భారతీయ మార్కెట్‌కి రానున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ - వివరాలు

ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు రాజ్యమేలుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో మొత్తమ్ ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగంలో ఉంటాయని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. రాబోయే రోజుల్లో విడుదల కానున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ ఇక్కడ చూడవచ్చు.

సింపుల్ వన్:

చాలా రోజులనుంచి వాహన ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో ఒకటి ఈ 'సింపుల్ వన్'. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటివరకు డెలివరీలను ప్రారంభించలేదు. కాగా డెలివరీలు 2023 మొదటి త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

భారతీయ మార్కెట్‌కి రానున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటివరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 55,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 'రెడ్, వైట్, బ్లాక్ మరియు బ్లూ' అనే నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 4.8 కిలోవాట్ పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్:

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే విజయ పతాకం ఎగురవేసిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ విభాగంలో ఎస్1, ఎస్1 ప్రో మరియు ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. కంపెనీ 2022 నవంబర్ నెలలో 20,000 యూనిట్లను విక్రయించగలిగింది. రానున్న రోజుల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి, అనేక ఆధునిక ఫీచర్స్ అందుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, కావున ఇది ఎలాంటి డిజైన్ పొందుతుంది, ఎంత రేంజ్ అందిస్తుందనే చాలా విషయాలు గురించి స్పష్టమైన వివరణ అందుబాటులో లేదు. ఇవన్నీ త్వరలోనే వెల్లడవుతాయని ఆశిస్తున్నాము.

హస్క్‌వర్నా ఎలక్ట్రిక్ స్కూటర్:

బజాజ్ ఆటో యాజమాన్యంలో ఉన్న స్వీడన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హస్క్‌వర్నా స్వార్ట్‌పిలెన్250 మరియు విట్‌పిలెన్ 250 వంటివాటిని విక్రయిస్తూ ముందుకు సాగుతోంది. కాగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా సార్లు టెస్ట్ చేయబడింది. ఇది ఒక పెద్ద 5.5kWh బ్యాటరీ ప్యాక్ మరియు 10kW ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చే అవకాశం ఉంది.

యమహా ఎలక్ట్రిక్ స్కూటర్:

దేశీయ ద్విచక్ర వాహన విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న 'యమహా' ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్కూటర్ త్వరలోనే దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించి చాలా వివరాలు ప్రస్తుతానికి కంపెనీ వెల్లడించలేదు. కాగా ఇవన్నీ త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

హోండా ఎలక్ట్రిక్ స్కూటర్:

భారతీయ మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'హోండా మోటార్‌సైకిల్' కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ వచ్చే సంవత్సరం తప్పకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయాలని కంకణం కట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ దీని పైన నిర్విరామంగా పనిచేస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసి ఈ విభాగంలో కూడా పురోగతిని సాధించనుంది.

Most Read Articles

English summary
Upcoming electric two wheelers in india details
Story first published: Sunday, December 4, 2022, 8:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X