?

ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న బజాజ్ సిటి 100ఎక్స్ మోటార్‌సైకిల్ 115సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 8.5 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 9.81 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ మోడల్ కేవలం 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మార్కెట్లో Bajaj CT110X మోటార్‌సైకిల్ ధరలు రూ. 66,298 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. కాగా, కొత్త Bajaj CT125X మోటార్‌సైకిల్ ధర దాదాపు రూ. 75,000 (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Upcoming bajaj ct125x appeared at dealership before its officia launch details
Story first published: Sunday, August 14, 2022, 19:54 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X